Showing posts with label Entertainment News. Show all posts
Showing posts with label Entertainment News. Show all posts

6/22/17

హీరో విజయ్ పుట్టినరోజు స౦దర్భ౦గా ఈ సినిమా ట్రైలర్


 టాలీవుడ్ లో గ్రీకు వీరుడుగా పేరు తెచ్చుకున్న నాగార్జునకున్న లేడీస్ ఫాలోయి౦గ్ మరో హీరోకు లేద౦టే అది అతిశయో క్తి కాదేమో. త౦డ్రి అక్కినేని లాగే రొమా౦టిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన నాగార్జున ఇప్పటికీ అదే ఇమేజ్ ను మెయి౦టైన్ చేస్తున్నాడు. అప్పట్లో నాగ్ అమలల ప్రేమాయణ౦ టాక్ ఆఫ్ ది ఇ౦డస్ట్రీ అయితే అతని తనయుడు నాగచైతన్య లవ్ స్టోరీ కూడా హాట్ టాపిక్ అయిన విషయ౦ తెలిసి౦దే ఈ త౦డ్రీ కొడుకుల ప్రేమకథల్ని గుర్తుచేస్తూ తమ సినిమాపై ప్రేక్షకుల్లో అటెన్షను క్రియేట్ చెయ్యాలని 'ఏజె౦ట్ భైరవ' నిర్మాత పెద్ద ప్లానే వేసినట్టున్నాడు. విజయ్ హీరోగా భరతన్ దర్శకత్వ౦లో రూపొ౦దిన తమిళ చిత్ర౦ 'భైరవ'. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటి౦చిన ఈ చిత్ర౦ తమిళ౦లో అట్టర్ ఫ్లాప్ గా నిలిచి౦ది. ఇదే చిత్రాన్ని 'ఏజె౦ట్ భైరవ' పేరుతో బెల్ల౦ రామకృష్ణారెడ్డి తెలుగులో అ౦దిస్తున్నారు.

హీరో విజయ్ పుట్టినరోజు స౦దర్భ౦గా ఈ సినిమా ట్రైలర్ ను గురువార౦ విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో హీరో విజయ్ తన స్నేహితుడిని ప్రేమ గురి౦చి సలహా అడుగుతాడు. అ౦దుకు అతను 'లవ్ క౦టూ పెద్ద ట్రె౦డు ఉ౦డదు గురూ...అప్పట్లో నాగార్జున లెటర్స్ రాసేవాడు. ఇప్పుడు నాగచైతన్య ట్వీట్లు చేస్తున్నాడు' అని చెప్పే డైలాగ్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేస్తో౦ది. తమిళ౦లో ఆశి౦చిన విజయాన్ని అ౦దివ్వలేకపోయిన 'భైరవ' నిర్మాత ట్రిక్కులు ఫలి౦చి ఇక్కడైనా ఫరవాలేదు అనిపి౦చుకు౦టు౦దో చూడాలి.

12/8/16

ఈ వయసులోనూ యంగ్ హీరోలతో ‘చిరు’ పోటీ..

మెగా అభిమానులకు శుభవార్త.. ఎప్పుడెప్పుడా చిరు 150వ సినిమా ‘ఖైదీ నంబరు 150’ విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు చిన్నపాటి శుభవార్తను అందించింది చిత్రబృందం. చిరు 150వ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. ఈ టీజర్‌‌ను బట్టే సినిమా ఏ రేంజ్‌‌లో ఉంటుందో చెప్పేయచ్చు. మెగాస్టార్ రీ-ఎంట్రీకోసం ఎంతగానే వేచిచూస్తున్న అభిమానులకు తాజాగా విడుదలైన ఖైదీ టీజర్ ఉత్తేజాన్నిచ్చేలా ఉంది. ఈ టీజర్‌‌లో చిరు ఇదివరకు నటించిన సినిమాలతో పోలిస్తే చాలా డిఫరెంట్‌గా ఉంది.



అచ్చుగుద్దినట్లుగా శంకర్ దాదా జిందాబాద్, స్టాలిన్‌‌ సినిమాల్లోలాగే చిరు యంగ్‌‌గా ఈ సినిమాలో కూడా కనిపించనున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి చూస్తే.. 61ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోలతో పోటీపడేలా నటన.. స్టెప్స్..వేసి అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాడు మెగాస్టార్. తాజాగా విడుదలైన టీజర్‌లో.. మెగాస్టార్ చిరంజీవి సరికొత్త గెటప్‌లో కనిపిస్తున్నాడు. టీజర్ చూసిన అభిమానులు.. కెవ్వుకేక, వావ్ సూపర్, అదిరిపోయింది అంటూ తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

బహుశా చిరు టీజర్ ఇలా ఉంటుందని అభిమానులెవరూ ఊహించి ఉండరు. ‘ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా..నచ్చితేనే చూస్తా..కాదని బలవంతం చేస్తే..కోస్తా..ఏ స్వీట్ వార్నింగ్’అంటూ చిరు తనదైన స్టైల్లో చెప్పిన డైలాగ్ కెవ్వుమనిపిస్తోంది. ఈ ఒక్క డైలాగు మెగా అభిమానుల్లో ఉత్సహాన్ని ఉరకలెత్తిస్తోంది. చిరంజీవికి స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టిన ఖైదీ సినిమా రేంజ్‌లో ఈ సినిమా కూడా ఉంటుందని అభిమానుల్లో అంచనాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి. ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఈ టీజర్‌‌లోనే తెలిసిపోతోందని అభిమానులు చెప్పకనే చెబుతున్నారు.

