అలహాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 250 స్వీపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరింది. ఈ పోస్టుకు 1.10 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. స్వీపరు పోస్టుకు హిందీ రాయడం, చదవడం వచ్చిన అభ్యర్థులు అర్హులని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. కాని నిరుద్యోగం వల్ల ఎంబీఏ, బీటెక్ లతో పాటు ఉన్నత విద్య అభ్యసించిన అభ్యర్థులు సైతం స్వీపరు పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నారని అలహాబాద్ మున్సిపల్ అదనపు కమిషనర్ శ్రీవాస్తవ వెల్లడించారు. అభ్యర్థులకు డ్రెయినేజీలు శుభ్రం చేయడం, రోడ్లు ఊడవడంలో ప్రాక్టికల్ పరీక్ష నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. ఇదీ మన దేశంలో నిరుద్యోగ భారతానికి నిదర్శనంగా నిలిచిన ఈ ఉదంతం అందరినీ ఆలోచింపజేస్తుంది.
12/8/16
ఈ వయసులోనూ యంగ్ హీరోలతో ‘చిరు’ పోటీ..
మెగా అభిమానులకు శుభవార్త.. ఎప్పుడెప్పుడా చిరు 150వ సినిమా ‘ఖైదీ నంబరు 150’ విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు చిన్నపాటి శుభవార్తను అందించింది చిత్రబృందం. చిరు 150వ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. ఈ టీజర్‌ను బట్టే సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పేయచ్చు. మెగాస్టార్ రీ-ఎంట్రీకోసం ఎంతగానే వేచిచూస్తున్న అభిమానులకు తాజాగా విడుదలైన ఖైదీ టీజర్ ఉత్తేజాన్నిచ్చేలా ఉంది. ఈ టీజర్‌లో చిరు ఇదివరకు నటించిన సినిమాలతో పోలిస్తే చాలా డిఫరెంట్‌గా ఉంది.
అచ్చుగుద్దినట్లుగా శంకర్ దాదా జిందాబాద్, స్టాలిన్ సినిమాల్లోలాగే చిరు యంగ్‌గా ఈ సినిమాలో కూడా కనిపించనున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి చూస్తే.. 61ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోలతో పోటీపడేలా నటన.. స్టెప్స్..వేసి అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాడు మెగాస్టార్. తాజాగా విడుదలైన టీజర్‌లో.. మెగాస్టార్ చిరంజీవి సరికొత్త గెటప్‌లో కనిపిస్తున్నాడు. టీజర్ చూసిన అభిమానులు.. కెవ్వుకేక, వావ్ సూపర్, అదిరిపోయింది అంటూ తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
బహుశా చిరు టీజర్ ఇలా ఉంటుందని అభిమానులెవరూ ఊహించి ఉండరు. ‘ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా..నచ్చితేనే చూస్తా..కాదని బలవంతం చేస్తే..కోస్తా..ఏ స్వీట్ వార్నింగ్’అంటూ చిరు తనదైన స్టైల్లో చెప్పిన డైలాగ్ కెవ్వుమనిపిస్తోంది. ఈ ఒక్క డైలాగు మెగా అభిమానుల్లో ఉత్సహాన్ని ఉరకలెత్తిస్తోంది. చిరంజీవికి స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టిన ఖైదీ సినిమా రేంజ్‌లో ఈ సినిమా కూడా ఉంటుందని అభిమానుల్లో అంచనాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి. ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఈ టీజర్‌లోనే తెలిసిపోతోందని అభిమానులు చెప్పకనే చెబుతున్నారు.

కరుణానిధి ఆరోగ్యంపై తాజావార్త
తమిళనాడు రాజధాని చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న డిఎంకే అధినేత కరుణానిధి డిశ్చార్జ్ అయ్యారు. డీహైడ్రేషన్, అలర్జీ సంబంధిత ఇబ్బందులతో ఆయన డిసెంబర్ ఒకటిన ఆసుపత్రిలో చేరారు. కరుణానిధి పూర్తిగా కోలుకున్నారని, అయితే ఆయనకు విశ్రాంతి అవసరమని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కరుణ డిశ్చార్జ్ కావడంతో డిఎంకే శ్రేణుల్లో ఆనందం
వెల్లివిరిసింది.
Subscribe to:
Posts (Atom)