11/18/16

టిఫన్ కన్నా చద్ది అన్నం మిన్న

మన పెద్దవారు అన్ని సంవస్తరాలు ఏ రోగం లేకుండా దృడంగా ఉండటానికి కారణం వారు రోజువారీ ఆహారపు అలవాట్లే …ఉదయాన్నే వారు ఇప్పటిలా దోస , ఇడ్లీ కాకుండా …చద్ది అన్నం …అదే రాత్రి మిగిలిన అన్నము లో పెరుగో లేదా గంజి లో ఉప్పు వేసుకొని తినేస్తుంటారు … అది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట .

రాత్రి మిగిలిన అన్నం లో ఉదయానికల్లా  చాలా రకాల మార్పులు జరుగుతాయి, 50 గ్రాముల అన్నంను తీసుకుని రాత్రి పులియపెట్టినట్లయితే 1.6 మిల్లీ గ్రాములు ఉన్న ఐరన్‌ 35 మిల్లీ గ్రాములుగా పెరుగుతుంది. అలాగే పోటాషియం మరియు కాల్షియంలు కూడా భారీ మొత్తంలో పెరుగుతాయి, ఇవన్నీ మన శరీరాన్ని మరింత ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతాయి.
శరీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుంది.
శరీరంలో వేడి ఎక్కువగా ఉన్న వారు చద్దన్నంలో పెరుగు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకుని తింటే ఆ వేడి తగ్గుతుంది.
ఎక్కువ సమయం ఉల్లాసంగా గడపాలంటే చద్దన్నం పొద్దునట్లే తినాల్సిందే.
పలు చర్మ వ్యాదుల నుండి చద్దన్నం కాపాడుతుంది.
పేగుల్లో ఉండే అనారోగ్య సమస్యలను సైతం ఈ చద్దన్నం తగ్గిస్తుంది.
మ‌ల‌బ‌ద్ద‌కం, నీర‌సం త‌గ్గిపోతాయి. బీపీ అదుపులో ఉంటుందిhttp://fkrt.it/CIH3!!NNNNhttp://fkrt.it/CIH3!!NNNN

ఇవాళ చాలా మంది కి తెలియనిరోజు

ఇవాళ అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. కానీ పేపర్లో వ్యాసం లేదు.. టీవీలో ప్రోగ్రాం లేదు’ అనే వాట్సాప్ సందేశం చాలామంది చదివుంటారు. కానీ ఆ రోజు పేపర్లో, టీవీలో ఈ ప్రస్తావన ఎందుకుండదంటే.. అది ఈ రోజు కాబట్టి. నవంబర్ 19న అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. తమకూ హక్కులు, కష్టాలు ఉంటాయని చాటుతూ, లింగ వివక్ష తొలగించేందుకు ఉద్దేశించిన రోజు సందర్భంగా.. మగానుభావులందరికీ ‘అంతర్జాతీయ పురుషుల దినోత్సవ’ శుభాకాంక్షలు.



హిందూవులు ఎలా నడచుకోవాలి?

హిందూమతం చాలా పవిత్రమైంది. ”మేమే గొప్ప” లాంటి కుంచిత భావాలకు ఆస్కారం లేని మతం ఇది. హిందూ ధర్మాలు, నమ్మకాలు అందరికీ ఉపయుక్తమైనవి, అనుసరణీయం అయినవి. కనుక అందరూ ఆచరించాల్సిన, అనుసరణీయం అయిన హిందూ ధర్మాలను, ముఖ్యమైన సూత్రాలను తెలుసుకుందాం.