12/3/16

మన్యం పులి


మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్ గురించి తెలియ‌ని తెలుగు ప్రేక్షకులు ఉండ‌క‌పోవ‌చ్చు. విల‌క్షణ న‌టుడుగా ఎన్నో పాత్రల్లో మెప్పించిన మోహ‌న్‌లాల్ ఇప్పుడు తెలుగు సినిమాల్లో కూడా న‌టిస్తున్నారు. ఈ ఏడాది ఆయ‌న న‌టించిన మ‌నమంతా, జ‌న‌తాగ్యారేజ్ చిత్రాలు ప్రేక్షకుల ఆద‌ర‌ణ పొందిన‌వే. మోహ‌న్‌లాల్‌కు తెలుగులో మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. ఈ క్రేజ్ దృష్ట్యా మోహ‌న్‌లాల్ నటించిన పులిమురుగ‌న్ సినిమాను తెలుగులో మ‌న్యం పులి అనే పేరుతో విడుద‌ల చేస్తున్నారు నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి. మ‌ల‌యాళంలో వంద కోట్ల‌కు పైగా క‌లెక్షన్స్‌తో స‌రికొత్త రికార్డును క్రియేట్ చేసిన పులిమురుగ‌న్ తెలుగులో మ‌న్యంపులిగా ఎలాంటి స‌క్సెస్‌ను తెచ్చుకుంటుందో తెలుసుకోవాలంటే క‌థ‌లోకి వెళ‌దాం..


క‌థ‌:
పులియూర్ మ‌న్యం ప్రాంతం. అక్కడ పులులు సంచ‌రిస్తుంటాయి. ఓ పులి భారిన ప‌డి వాటి కార‌ణంగా కుమార్ (మోహ‌న్‌లాల్‌) తండ్రిని కోల్పోతాడు. అత‌ని చిన్నప్పుడే త‌ల్లి కూడా చ‌నిపోతుంది. త‌న త‌మ్ముడు మ‌ణిని కూడా అత‌డే పెంచి పెద్ద చేస్తాడు. త‌న తండ్రిని చంపిన పులిని త‌న బావ సాయంతో మ‌ట్టుబెడ‌తాడు. అప్పటి నుంచి పులిని వేటాడ‌టంలో ఆరితేరుతాడు. అనాథ అయిన అమ్మాయి మైనా (క‌మ‌లిని ముఖ‌ర్జీ)ని పెళ్లాడుతాడు. వాళ్ల‌కి చిన్ని అనే పాప కూడా ఉంటుంది. అనుకోకుండా పాత విరోధం ఉన్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (కిశోర్‌)తో కుమార్‌కి గొడ‌వ‌లు మ‌ర‌లా తిర‌గ‌బెడుతాయి. దాంతో ఫారెస్ట్ ఆఫీస‌ర్ నుంచి అత‌నికి ఇబ్బందులు మొద‌ల‌వుతాయి.

స‌రిగా అదే స‌మ‌యంలో మ‌ణి స్నేహితులు ఇద్ద‌రు క‌లిసి కుమార్ కుటుంబాన్ని సిటీకి తీసుకెళ్తారు. అక్క‌డ డాడీ గిరిజ (జ‌గ‌ప‌తిబాబు) ద‌గ్గ‌ర ప‌ని ఇప్పిస్తారు. సెకండాఫ్‌లో డాడీ గిరిజ పులియూర్‌లో కుమార్ కోసం తిరుగుతుంటాడు. కుమార్ ని చంపాల‌ని ప్రయ‌త్నం చేస్తాడు. డాడీ గిరిజ‌కు, కుమార్‌కు అంత వైరం ఎందుకు వ‌చ్చింది? మ‌ణి ప‌రిస్థితి ఏంటి? డాడీ గిరిజ అస‌లు ఎవ‌రు? మ‌ధ్యలో జూలీ (న‌మిత‌)కి కుమార్‌తో ఉన్న సంబంధం ఏంటి? వ‌ంటివ‌న్నీ ఆస‌క్తిక‌రం.


ప్లస్ పాయింట్లు
సినిమాలో ప్లస్ పాయింట్లు చాలానే ఉన్నాయి. మ‌న్యం పులి అనే టైటిల్‌కు త‌గ్గట్టు ఈ సినిమా స్క్రీన్ మొత్తాన్ని ఆక్రమించేసింది మోహ‌న్‌లాల్ న‌ట‌న‌. అతి త‌క్కువ మేక‌ప్‌తో అడ‌వుల్లో పెరిగిన అమ్మాయిలాగా చ‌క్కగా న‌టించింది క‌మ‌లిని. ఎస్టేట్ ఓన‌ర్ కూతురిగా, స్థానిక యువ‌కుడిపై క‌న్నేసిన పాత్రలో గ్లామ‌ర‌స్‌గా క‌నిపించే ప్రయ‌త్నం చేసింది న‌మిత‌. ఫారెస్ట్ రేంజ్ ఆఫీస‌ర్ గా కిశోర్ న‌ట‌న‌, డాడీ గిరిజ పాత్ర‌లో జ‌గ‌ప‌తిబాబు చాలా బాగా మెప్పించారు. ఖాద‌ర్‌గా, మేస్త్రీగా, కుమార్ బావ‌గా చేసిన న‌టుల పెర్ఫార్మెన్స్ కూడా మెప్పిస్తుంది.

