11/9/16

ట్రంప్‌తో చైనాకు నష్టం... భారత్‌కు లాభం


Image result for ట్రంప్‌తో చైనాకు నష్టం... భారత్‌కు లాభం

న్యూఢిల్లీ : డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భారతీయ కాల్ సెంటర్‌ ఉద్యోగుల ఇంగ్లిష్ యాసను అనుకరించి ఎగతాళి చేశారు. ప్రసంగాల్లో ఔట్‌సోర్సింగ్‌ విధానాలపై విరుచుకుపడ్డారు. వాణిజ్య అసమానతలను సరిచేస్తానని హెచ్చరించారు. అయితే ఆయన భారతదేశానికి వ్యతిరేకం కాదని, చైనా, పాకిస్థాన్లకే గట్టి సమస్యలు ఎదురవుతాయని అమెరికా దౌత్యవేత్త విలియం హెచ్. ఏవరీ అన్నారు.

చైనా, పాకిస్థాన్ దశాబ్దాలుగా అమెరికాను మెత్తని గోవును వాడుకున్నట్లుగా ఉపయోగించుకుంటున్నారని ఏవరీ చెప్పారు. చైనా అమెరికాలో భారీ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోందని, పాకిస్థాన్ ఇస్లామిక్ ఉగ్రవాదంతో పోరాటం పేరుతో 2002 నుంచి పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం పొందుతోందని తెలిపారు. ఇప్పటి వరకు ట్రంప్ చెప్తున్నదాన్నిబట్టి ఆయన ఈ రెండు దేశాలకు వెళ్తున్న నగదు ప్రవాహంలో కోత విధిస్తారని పేర్కొన్నారు.

అమెరికా 15 ఏళ్ళలో 50 లక్షల మాన్యుఫ్యాక్చరింగ్ జాబ్స్‌ను కోల్పోగా, చైనా మాన్యుఫ్యాక్చరింగ్ రంగం విపరీతంగా వృద్ధి చెందింది. కోల్పోయిన ఉద్యోగాలను తిరిగి అమెరికాకు తీసుకొస్తానని ట్రంప్ ప్రచారం చేశారు. షాంఘై నుంచి అమెరికా వెళ్ళే మెషినరీపై టారిఫ్‌ను విధించడం కన్నా హైదరాబాద్ నుంచి వెళ్తున్న ఇంటర్నెట్ కోడ్‌పై టారిఫ్ విధించడం కష్టమే. అయినప్పటికీ భారతదేశానికి కొంతవరకు నష్టం తప్పకపోవచ్చు. చైనాకు జరిగే నష్టం భారత్‌కు లాభంగా మారే అవకాశాలు ఉన్నాయని, ట్రంప్ అధ్యక్ష పాలనలో చైనాకు నష్టం జరగడం ఖాయమని నిపుణులు చెప్తున్నారు.

భారతదేశానికి ఇబ్బందులు సృష్టిస్తున్న మరో దేశం పాకిస్థాన్ అని, ట్రంప్ పాలనలో పాకిస్థాన్‌కు భారీ నష్టం తప్పదని ఏవరీ చెప్పారు. పాకిస్థాన్ చాలా ప్రమాదకరమైన దేశమని ట్రంప్ అన్నారని తెలిపారు. భారతదేశాన్ని కలుపుకొనిపోవాలని, పాకిస్థాన్‌ను నిరోధించగలిగే దేశం భారతదేశమేనని అన్నారని చెప్పారు. త్వరలోనే తాను దీనిపై చర్చలు ప్రారంభిస్తానన్నారని తెలిపారు. ఎనిమిదేళ్ళ క్రితం బరాక్ ఒబామా మాట్లాడినపుడు కశ్మీరు అంశంలో అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తుందని చెప్పారు. కానీ ట్రంప్ పూర్తిగా పాకిస్థాన్‌కు వ్యతిరేక వైఖరిని ప్రదర్శించడం గమనార్హం.