హిందూ ధర్మాలు, నమ్మకాలు, ఆచరణలు మహోన్నతంగా ఉంటాయి. ఓంకారాన్ని దైవ స్వరూపంగా భావిస్తాం మనం. (God Exists: One Absolute OM)
త్రిమూర్తులను ఆరాధిస్తాం. (One Trinity: Brahma, Vishnu, Maheshwara) ఇంకా అనేక దేవతా మూర్తులను ఆరాధిస్తాం. (Several divine forms)
కోట్లకొద్దీ ఉన్న జీవరాశుల్లో మానవ జన్మ మహోత్కృష్టమైంది. అందుకే మానవ సేవే మాధవసేవ అన్నారు. తోటి మనుషులకు సహాయం చేస్తే అది దేవునికి సేవ చేయడంతో సమానమౌతుంది.
ప్రేమతో ప్రశాంతత చిక్కుతుంది. సర్వం జయించవచ్చు.
అనేక మత విశ్వాసాలు మంచినే ప్రబోధిస్తాయి. ప్రయోజనకరంగానే ఉంటాయి. వాటిని అందరూ అనుసరించాలనే ఉద్దేశంతోనే ఆచారాలుగా నిర్దేశించారు.
హిందూమతంలో మూడు చాలా ముఖ్యమైనవి. వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకుని నడచుకోవాలి. నదుల్లో కెళ్ళా పరమ పవిత్రమైనది గంగానది. గంగానదిలో స్నానం చేస్తే తెలిసీ తెలీక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. భగవద్గీత అత్యంత పవిత్ర గ్రంధం. గీతను అర్ధం చేసుకుని ఆచరించాలి. గీతా పారాయణం చేయడం ఉత్తమం. మంత్రాల్లో కెల్లా ఉత్తమోత్తమమైంది గాయత్రీ మంత్రం. గాయత్రీ మంత్ర స్మరణతో సర్వ సంపదలూ ప్రాప్తిస్తాయి.(Knowledge of 3 important rituals.. that is Ganga sacred river, Bhagavad Gita sacred script, Gayatri sacred mantra)
ఆచరించాల్సిన ప్రధాన అంశాలు
సత్యాన్నే పలకాలి. (Truth)
అహింస పాటించాలి. (Non-violence)
బ్రహ్మచర్యాన్ని అనుసరించాలి. Brahmacharya (Celibacy, non-adultery)
ఇతర్ల వస్తువులను చేజిక్కించుకోవాలనే ఆలోచన గానీ, దొంగిలించాలనే ఉద్దేశం గానీ ఉండకూడదు. (No desire to possess or steal)
ఎలాంటి మోసపూరితమైన ఆలోచన గానీ లేకుండా త్రికరణ శుద్ధిగా నిజాయితీగా ఉండాలి. (Non-corrupt)
మనోవాక్కాయ కర్మల్లో చిత్తశుద్ధి ఉండాలి. (Cleanliness)
సంతోషం ఎక్కడో ఉండదని, మనలోనే ఉంటుందని తెలుసుకుని ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించాలి. (Contentment)
చదివి తెలుసుకుంటూ మంచి అంశాలు నేర్చుకోవాలి. (Reading of scriptures) రూపం ఏదయినా దైవం ఒక్కటేనని తెలుసుకోవాలి. మహాశివుడు, విష్ణుమూర్తి, పార్వతీదేవి, లక్ష్మీదేవి – ఎ రూపం అయినా పరవాలేదు.. మొత్తానికి నిత్యం దేవుని ఆరాధనలో జీవితం గడపాలి

This story inspiration manahinduthvam website

పెసరపప్పుతో చిన్న చిట్కాను పాటిస్తే చాలు ఎలాంటి జ్వరమునైన తగ్గించవచ్చు

నిజానికి జ్వరం అంటే ఏమిటి? జ్వరం ఎందుకు వస్తుంది? ఆరోగ్యంగా ఉండే వ్యక్తి శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెంటిగ్రేడ్‌ (98.6 డిగ్రీల ఫారెన్‌హీట్‌) ఉంటుంది. ఎవరికైనా జ్వరం (ఫీవర్‌) వచ్చిందంటే ఆ వ్యక్తి శరీర ఉష్ణోగ్రత పెరిగిందన్నమాటే. జ్వరం తీవ్రత 107.6 ఫారన్‌హీట్‌ను మించినపుడు బ్రెయిన్‌ డ్యామేజ్‌కు ఆస్కారం ఉంటుంది. అయితే జ్వరాన్ని తగ్గించాలంటే…ముందుగా టెంపరేచర్ ను కంట్రోల్ చేయాలి. అమాంతం పెరిగిపోయిన టెంపరేచర్ ను నార్మల్ లెవల్ కు తీసుకువస్తే…జ్వరాన్ని తగ్గించినట్టే..! అందుకోసం ఓ చిన్న చిట్కాను పాటిస్తే చాలు..!

