11/16/16

వారసుల హీరోలలో వెనుకబడిన మంచు హీరోస్

గర్వించదగ్గ నటుల్లో మోహన్ బాబు ఒకరు. ఆయన నటనా ప్రతిభ.. ఆయన పోషించిన పాత్రల గురించి ఎంత చెప్పినా తక్కువే. నాలుగు దశాబ్దాల వ్యవధిలో 560 దాకా సినిమాలు చేశారాయన. విలక్షణ మైన నటుడి గా, హీరోగా.. విలన్‌గా.. కమెడియన్‌గా అనేక రకాల పాత్రలో మెప్పించాడు “డైలాగ్ కింగ్” డా. మోహన్ బాబు. మోహన్ బాబు పని ఇక ఐపోయింది అన్న ప్రతీ సారీ సూపర్ హిట్ తో సమాధానం ఇచ్చి విమర్శకులకు సమాధానం ఇచ్చిన హిస్టరీ మోహన్ బాబుది.

 హీరో గా తన తరం ముగియడం తో కొడుకులు ”విష్ణు” “మనోజ్” ఇద్దరూ హీరోలు గా ఎంట్రీ ఇచ్చారు. మోహన్ బాబు కూడా కొడుకులకు చాలా సపోర్ట్ చేశారు. కానీ, ఒకటి రెండు యావరేజ్ సినిమాలు తప్ప వాళ్లకి సరైన సూపర్ హిట్ ఇప్పటికీ పడలేదు. అప్పటికీ మోహన్ బాబు తన సొంత బ్యానర్ లో సినిమాలు నిర్మించి, నటించారు కూడా. అయినా సరైన సక్సెస్‌లేక మంచు హీరోలు డీలా పడిపోతున్నారు. ఇక మంచు వారి ఆడపడుచు “లక్ష్మి” తన కారియర్ స్టార్టింగ్ లో టీవీ షో లతో హడావిడి చేసినా , తరువాత నిలబడలేక పోయింది . తండ్రి మోహన్ బాబు సలహాతో హీరోయిన్/నటి గా సెటిల్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంది.

మంచు హీరోలు సినిమా సినిమాకూ కొత్త జానర్ ఎంచుకుంటారు. క్యారెక్టరైజేషన్ డిఫరెంట్‌గా వుండాలని కోరుకుంటారు. చాలానే శ్రమపడుతున్నారు. ఎన్ని చేసినా, ఎంత కష్టపడినా … ఫలితం మాత్రం దక్కడం లేదు. చాలా గ్యాప్ తీసుకుని మోహన్‌బాబు హీరోగా నటించిన చిత్రం “మామ మంచు అల్లుడు కంచు’ కూడా నిరాశనే మిగిల్చింది. విశేషమేమిటంటే ... విష్ణు కి కాని, మనోజ్ కి కానీ ఎప్పుడూ సినిమాలు చేతిలో ఉంటాయి. ఇప్పుడు కూడా మనోజ్ కి “గుంటూరోడు”, “ఒక్కడు మిగిలాడు” ఉంటె, విష్ణు “సరదా” సినిమా తొ బిజీ గా ఉన్నాడు. మంచు లక్ష్మి ఈ మధ్య “మేము సైతం” అనే టీవీ షో తో ప్రేక్షకులను చాల బాగా ఆకట్టుకుంటోంది.

ఒక పక్క.. నందమూరి, అక్కినేని, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన యువ హీరో లు హిట్లు మీద హిట్లు తో దూసుకుపోతుంటే, మంచు వారసులు మాత్రం ఇంకా మొదటి సూపర్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. “అసెంబ్లీ రౌడి”, “అల్లుడు గారు” వంటి సినిమాలు చూసి ఇన్స్పిరేషన్ పొందాలేమో. ఏది ఏమైనా..మంచు వారసులు కూడా త్వరలో మంచి హిట్లు సాధించి, తమ తండ్రి పేరు నిలబెదతారని ఆశిద్దాం.

No comments: