12/18/16

గర్భిణులు ఉల్లిపాయ తినటం వలన లాభాలు

మీరు గర్భవతి అయిఉండి పచ్చి ఉల్లిపాయ తింటున్నారా? సల్ఫర్ ఎక్కువగా కలిగి ఉండే ఉల్లిపాయ ఆరోగ్యానికి మంచిదేమో అని ఒకసరి ఆలోచించండి. అల్లియం కుటుంబానికి చెందిన ఉల్లిపాయ వంటలలో వాడే సాధారణ రకానికి చెందిన కూరగాయ. గాడమైన వాసన కలిగి ఉండే ఉల్లిపాయ అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది.

గర్భ సమయంలో తినే ఆహార పదార్థాలు పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రకాల ఆహార పదార్థాలను మాత్రమే తినాలని కొంత మంది సూచిస్తే, కొంత మంది వాటిని మాత్రమే తినాలని మరికొంత మంది సూచిస్తుంటారు. ఫలితంగాగర్భిణులలో ఆహార పదార్థాల పట్ల ఒక గందరగోళం తలెత్తుతుంది. సాధారణంగా కనిపించే ఉల్లిపాయను తినొచ్చా లేదా అని గర్భిణులలో కలిగే ఒక సందేహం.


Image result for గర్భిణులు


ఉల్లిపాయ వలన కలిగే ప్రయోజనాలు


గర్భిణులు ఉల్లిపాయ తింటే వారి ఆరోగ్యానికి మంచిదే అని చెప్పవచ్చు. ఉల్లిపాయలలో విటమిన్ 'C', బయోటిన్, మాంగనీస్, కాపర్, ఫాస్పరస్, పొటాషియం, విటమిన్ బి6, ఫోలేట్ వంటి ముఖ్య పోషకాలను కలిగి ఉంటుంది. ఇది గర్భిణులకు చాలా ఆరోగ్యకరమని చెప్పవచ్చు. సల్ఫర్ ఎక్కువగా కలిగి ఉండే ఉల్లిపాయ తినటం వలన పుట్టబోయే బిడ్డకు ఎలాంటి ప్రమాదం కలగదా అనే ప్రశ్న తలెత్తవచ్చు. ఉల్లిపాయ పుట్టబోయే బిడ్డకు ఎలాంటి హాని కలిగించదని నిపుణులు తెలుపుతున్నారు. ఉలిపాయ వలన గర్భిణులకు కలిగే ప్రయోజనాలేంటో మీరే చూడండి.

రక్తపోటు

గర్భిణీలలో చాలా తరచుగా ఇబ్బంది పెట్టే సమస్య- రక్తపోటు. దీనిని నియంత్రించటంలో పచ్చి ఉల్లిపాయలు సహాయపడతాయి. వీటితో పాటుగా, నిద్రలేమి, ప్రీమెచ్యూర్ డెలివరీ, హైపర్ టెన్షన్ వంటి వాటిని కూడా తగ్గిస్తుంది.

పంటినొప్పిని తగ్గిస్తుంది

గర్భిణీల్లో వచ్చే హార్మోన్ల మార్పుల వల్ల దంత సమస్యలు వస్తాయి. పాచి పెరగటం, ఇన్ల్ఫేమేషన్ మరియు బ్లీడింగ్ సమస్యలు వస్తుంటాయి. దంత సమస్యలు, నివారించుకోవడానికి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉన్న ఉల్లిపాయలు డైట్ లో చేర్చుకోవడం వల్ల పంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ఫైబర్

గర్భిణులలో మలబద్దకం చాలా సాధారణ సమస్య. ఉల్లిపాయలో ఉండే ఫైబర్ పేగు కదలికలను సరిగా జరిగేలా చేసి,మలబద్దకం వంటి నుండి ఉపశమనం కలిగిస్తుంది.

ఇమ్యునిటీ

ఉల్లిపాయల్లో విటమిన్ 'C' ఎక్కువగా ఉంటుంది. అలాగే వివిధ పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటటం వల్ల గర్భిణీలలో వ్యాధినిరోధక శక్తి పెంచి.. కడుపులోని బిడ్డ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

డయాబెటిస్

ఉల్లిపాయల్లో క్రోమియం ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి గర్భిణీలకు సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. కాబట్టి ఎలాంటి సందేహం లేకుండా.. గర్భిణీలు.. ఉల్లిపాయలు తీసుకోవచ్చు.

డీహైడ్రేషన్

శరీరంలో మెటల్ ఎక్కువగా ఉండటం తల్లీ, బిడ్డ ఇద్దరికీ హానికరం. ఉల్లిపాయల్లో ఉండే ఎమినో యాసిడ్స్, సిస్టైన్, మెథినైన్ లు శరీరాన్ని నిర్విశీకరణం చేయడానికి సహాయపడతాయి.