ఓ కప్పు పెసరపప్పును తీసుకొని, దానిని ఓ సారి కడిగి, ఓ గిన్నె నిండా నీళ్లు పోసి అందులో పెసరపప్పును ఓ 20 నిమిషాలు నానబెట్టాలి. 20 నిమిషాల తర్వాత ఆ పెసరపప్పు కడిగిన నీళ్లను ఓ గ్లాస్ లో పోసి జ్వరంతో బాధపడుతున్న వ్యక్తికి తాగించాలి. జ్వరంతో బాధపడుతున్న వ్యక్తి…ఈ నీటిని తాగిన 10 నిమిషాల్లో అతని బాడీ టెంపరేచర్ క్రమంగా తగ్గుకుంటూ వస్తుంది. ఓ 20 నిమిషాల తర్వాత అతడు సాధారణ స్థితికి చేరుకుంటాడు. అప్పటి వరకు చేదుగా ఉన్న అతని నోరు…ఇప్పుడు కాసింత దారిలోకి వస్తుంది. ఆ సమయంలో తేలికగా జీర్ణమయ్యే పదార్థాలను తినిపించాలి. దీనితో పాటు డాక్టర్ ఇచ్చిన మందులను వాడుతుండాలి.
పెసరపప్పు లో వేడిని తగ్గించే అద్భుతమైన గుణాలున్నాయి, ఓ 20 నిమిషాల నానబెట్టడం వల్ల ఆ గుణాన్ని ఆ నీటికి సంక్రమింపజేస్తుంది పెసరపప్పు. అంతే కాదు పెసలలో విటమిన్ బి, విటమిన్ సి, మాంగనీస్ తోపాటు ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. సూర్యుని నుంచి వచ్చే అతినీలిలోహిత కిరణాలు, పర్యావరణ కాలుష్యం వల్ల వచ్చే చర్మ సమస్యల నుండి కూడా కాపాడే శక్తి పెసళ్లకు ఉంది. పెసళ్లను మన ఆహారంలో భాగం చేసుకోవడం చాలా ఉత్తమం. వేడి ఎక్కువగా ఉండే వాళ్లకు ఈ పెసరపప్పు ఓ వరం. పండగలప్పుడు పెసరపప్పు పానకం చేస్తారు. శరీరంలో వేడిని తగ్గించి వ్యాధి నిరోధక శక్తిని పెంచటంలో ఈ పానకం సమర్దవంతంగా పనిచేస్తుంది
 ప్రతి మనిషి తన రాశిని బట్టి అలా ఉంటాడు, ఇలా ఉంటాడు అని మనం వింటూ ఉంటాము. అలాగే నెలలు బట్టి కూడా వారి మెంటాలిటి ఎలా ఉంటాది అనే విషయం చెప్పవచ్చని సర్వే చెబుతుంది . మరి మీ నల ప్రకారం చూసుకుని ఆ సర్వే ఎంత వరకు నిజం అనేది చూసుకోండి…

