టీమిండియా కోహ్లీ ప్రధాని నరేంద్రమోదిపై పొగడ్తల వర్షం కురిపించాడు. ప్రధాని మోదీ తీసుకున్న పాత పెద్దనోట్ల రద్దు నిర్ణయం ‘భారతీయ రాజకీయ చరిత్రలోనే గొప్పదని’ అభిప్రాయపడ్డాడు. చరిత్రలో ఇదివరకెప్పుడూ చేయని పనిని మోదీ చేయగలిగారని కితాబిచ్చాడు. తనకు తెలిసినంత వరకూ ఇది చాలా పెద్ద నిర్ణయమని, భారతీయ రాజకీయ చరిత్రలో ఇలాంటి నిర్ణయాన్ని తానేప్పుడూ చూడలేదని అన్నాడు. ఈ నిర్ణయం తనను ఆకట్టుకుందని, నోట్లరద్దు విషయాన్ని నమ్మలేకపోతున్నానని విశాఖపట్నంలో మీడియాతో అన్నాడు.
నోట్ల రద్దు అనంతరం తనకు ఎదురైన అనుభవాన్ని మీడియాతో పంచుకున్నాడు. రాజ్‌కోట్‌లో హోటల్ బిల్లు చెల్లించే సమయంలో పాత నోట్లు రద్దైన విషయాన్ని మరచిపోయానని, బిల్లు చెల్లించేందుకు పరుసులోనుంచి బయటకు తీశానని, పాత నోట్లతో ఉపయోగంలేదని గుర్తుకు రావడంతో మళ్లీ పరుసులోపెట్టేశానని తెలిపాడు.

No comments:
Post a Comment