తెర‌మీద పులి కనిపించ‌గానే వ‌చ్చే స‌న్నివేశాలు చాలా బావుంటాయి. ఒళ్లు గ‌గుర్పొడుస్తుంది. గోపీసుంద‌ర్ సంగీతంలో పాట‌లు బావున్నాయి. నేప‌థ్య సంగీతం కూడా చాలా బావుంది. లొకేష‌న్లు ప‌చ్చపచ్చగా క‌ళ్లకు ఆహ్లాద‌క‌రంగా ఉన్నాయి. పీట‌ర్ హెయిన్స్ కంపోజ్ చేసిన ఫైట్లు సినిమాకు ప్రత్యేక ఆక‌ర్షణ‌. చిన్న పిల్ల‌ల‌కు పులి ఎపిసోడ్స్ త‌ప్పకుండా నచ్చి తీరుతాయి. పులితో ఫైట్ చేసే స‌మ‌యంలో మోహన్‌లాల్ ఫేస్ ఎక్స్ ప్రెష‌న్స్, అతను ప‌న్నే వ్యూహాలు బిగ్ స్క్రీన్ మీద బావున్నాయి.


మైన‌స్ పాయింట్లు
అడ‌విలో చిన్న గుడారంలో క‌థ‌లు తెలుగు ప్రేక్షకుల‌కు కొత్త కాదు. క‌థ‌నం కూడా గొప్పగా ఏమీ లేదు. సినిమాలో కామెడీ పెద్దగా లేదు. న‌మిత పాత్రను చూసి క‌మ‌లిని ముఖ‌ర్జీ ఉడుక్కునే స‌న్నివేశాలు పెద్దగా మెప్పించ‌వు. ఆడ‌వాళ్లు స్నానం చేస్తుంటే చూసే వీక్‌నెస్ ఉన్న క‌మెడియ‌న్ పాత్ర ఎబ్బెట్టుగా ఉంటుంది. హీరో త‌మ్ముడి పాత్రను ఇంకాస్త మెరుగ్గా మ‌ల‌చి ఉంటే బావుండేదేమో. నిడివి బాగా ఎక్కువైన‌ట్టు అనిపిస్తుంది.


స‌మీక్ష
ఈ త‌ర‌హా సినిమా తెలుగు తెర‌పై క‌నిపించి చాన్నాళ్ల‌యింది. అనువాద సినిమా అయిన‌ప్పటికీ ఈ సినిమా చూడ్డానికి బావుంది. మోహ‌న్‌లాల్ ఈ వ‌య‌సులో పులితో చేసే రోప్ ఫైట్లు రోమాంఛితుల్ని చేస్తాయి. క‌మ‌లిని మేక‌ప్ లేకుండా పిల్ల త‌ల్లిగా చాలా నేచుర‌ల్‌గా క‌నిపించింది. జ‌గ‌ప‌తిబాబు పాత్ర కూడా బావుంది. ప‌వ‌ర్‌ఫుల్ విల‌న్‌గా గ్రే లుక్స్ తో జ‌గ‌ప‌తిబాబు త‌న‌వంతు న్యాయం చేశారు.

ఓ స‌న్నివేశంలో మోహ‌న్‌లాల్ వ‌చ్చి జ‌గ‌ప‌తిబాబు కాళ్లు ప‌డ‌తాడు. మ‌రో స‌న్నివేశంలో మోహ‌న్‌లాల్‌ని క‌మ‌లిని ముఖ‌ర్జీ కాలుతో త‌న్నుతుంది. అంత పెద్ద స్టార్ త‌న ఇమేజ్‌ను ప‌క్క‌న‌పెట్టి చేసిన స‌న్నివేశాలు ఆయా సంద‌ర్భాల‌లో స‌న్నివేశాల‌కు మ‌రింత బ‌లాన్ని చేకూర్చాయి. చిన్న పిల్ల‌లు పులితో మోహ‌న్‌లాల్ చేసే యాక్ష‌న్ ఎపిసోడ్ల‌ను ఇష్ట‌ప‌డ‌తారు. మ‌ల‌యాళ న‌టుడైన‌ప్ప‌టికీ మోహ‌న్‌లాల్ ఇటీవ‌ల `మ‌న‌మంతా`, `జ‌న‌తాగ్యారేజ్‌` చిత్రాల‌తో తెలుగువారికి బాగా ద‌గ్గర‌య్యారు. అది కూడా ఈ సినిమాకు హెల్ప్ అవుతుంద‌ని అనుకోవ‌చ్చు.


బాట‌మ్ లైన్‌: ఈ సినిమాకు బ‌లం `మోహ‌న్‌లాల్ +పులి`
రేటింగ్‌: 3/5

11/30/16

మోక్షజ్ఞ సినీ రంగప్రవేశానికి ఏర్పాట్లు


బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీ రంగప్రవేశానికి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. వచ్చే ఏడాది చివర్లో గాని, 2018 ప్రారంభంలోగాని ఆ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లే సూచనలు ఉన్నాయట. తెలుగు సినీ పరిశ్రమ టాప్‌ డైరెక్టర్లు రాజమౌళి లేదా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సినిమాలతో అరేంగట్రం చేయించాలని బాలయ్య అనుకున్నాడు.


మోక్షజ్ఞ మొదటి సినిమాను వేరొకరితో చేయించమని, తర్వాతి సినిమా తప్పకుండా చేస్తామని ఇద్దరూ బాలయ్యకు మాటిచ్చారట. ఈ నేపథ్యంలో తనకు సన్నిహితుడైన వీర మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను సినిమాతో మోక్షజ్ఞను అరంగేట్రం చేయిద్దామని బాలయ్య అనుకున్నాడట. అయితే తాజాగా బాలయ్య మనసు మార్చుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం తను నటిస్తున్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా డైరెక్టర్‌ క్రిష్‌ చేతిలో మోక్షజ్ఞను పెట్టాలని డిసైడ్‌ అయ్యాడట. క్రిష్‌ పనితనం, నటుల నుంచి యాక్టింగ్‌ రాబట్టుకునే విధానం బాలయ్యకు బాగా నచ్చాయట. అందుకే మోక్షజ్ఞ హీరోగా సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఆ సినిమాను క్రిష్‌కు అప్పగిస్తున్నాడట బాలయ్య.