జనవరి: జనవరిలో పుట్టినవారికి  పట్టుదల ఎక్కువగా ఉంటుంది. అనుకున్నది సాధించేవరకు వదిలిపెట్టరు. వీళ్ళు అందంగా ఉంటారు. వీరికి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసు.
ఫిబ్రవరి: వీరు సున్నితమైన  మనసున్నవాళ్ళు . కొంచెం కోపం కూడా ఎక్కువే గాని ఎదుటివారిపై వెంటనే ఆ కోపాన్ని చూపించి అంతలోనే నవ్వేస్తారు.
మార్చి: వీరు కొంచెం కళాహృదయులు. భావోద్వేగాలు ఎక్కువగా చూపిస్తారు. ఆ ఫీలింగ్స్ ఎక్కువ. తొందరగా రీయాక్ట్ అవుతారు.
ఏప్రిల్: వీరు సున్నితమైన మనసు కలిగి ఉంటారు. పక్కవాళ్లతో కలిసి పనిచేయడానికి ఇష్టపడతారు.
మే: ప్రేమ విషయంలో కొంచెం వీక్ తొందరగా అందరిని నమ్మేస్తారు. దేనికైనా తొందరగా ఆకర్షితులవుతారు. అందరిపై ప్రేమను ఒకేరకంగా చూపిస్తారు.
జూన్: వీరి చుట్టూ జనాలు ఉండాలనుకుంటారు. వీరికి కొత్తవాళ్లతో స్నేహం చేయడానికి ఇష్టపడతారు. స్నేహితులతో కలిసి పరిహాసం చేయడం, ఆకర్షణీయమైన వ్యక్తులు కనిపించగానే ఇష్టపడతారు.
జూలై: వీరికి అహంకారం ఎక్కువ. నేనే అన్నీ చేయాలనుకుంటారు. గొప్ప పేరు సంపాదించాలనుకుంటారు.అనుకున్నది జరగకపోతే నిరూత్సహపడుతారు. అహంకారం వల్ల సన్నిహితులు దూరం కావోచ్చు.
ఆగస్ట్: వీరికి సంగీతం అంటే ఇష్టం. జీవితంలో అలా కావాలి, ఇలా కావాలంటూ పగటి కలలు కంటారు. తీరకపోయేసరికి బాధపడుతారు. వీరికి అనుమానం కూడా ఎక్కువ. ప్రతి విషయాన్ని అనుమానంతో చూస్తారు. అనుమానం మొదట పోయాకే..వీళ్లు వెనకాల వెలుతారు. ఎంత సరదాగా ఉంటారో, అంత రహస్యాలు దాచుకుంటారు లోపల.
సెప్టెంబర్: స్నేహితుల సమస్యను తెలుసుకొని తీర్చడం, వారిని ఓదార్చడం ఎక్కువ. చాలా తెలివైన వారు, భయం అంటే తెలియదు, ప్రేమ మరియు మన అనుకున్న వారిని చాలా కేరింగ్ గా చూసుకుంటారు.
అక్టోబర్: స్నేహితులను తొందరగా బాధపెట్టిన మళ్ళీ కలగోపుగా మాటలు కలుపుతారు. చాలా స్మార్ట్, ఆకర్షనీయులు, హాట్ అండ్ సెక్సీ. అపద్ధం చెబుతారు కానీ నటించరు పైగా చాట్ చేయడానికి ఇష్టపడతారు.
నవంబర్: నమ్మదగిన వారు, విశ్వాసం ఎక్కువ. ఏదైనా చేయాలనుకుంటే దాని గురించే ఆలోచిస్తారు అంతేకాకుండా ప్రమాదకరమైన వారు కూడా. కలివిడిగా ఉంటారు కాని  సీక్రెట్స్ చెప్పరు, స్వతంత్రంగా ఉంటారు.
డిసెంబర్: పై నెలలతో పోల్చితే అన్ని విషయాలలోనూ ఉన్నతంగా ఉంటారు. చూడటానికి చాలా బాగుండటమే కాక విశ్వాసం ఎక్కువ, ఉదారమైన మనసు కలవారు. ప్రతి విషయంలోనూ పోటీ పడతారు. పైగా వీళ్ళను అర్థం చేసుకోవడం చాలాకష్టం.  ప్రేమగా ఉంటారు కాని సులభంగా హర్ట్ అవుతారు.

2000 నోట్ లు కాలం కూడా చెల్లినట్లేనా..


1000, 500 నోట్ల రద్దు కారణం వల్ల చలామణిలోకి వచ్చిన 2౦౦౦ నోట్లు కూడా ఎక్కువ కాలం ఉండవు అని సమాచారం. 2019 సాధారణ ఎన్నికలు సమయానికి 2౦౦౦ నోట్ల ను రద్దు చేస్తారంట

2వేల నోటుపై హై టెక్నాలజీ ని ఉపయోగించారా?

2వేల రూపాయ‌ల నోటులో నానో చిప్ పెట్టార‌నే వార్త‌లు గుప్పుమ‌న్నాయి. దీంతో, ఏది ఒరిజిన‌లో, ఏది కాదో ఈజీగా చెప్పేయొచ్చ‌ని, ప్ర‌తి నోటు ఎక్క‌డ స‌ర్క్యులేట్ అయినా ఈజీగా తెలుసుకోవ‌చ్చ‌నే ప్ర‌చారం జ‌రిగింది. ఇదంతా కొత్త 2వేల నోటు మార్కెట్‌లోకి రాక‌ముందు సంగ‌తి. అదంతా ఒట్టిదే అనే ఆర్‌బీఐ అధికారులు కూడా తేల్చిపారేశారు. దీంతో, ఆ వార్త‌కు బ్రేక్ ప‌డింది.తాజా ట్విస్ట్ ఏంటంటే.. నయా 2వేల రూపాయ‌ల నోటులో నానో చిప్ లాంటి ప‌క‌డ్బందీ ఫీచ‌ర్ లేక‌పోయినా.. ఇంటాగ్లియో అనే కొత్త ఫీచ‌ర్‌ని ఏర్పాటు చేశామ‌ని చెబుతున్నారు అధికారులు.