11/23/16

Arjun Rampal to bolster advancement cancer awareness initiative

Amidst work obligations, if there is one action that Arjun Rampal quickly needs to dedicate his chance to, it is for his fight against the most dreaded disorder – tumor. Not a lot of might realize that the playing out craftsman's mother Gwen Rampal is a chest development survivor and as far back as he has seen her fight, he did his bit for tumor patients.



Starting late, Arjun Rampal announced that he will venture forward in his fight for danger patients and will dispatch Gwen Rampal Foundation soon. He elevate proceeded to determine this is an attempt to spread care about the disorder especially among women and he in like manner needs everyone to find the opportunity to treat themselves. Keeping up that he is one of the lucky ones to hold up under the cost of the treatment that is required for this, Arjun needs his drive to focus on direct rates for treatment and terms it as 'offering trust' to poor families.

From what we tune in, the on-screen character has starting now started manage his foundation and has collaborated with a social affair of worldwide masters for the same. He communicated that he needs to start this as a little movement now yet he has specific experts who too will fly down from various countries as a bit of this program. He in like manner has courses of action to tie up with adjacent recuperating focuses that can treat a particular number of patients consistently free of cost.

Continue going found in Rock On 2, Arjun Rampal is planning for yet another release one week from now with Kahaani 2. The performing craftsman similarly has Daddy a film roughly in light of the life of criminal Arun Gawli in the pipeline and subsequently will kick start Aankhen 2 in front of calendar one year from now.
హీరో నాగబాబు నిర్మాతగా అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. లగడపాటి శ్రీధర్‌తో కలసి నాగబాబు నిర్మించే ఈ మూవీ ద్వారా ప్రముఖ రచయిత వక్కంతం వంశీ డైరెక్టర్‌గా పరిచయం కానున్నాడు. వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది.


 

అందమైన కనుబొమలు న సొంతం

ప్రియాంక చోప్రాకి ఉన్న ఒకే ఒక్క బలం తన కనుబొమలట. 34 ఏళ్ల ఈ మిస్‌ వరల్డ్‌ తన వస్త్రధారణ, మేకప్‌ విషయంలో కన్నా కనుబొమల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటానని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అందమైన కనుబొమలు తన సొంతమని, వాటిని అచ్చం కవలల్లా కనిపించేంత పర్‌ఫెక్ట్‌గా షేప్‌ చేయించుకున్నానని తెలిపింది.



‘అందరూ కనుబొమలు షేప్‌ చేయించుకుంటే కజిన్స్‌, సిస్టర్స్‌లా కనిపించాలని ట్విన్స్‌లా కనిపించేలా ఉండకూడదని చెప్తుంటారు. అంటే రెండిటి ఆకృతి కచ్చితంగా ఒకేలా ఉండకూడదని, కొంచెం తేడా ఉండాలని వారి అభిప్రాయం. కానీ నా కనుబొమలు అలా కాదు. అవి కవలల్లాగే ఉంటాయి. అలా ఉండేలా చాలా జాగ్రత్తలు తీసుకుంటా. అదీకాకుండా చాలా మంది తమ ముక్కు బాలేదనో, జుట్టు బాలేదనో వాటి గురించి మాట్లాడడానికి ఇష్టపడరు. అలా ఉండకూడదు. మనలోని అందమేంటో.. బలమేంటో దాని గురించి ధైర్యంగా మాట్లాడగలగాలి’ అని చెప్పుకొచ్చింది.



11/21/16

అందరికీ వినిపించే ఘడియ ఎప్పుడువస్తుంది

 


నువ్వే చూసుకోవాలి అంటూ ప్రార్థించేవాళ్లపై నాకు ఎలాంటి గౌరవం లేదంటోంది శ్రుతిహాసన్‌. ‘కష్టేఫలి’ సూత్రాన్ని నమ్ముతానంటున్న శ్రుతి ప్రస్తుతం ‘కాటమరాయుడు’ కోసం పవన్‌ కల్యాణ్‌తో జోడీ కట్టింది. శ్రుతి మాట్లాడుతూ ‘‘ఒక గూటి పక్షులంతా ఒకే చోట చేరతారట. అలా నా చుట్టూ కష్టాన్ని గౌరవించేవాళ్లే ఉంటారు. మా కంటికి చిన్నపనీ... పెద్ద పనీ అంటూ తేడాలుండవు. ప్రతిదీ విలువైనదే. కష్టపడని వాళ్లకు అసలు మాట్లాడే అర్హత లేదు. ఖాళీగా ఉండడం నాకంటికి పెద్ద నేరంలా కనిపిస్తుంది. అందుకే షూటింగ్‌ లేనప్పుడల్లా నాపై నాకే విసుగొస్తుంది. అలాంటి సమయాల్లో పాటలు పాడుకొంటూ, రాసుకొంటూ, కొత్త ట్యూన్లు కట్టుకొంటూ కాలక్షేపం చేస్తుంటా. అయితే అవన్నీ అందరికీ వినిపించే ఘడియ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నా’’ అంటోంది. అంటే శ్రుతి తొందర్లోనే సంగీత దర్శకురాలిగానూ తన టాలెంట్‌ చూపించడానికి సమాయాత్తమవుతోందన్నమాట.

మళ్లీ రంగంలోకి దిగాడు..... యాభై రోజుల తర్వాత





యువ కథానాయకుడు వరుణ్‌తేజ్‌ మళ్లీ రంగంలోకి దిగాడు. యాభై రోజుల సుదీర్ఘ విరామం తర్వాత ‘మిస్టర్‌’ చిత్రీకరణ కోసం సోమవారమే సెట్‌లోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘మిస్టర్‌’, శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ‘ఫిదా’ చేస్తున్నారు వరుణ్‌. ‘మిస్టర్‌’ కోసం ఓ యాక్షన్‌ సన్నివేశం చిత్రీకరిస్తుండగా వరుణ్‌తేజ్‌ గాయపడ్డారు. కాలికి గాయం కావడంతో యాభై రోజులుగా బెడ్‌కే పరిమితమయ్యారు. వరుణ్‌ గాయం నుంచి కోలుకోవడంతో సోమవారం నుంచి హైదరాబాద్‌లో ‘మిస్టర్‌’ చిత్రీకరణ షురూ అయ్యింది. మళ్లీ సెట్‌లోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉందని వరుణ్‌తేజ్‌ ట్వీట్‌ చేశారు.

సుమ కనకాల తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి దొరికిపోయింది

స్టార్ యాంకర్ సుమ కనకాల తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి దొరికిపోయింది. తన పొరబాటుని కప్పిపుచ్చుకోవడానికి వీలులేకుండా పోయేసరికి టాపిక్ ని డైవర్ట్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే.. కొన్ని రోజుల క్రితం ఓ టీవీ ఛానల్ కోసం పవన్ ని సుమ ఇంటర్వ్యూ చేసింది. అందులో భాగంగా పవర్ స్టార్ గదిలోని పుస్తకాల వైపు చూసి రీడింగ్ అంటే బాగా ఇష్టమా? అని ప్రశ్నించింది. అందుకు ఆయన అవును, నాకు మహానుభావులు రాసిన పుస్తకాలూ చదవడం అంటే ఇష్టమని చెప్పుకొచ్చారు.
స్కూల్ లోను బాగా చదివే వారా? అని సుమ అడిగితే… “నాకు చిన్నప్పుడు చదువు మీద శ్రద్ద ఉండేది కాదు. ఎందుకంటే వారు చెప్పేది నాకు అర్ధమయ్యేది. ఒక ఆస్ట్రానమీ మాత్రమే ఆసక్తికరంగా అనిపించేది” అని పవన్ చెబుతుండగానే.. మధ్యలో స్టార్ యాంకర్ కల్పించుకుని.. అయితే సోషల్ అంటే మీకు ఇష్టం అన్న మాట అంటూ వాగేసింది. ఆ వాగుడులోనే సుమ జ్ఞానం పవన్ ని తెలిసింది. అయినా ఆమెను కించపరచకుండా, చిన్న నవ్వు నవ్వి.. ఆస్ట్రానమీ అంటే సోషల్ కాదు.. ఖగోళ శాస్త్రం అని వివరించారు. అప్పటికి తప్పుని ఒప్పుకోని సుమ .. నేను సోషల్లో వీక్ అంటూ నవ్వేసింది. ఆస్ట్రానమీ, సోషల్ కి ఉన్న తేడా తెలియని సుమ ఎంత వరకు చదువుకుందోనని అదే ప్రశ్నను ఆమెను అడిగారు. అప్పుడు మేల్కొన్న సుమ, వెంటనే ఆ టాపిక్ ని అక్కడ వదిలేసి పవన్ ని వేరే ప్రశ్నలోకి తీసుకెళ్లింది. ఈ విషయం లేటుగా తెలిసినా, సోషల్ మీడియా వల్ల లేటెస్ట్ వార్త అయింది. పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సుమ కి ఇప్పటికైనా అర్థమయి ఉంటుంది.



11/20/16

మహేష్ బాబు తో రాజమౌళి మూవీ ప్లాన్

బాహుబలి’ సినిమా కంటే ముందే జక్కన్న రాజమౌళి దేశవ్యాప్తంగా పాపులర్‌ అయ్యాడు. ఆయన రూపొందించిన ‘మగధీర’, ‘ఈగ’ సినిమాలు ఆయనను నేషనల్‌ వైడ్‌గా పాపులర్‌ చేశాయి. ఇక, ‘బాహుబలి’ ఆయన ఇమేజ్‌ను అమాంతంగా పైకి లేపింది. అంత ఇమేజ్‌ను సొంతం చేసుకున్న రాజమౌళి ‘బాహుబలి-2’ తర్వాత చేయబోయే సినిమా ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఆయన ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.


ఇకపై తెలుగు హీరోలతో సోలోగా సినిమాలు చేయడానికి రాజమౌళి సిద్ధపడరని తెలుస్తోంది. జాతీయ స్థాయిలో మార్కెట్‌ ఏర్పరుచుకున్నాక తెలుగు హీరోలతో ప్రాంతీయ సినిమాలు చేయాలని ఏ దర్శకుడూ అనుకోడు. అందుకే అమీర్‌ఖాన్‌తో సినిమా చేయాలని రాజమౌళి భావిస్తున్నారట. అమీర్‌ వెంటనే రెడీ అనేస్తే రాజమౌళి తర్వాతి సినిమా ఆయనతోనేనట. కానీ, అమీర్‌ కొన్ని రోజులు ఆగమంటే మాత్రం ‘ఈగ-2’ను ప్రారంభించాలనే ఆలోచన ఉందట.

‘ఈగ-2’ను కూడా జాతీయ స్థాయిలో చాలా భారీగానే తీస్తారట. ఇకపోతే, మహేష్‌తో ఓ సినిమా చేయాలని రాజమౌళి ఎప్పుడో ఒప్పందం కుదుర్చుకున్నారు. అందుకే మహేష్‌‌తో మాత్రమే ఓ సినిమా ఏ సమయంలోనైనా చేస్తారట.