రెండు నోట్ల మధ్య తేడాని ఈజీగా ప‌ట్టేయ‌వ‌చ్చని చెబుతున్నారు.ఇంత‌కీ ఈ ఇంటాగ్లియో ఫీచ‌ర్ ఏంట‌నేగా మీ డౌట్‌. ఇందులో భాగంగా నోటులోకి ఒక‌రక‌మైన డిజైన్‌ను చొప్పిస్తారు. దీంతో, అస‌లు నోటు ఏదో న‌కిలీ ఏదో సింపుల్‌గా చెప్పేసేయొచ్చు. ఒక వ‌స్త్రాన్ని తీసుకొని నోటుపై రుద్దాలి. అలా రుద్దిన‌ప్పుడు ట‌ర్బో ఎల‌క్ట్రిక్ ఎఫెక్ట్‌తో షాక్ వ‌స్తుంది. నోటులో ఉన్న ఇంకు వ‌స్త్రంలోకి బ‌దిలీ కావ‌డం వ‌ల్ల ఇలా జ‌రుగుతుంది.

ఇది చిన్న షాక్‌లా ఉంటుంది. ఇలా షాక్ త‌గిలిదే అది ఒరిజిన‌ల్ అని, లేదంటే న‌కిలీ అని గుర్తు ప‌ట్ట‌వ‌చ్చని అధికారులు చెబుతున్నారు. ఇది హై సెక్యూరిటీ ఫీచ‌ర్ అట‌. దీనిని కాపీ కొట్ట‌డం అంత ఈజీ కాదంటున్నారు ఉన్న‌తాధికారులు. మీకు మీ కొత్త నోటుపై ఇలాంటి డౌట్స్ ఏమ‌యినా ఉంటే వెంట‌నే ఓ వ‌స్త్రం తీసుకొని రుద్దండి. షాక్ కొడితే.. అది ఒరిజిన‌ల్ లేదంటే.. నిజంగానే షాక్ కొడుతుంది. ఫేక్ అని. ఇలా రెండు ర‌కాల ట్విస్ట్‌ల‌లో మీకు ఏది దొరుకుతుందో చూడండి.

సంచలన ప్రకటన చేసిన కేంద్ర హోం శాఖ

కేంద్ర హోం శాఖ సంచలన ప్రకటన చేసింది. దేశంలో ఇప్పుడు కూడా 40 వేల కోట్ల రూపాయల నల్లధనం చెలామణిలో ఉందని కేంద్ర హోంశాఖ తెలిపింది. అయితే నోట్ల రద్దు వల్ల పాక్, బంగ్లాదేశ్ సరిహద్దుల గుండా దేశంలోకి వచ్చే 400 కోట్ల రూపాయల నకిలీ నోట్లకు అడ్డుకట్ట పడిందని వెల్లడించింది. 40 వేల కోట్ల రూపాయల్లో 800 కోట్ల రూపాయలు ఉగ్రవాదులకు అందుతున్నాయి. వేర్పాటువాదులకు, హింసాత్మక చర్యలకు 30 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారని హోంశాఖ గుర్తించింది. నక్సలైట్లు తమ కార్యకలాపాలకు 350 కోట్ల రూపాయలు వినియోగిస్తున్నారని హోంశాఖ వర్గాలు తెలిపాయి. ఖలిస్తాన్‌కు కూడా కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారని హోం శాఖ ప్రగటించింది.

ఏ టైం లో అయిన నోట్ల మార్పిడి క్లోజ్

అతి త్వరలో నోట్ల మార్పిడి నిలిపివేసే అవకాశం ఉంది. ఈ నెల 24లేదా అంతకంటే ముందే నోట్ల మార్పిడిని నిలిపివేస్తారని తెలుస్తోంది. అయితే అకౌంట్లు కలిగి ఉన్నవారు మాత్రం తమ అకౌంట్లలో పాత నోట్లను జమ చేసుకోవచ్చు. ఆ తర్వాత చెక్ లేదా ఏటీఎం కార్డు ద్వారా డబ్బు డ్రా చేసుకోవచ్చు. లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఈ నెల 24లోపే దీనిపై కేంద్ర ఆర్ధిక శాఖ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నగదు రహిత లావాదేవీలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో ఇప్పటికే కొన్ని బ్యాంకులు పాత నోట్లను వారివారి ఖాతాల్లోనే వేసుకోవాలని కస్టమర్లకు సూచిస్తున్నాయి. నోట్ల మార్పిడిని దాదాపుగా అడ్డుకుంటున్నాయి.