11/19/16

విక్టరీ కి కింగ్ కి వార్

నాగార్జున‌, విక్ట‌రీ వెంక‌టేష్ ఇద్ద‌రూ ఇద్ద‌రే. ఫ్యామిలీ ఇమేజ్‌తో వీరు గ‌త మూడున్న‌ర ద‌శాబ్దాలుగా టాలీవుడ్ ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేశారు. ఇక వీరిద్ద‌రు సీనియారిటీ దృష్ట్యా త‌మ వ‌య‌స్సుకు త‌గ్గ పాత్ర‌లు ఎంపిక చేసుకుంటూ ఆన్ స్క్రీన్‌పై దూసుకుపోతున్నారు.


వెంకీ ఇప్ప‌టికే ప‌వ‌న్‌, మ‌హేష్ లాంటి స్టార్ హీరోల‌తో మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేసి హిట్లు కొట్టాడు. ఇక నాగ్ ఊపిరి, మ‌నం, సోగ్గాడు లాంటి వైవిధ్య‌మైన క‌థుల ఎంపిక చేసుకుంటూ తిరుగులేని హిట్లు సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ ఇద్ద‌రు బావ‌బావ‌మ‌రుదుల మ‌ధ్య ఇప్పుడు టాలీవుడ్‌లో ఆస‌క్తిక‌ర‌మైన వార్‌కు తెర‌లేవ‌నుంది.

ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రు హీరోలు త‌మ ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారు. వెంకీ గురులో న‌టిస్తుంటే, నాగ్ కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో ఓం న‌మోః వెంక‌టేశాయా సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ముందుగా సంక్రాంతి రేసులో ఉంటాయ‌ని వార్త‌లు వ‌చ్చాయి.

సంక్రాంతికి మ‌రో ఇద్ద‌రు అగ్ర హీరోలు బాల‌య్య గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి, చిరు ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దీంతో వీరిద్ద‌రు త‌మ సినిమాల‌ను ఫిబ్ర‌వ‌రి ఫ‌స్ట్ వీక్‌కు వాయిదా వేసుకున్నారు. దీంతో ఈ బావ‌బావ‌మ‌రుదుల మ‌ధ్య ఇప్పుడు టాలీవుడ్‌లో ఆస‌క్తిక‌ర‌మైన ఫైటింగ్‌కు తెర‌లేవ‌నుంద‌న్న టాక్ ఇండ‌స్ట్రీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ బావ‌బావ‌మ‌రుదుల పోరులో ఎవ‌రు విజ‌యం సాధిస్తారో చూడాలి.

ఎన్టీఆర్,అల్లుఅర్జున్ లతో పూరి మల్టీస్టారర్ మూవీ


తెలుగు తెరపై మరో భారీ మల్టీ స్టారర్‌కు తెర లేవనుందా? ఇద్దరు స్టార్‌ హీరోలు తొలిసారి కలిసి పనిచేయబోతున్నారా? దీనికి అవుననే సమాధానం లభిస్తోంది. యంగ్‌ టైగర్‌ ఎన్టీయార్‌, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో ఓ భారీ మల్టీస్టారర్‌కు రంగం సిద్ధమవుతోందట.
ఇప్పటికే సాయిధరమ్‌, కల్యాణ్‌ రామ్‌ కలయికలో ఓ మల్టీస్టారర్‌ రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్‌ హీరోల కలయిక వార్త సంచలనాన్ని సృష్టిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాను పూరీ జగన్నాథ్‌ తెరకెక్కిస్తాడట. ఇప్పటికే ఈ సినిమా కథను ఎన్టీయార్‌, బన్నీకి వినిపించాడట పూరి. ఈ లైన్‌ ఆ హీరోలకు బాగా నచ్చిందట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

11/16/16

Baahubali 2' Neglected for '2.0

It is notable that Bollywood movie producer Karan Johar has discharged the Hindi form of Rajamouli's epic film 'Baahubali'. Presently, it appears that he has set his eyes the following huge excursion from South, "2.0" featuring Rajinikanth.



As indicated by an official proclamation discharged by Lyca Creations, the creators of '2.0', the main look dispatch occasion of the film will happen at the prestigious Yash Raj Studios in Mumbai on twentieth November. The creators have additionally affirmed that Karan Johar has been given over the duty to have the occasion. The film's whole thrown including chief Shankar and makers will be available at the occasion.With Karan Johar's contribution in the principal look dispatch occasion, which will be hung on a substantial scale in Mumbai, it goes to the light that he some way or another has connected with the venture, for the most part he may have hit an arrangement with the creators to discharge the film's Hindi variant.It should likewise be noticed that reports have developed in the late times that KJo was indicating hesitance to gain the Hindi privileges of 'Baahubali 2' as high cost was being cited. It's too soon to make an association however.

Saahasam Swaasaga Saagipo review audience point of view

Rajinikanth (Naga Chaitanya) takes off on a road trip with his sister's friend, Divya (Manjima Mohan). They meet with an organized accident which handles the two in the recuperating focus where Divya surrenders him to tend to her people who get attacked by goons. Rajinikanth clears a way to Kolhapur to mind Divya and winds up in a whirlpool of wrongdoing, interest and life-incapacitating conditions. After a movement of passings, he rises above fear and take control of the condition.



Film Study: With those hypnotizing visuals, that spellbinding Rahman music and Chinmayi's trademark voice, Saahasam Swaasaga Saagipo recreates the charm which you would expect of a Goutham Menon movie. While the main half is for the most part dedicated to opinion, the second half is all of a sudden action squeezed. Besides, movement, I mean guns, murders, revolt cops – the works. So the minutes in the groupings between Naga Chaitanya and Manjima will desert you with something you'd have to confer and discuss to your loved one later. Next to no else happens in the central half, and it for all intents and purposes skirts on weakness.

The second half has an impressive measure happening and the gathering of spectators are comparably as dumbfounded as the characters in the movie. You'll have to relate to Divya and Rajinikanth's turmoil as you watch the pacy scenes anyway you have no information to do in that capacity. You'll keep sitting tight for answers and each one of them are answered in a 5 minute scene in the crest, as Rajinikanth portrays it. It likely would've been excellent if the story unraveled reliably over the cross of 2 and a half hours, rather.

Regardless of the way that the get-together of individuals have had enough time to stew in the music given by Rahman, the visuals added to them in the film just makes it a radical new undertaking again. The day break at Kanyakumari as Thanu Nenu plays beyond anyone's ability to see, the guitar riffs as Rajinikanth conquers his sentiments of fear, the melodies when he concedes his reverence – you'll be left with minutes to bring home, all as a result of right music at the perfect time.

Naga Chaitanya's capacity as an on-screen character was lauded in Premam, yet considering that this film was made a few years earlier, his acting set him back a few years too. He without a doubt worked his charm in the energetic scenes, yet the encourage that he appeared in his latest flick was missing then. Manjima Mohan looked like your quintessential Goutham Menon champion – not customarily fantastic but instead will make you have to end up miserably fascinated. Her acting however was outstandingly convincing. Rakendu, who played Naga Chaitanya's sidekick Mahesh, passed on effectively. His talked served as dumbfounded diversion the length of he was on screen. Baba Sehgal merits an acclaim for his go about as the unrefined Marathi cop.

In case you can survive an unpredictable record for a plot that will spread out exactly at the pinnacle, Saahasam… could be a nice pick. The story in itself is incredible, and the course, cinematography and music add a wonderful plan to it. It's a film you should search for the feels.

వారసుల హీరోలలో వెనుకబడిన మంచు హీరోస్

గర్వించదగ్గ నటుల్లో మోహన్ బాబు ఒకరు. ఆయన నటనా ప్రతిభ.. ఆయన పోషించిన పాత్రల గురించి ఎంత చెప్పినా తక్కువే. నాలుగు దశాబ్దాల వ్యవధిలో 560 దాకా సినిమాలు చేశారాయన. విలక్షణ మైన నటుడి గా, హీరోగా.. విలన్‌గా.. కమెడియన్‌గా అనేక రకాల పాత్రలో మెప్పించాడు “డైలాగ్ కింగ్” డా. మోహన్ బాబు. మోహన్ బాబు పని ఇక ఐపోయింది అన్న ప్రతీ సారీ సూపర్ హిట్ తో సమాధానం ఇచ్చి విమర్శకులకు సమాధానం ఇచ్చిన హిస్టరీ మోహన్ బాబుది.

 హీరో గా తన తరం ముగియడం తో కొడుకులు ”విష్ణు” “మనోజ్” ఇద్దరూ హీరోలు గా ఎంట్రీ ఇచ్చారు. మోహన్ బాబు కూడా కొడుకులకు చాలా సపోర్ట్ చేశారు. కానీ, ఒకటి రెండు యావరేజ్ సినిమాలు తప్ప వాళ్లకి సరైన సూపర్ హిట్ ఇప్పటికీ పడలేదు. అప్పటికీ మోహన్ బాబు తన సొంత బ్యానర్ లో సినిమాలు నిర్మించి, నటించారు కూడా. అయినా సరైన సక్సెస్‌లేక మంచు హీరోలు డీలా పడిపోతున్నారు. ఇక మంచు వారి ఆడపడుచు “లక్ష్మి” తన కారియర్ స్టార్టింగ్ లో టీవీ షో లతో హడావిడి చేసినా , తరువాత నిలబడలేక పోయింది . తండ్రి మోహన్ బాబు సలహాతో హీరోయిన్/నటి గా సెటిల్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంది.

మంచు హీరోలు సినిమా సినిమాకూ కొత్త జానర్ ఎంచుకుంటారు. క్యారెక్టరైజేషన్ డిఫరెంట్‌గా వుండాలని కోరుకుంటారు. చాలానే శ్రమపడుతున్నారు. ఎన్ని చేసినా, ఎంత కష్టపడినా … ఫలితం మాత్రం దక్కడం లేదు. చాలా గ్యాప్ తీసుకుని మోహన్‌బాబు హీరోగా నటించిన చిత్రం “మామ మంచు అల్లుడు కంచు’ కూడా నిరాశనే మిగిల్చింది. విశేషమేమిటంటే ... విష్ణు కి కాని, మనోజ్ కి కానీ ఎప్పుడూ సినిమాలు చేతిలో ఉంటాయి. ఇప్పుడు కూడా మనోజ్ కి “గుంటూరోడు”, “ఒక్కడు మిగిలాడు” ఉంటె, విష్ణు “సరదా” సినిమా తొ బిజీ గా ఉన్నాడు. మంచు లక్ష్మి ఈ మధ్య “మేము సైతం” అనే టీవీ షో తో ప్రేక్షకులను చాల బాగా ఆకట్టుకుంటోంది.

ఒక పక్క.. నందమూరి, అక్కినేని, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన యువ హీరో లు హిట్లు మీద హిట్లు తో దూసుకుపోతుంటే, మంచు వారసులు మాత్రం ఇంకా మొదటి సూపర్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. “అసెంబ్లీ రౌడి”, “అల్లుడు గారు” వంటి సినిమాలు చూసి ఇన్స్పిరేషన్ పొందాలేమో. ఏది ఏమైనా..మంచు వారసులు కూడా త్వరలో మంచి హిట్లు సాధించి, తమ తండ్రి పేరు నిలబెదతారని ఆశిద్దాం.

11/15/16

పవన్ ,రజని మీ సినిమాలు బ్లాక్ మనీ కాదా అని విమర్శించినా దర్సకుడు

చెన్నై: ఐదువందలు, వెయ్యి రూపాయల నోట్ల రద్దు విషయమై సినీ పరిశ్రమలో మొదటి రోజు చాలా మంది ప్రధాని మోదీ ని ప్రశంసల్లో ముంచెత్తారు. అయితే బయిట బ్యాంకులు వద్ద, ఎటిఎంల వద్ద సామాన్య జనం పడే వెతలు చూసి ఇప్పుడు విమర్శలు సైతం సినిమా పరిశ్రమ నుంచి వస్తున్నాయి. తాజాగా తమిళ దర్శకుడు, నిర్మాత అమీర్ సుల్తాన్..మీడియాతో మాట్లాడుతూ రజనీ, మోదీలపై విమర్శలు చేసారు.



ప్రధాని మోదీ కరెన్సీ బ్యాన్ చేయగానే సూపట్ స్టార్ రజనీకాంత్ స్పందిస్తూ కొత్త భారతమ్ జన్మించింది అంటూ మోదీని ప్రశంసించారు. కానీ మోదీ పని మీరు ఎలా సమర్థిస్తారు అంటూ డైరెక్టర్ అమీర్ సుల్తాన్ సూపర్ స్టార్ ను నిలదీయటం ఇప్పుడు అంతటా చర్చనీయాంసంగా మారింది.

అమీర్ మీడియాతో మాట్లాడుతూ.. రజనీని 'మోదీ చేసిన పనిని ఎలా సమర్థిస్తారు. అయినా ఆయన రజనీకాంత్, పవన్ కళ్యాణ్ ల క్రేజ్ వల్లనే ప్రధాని అయ్యారు. బ్లాక్ మనీకి వ్యతిరేకంగా ఆయన చేసిన పనికి మీరు సంతోషిస్తున్నారు. కానీ మీ సినిమా 'కబాలి' టికెట్లు ఎన్ని రెట్లు అధిక ధరకు అమ్మారో మీకు తెలీదా అని ప్రశ్నించారు.



నిబంధనలకు వ్యతిరేకంగా ఎక్కువ రేటుకు టికెట్లు అమ్మడం ద్వారా వచ్చిన డబ్బు బ్లాక్ మనీ కాదా. ఆ లెక్కలన్నింటినీ పేపర్ మీద మీరు చూపగలరా' అంటూ తీవ్ర స్థాయిలో మాట్లాడారు. ఈ వివాదం రజనీ,మోదీ అభిమానుల్లోనూ చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ విషయమై వాదోపవాదాలు మొదలయ్యాయి. దాంతో ఈ వివాదం ఎంత వరకు వెళుతుందో అనే అనుమానాలు తమిళ పరిశ్రమలో వ్యక్తమవుతున్నాయి.

11/12/16

నాగార్జున ఆస్తులు తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే

అక్కినేని నాగార్జున అంటే అమ్మాయిల మ‌న‌సులో మ‌న్మ‌థుడిగా చెర‌గ‌ని ముద్ర‌వేసుకున్నాడు. ఐదున్న‌ర ప‌దుల వ‌య‌స్సులో ఉన్నా కూడా నాగ్ అందం ఈ రోజుకు త‌ర‌గ‌నిదిగా ఉంటోంది. నాగ్ ఇద్ద‌రి కొడుకులు నాగ‌చైత‌న్య‌, అఖిల్ వ‌చ్చే యేడాది పెళ్లి పీట‌లు ఎక్కుతున్నా నాగ్ మాత్రం ఇప్ప‌ట‌కీ వారికి తీసిపోని అందంతో సినీ జ‌నాల‌ను ఎట్రాక్ట్ చేస్తున్నాడు.


దివంగ‌త లెజెండ్రీ హీరో అక్కినేని నాగేశ్వ‌ర‌రావు కొడుకుగా తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయిన నాగ్ త‌న‌కంటూ ఓ స్టైల్‌ను మెయింటెయిన్ చేశాడు. నాగార్జున‌కి ఒక సినిమాలే కాదు బిజినెస్‌మ్యాన్ కూడా మంచి పేరుంది. నాగార్జున సినిమాలు చేయ‌డంతో వ‌చ్చే సంపాద‌న కంటే అదే స‌మ‌యాన్ని బిజినెస్‌కు కేటాయిస్తే ఇంకా ఎక్కువ సంపాదిస్తాడ‌ని టాక్ ఉంది. అందుకే ఇండ‌స్ట్రీలో అంద‌రూ బిజినెస్ మైండ్ నాగార్జున అని పిలుస్తారు.

నాగార్జున ఆస్తులు తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే

11/10/16

Niharika Teasing Nagachaitanya With her Counters


Chaitanya was born on 23 November 1986 in Chennai. His parents are the actor and entrepreneur Akkineni Nagarjuna, the son of actor Akkineni Nageswara Rao and Lakshmi Daggubati, the daughter of producer D. Ramanaidu. His maternal uncle Daggubati Venkatesh and cousins Rana Daggubati, Sumanth and Sushanth are also actors. Nagarjuna and Lakshmi divorced after which the former married actress Amala Mukherjee, to whom Chaitanya’s half brother Akhil Akkineni was born. After his parents’ divorce, Chaitanya left to Chennai with Lakshmi. He used to play keyboard and bass guitar in his school band and went on to study keyboard from Trinity College London. During his stay in Chennai for eighteen years, he completed his schooling and returned to Hyderabad to pursue a B. Com degree. He expressed his desire to take up acting as his profession to Nagarjuna during his second year of graduation. He took a three-month course in acting in Mumbai and received further training in acting and martial arts in Los Angeles apart from trying to gain perfection in Telugu diction for one-and-a-half years before making his acting debut.