ట్రంప్ గెలుపుతో పాక్‌లో ప్రకంపనలు

పాకిస్థాన్ భయపడుతోంది. భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ కంగారుపడుతోంది. అనూహ్యంగా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచి పాకిస్థాన్‌లోని ప్రముఖులు, విశ్లేషకులు ఆందోళనకు గురవుతున్నారు. తమ దేశం పట్ల ట్రంప్ కఠిన వైఖరి అవలంబిస్తారని అంచనా వేస్తున్నారు. ట్రంప్ అధ్యక్ష పాలన అనూహ్యంగా ఉంటుందని భావిస్తున్నారు. పాకిస్థాన్‌కు హిల్లరీ క్లింటన్ డేగ వంటివారని కొందరు భావిస్తున్నారని, అయితే విద్వేషంతో, అసహనంతో ఉండేవారి కన్నా సవాలుతో కూడిన విధానాన్ని అవలంబించే హిల్లరీని ఎంచుకోవడం మంచిదని కొందరు అంటున్నారు. ప్రస్తుతం దేశంలో జీహాదీలు, ఉగ్రవాదులతో ప్రభుత్వం ఘర్షణ పడుతున్న సమయంలో అసహనం ప్రదర్శిస్తున్న ట్రంప్ విజయం సాధించడం వల్ల పాకిస్థాన్‌కు ఇబ్బందులు తప్పవంటున్నారు. ట్రంప్‌కు ఉన్న ఇస్లామోఫోబియా వల్ల ఎదురయ్యే కష్టాలను అనుభవించక తప్పదని మరికొందరు నిపుణులు చెప్తున్నారు. ఆయన జాత్యహంకార ధోరణి పట్ల పాకిస్థాన్ ప్రజలు ఆందోళన చెందుతున్నారని అంటున్నారు. ఇదిలావుండగా పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషర్రఫ్ కొంతవరకు ఆశావాదంతో ఉన్నారు. ట్రంప్ దేశాధ్యక్షుడైతే దక్షిణాసియాలో ఉద్రిక్తతలు తగ్గుతాయని చెప్తున్నారు. శాంతి స్థాపన కోసం ట్రంప్ కృషి చేస్తారని భావిస్తున్నట్లు తెలిపారు

కొత్త నోటు విషయంలో అవన్నీ అబద్ధాలే!

Image result for new notes

దేశంలో ప్రస్తుతం చలామణీ అవుతున్న 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ వార్త వెలువడినప్పటి నుంచి కొత్త నోట్లకు సంబంధించి ఓ రూమర్ నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. నల్లధన నియంత్రణకు కొత్త నోట్లలో చిన్న చిప్‌ను ప్రవేశపెడుతున్నట్లు కొన్ని వార్తలొచ్చాయి. ఈ చిప్ వల్ల ఫేక్ కరెన్సీ చలామణీని అరికట్టొచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే కొత్తగా వస్తున్న 2వేల రూపాయల నోటులో ఎలాంటి చిప్‌ లేదని ఆర్‌బీఐ ప్రకటించింది. ఇంకా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది. అవన్నీ పుకార్లేనని స్పష్టం చేసింది. కొత్తగా అందుబాటులోకి వచ్చే 2వేల రూపాయల నోటుకు సంబంధించి పలు వివరాలను వెల్లడించింది. ఆర్బీఐ విడుదల చేసిన కొత్త నోటుకు సంబంధించిన వివరాల్లో ఎక్కడా కూడా చిప్ గురించి ప్రస్తావించలేదు. ఈ చిప్‌పై వచ్చినవన్నీ రూమర్లేనని తేలిపోయింది.

రద్దయిన రూ.500, రూ.1000 నోట్లు మార్చుకోవాలంటే ఇవి ఉండాల్సిందే..

Image result for new notes

నల్లధనాన్ని అరికట్టడానికి రూ. 500 నోట్లు, రూ. 1000 నోట్లు మంగళవారం అర్ధరాత్రి నుంచి చలామణిలో ఉండవని ప్రధాని మంత్రి మోదీ ప్రకటించిన నేపథ్యంలో బ్యాంకులు, పోస్టాఫీసుల్లో వీటిని మార్చుకోవడానికి గుర్తింపు పత్రాలు తప్పనిసరి చేశారు. పాన్ కార్డు, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడిలలో ఏదో ఒకటి తప్పనిసరిగా బ్యాంకులు, పోస్టాఫీసుల్లో చూపించి మాత్రమే ఈ నోట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ గుర్తింపు కార్డులు లేకుండా పాత నోట్లను మార్చుకోవడం కుదరదు. అందువల్ల నల్లధనం దాచుకున్న వ్యక్తులు కట్టల కొద్దీ రూ. 500 నోట్లు, రూ. 1000 నోట్లను మార్చుకోవడం అంత తేలిక కాదు.

100, రూ.500 నోటు తర్వాత రూ.2000 నోటే...

కొత్తగా రూ.2000 నోటు, రూ.500 నోట్ల విడుదలకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రస్తుతం వినియోగంలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను తక్షణమే రద్దు చేస్తున్నట్టు ప్రధాని ప్రకటించడంతో పాటు సరికొత్తగా రూ.500, రూ.2 వేల నోట్ల విడుదల ప్రకటన చేశారు. దీంతో రూ.100 నోటు, రూ.500 నోటు తర్వాత చలామణిలో ఉండే అతి పెద్ద నోటుగా రూ.2 వేల నోటు ఉండబోతోంది. ఈ నోటుకు సంబంధించి మరిన్ని వివరాలు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించబోతోంది. నల్లధనానికి కళ్లెం వేసేందుకే ఈ నోటు ఉద్దేశించినట్టుగా సమాచారం. ఈ నోట్ల తయారీకి దేశవాళీ నానో టెక్నాలజీని ఉపయోగించుకుంటారనీ, ప్రతీ నోటుకూ ఒక నానో జీపీఎస్ చిప్ అమరి ఉంటుందని సమాచారం.

 

జీపిఎస్ చిప్ ఎలా పని చేస్తుంది?

ముందే అనుకున్నట్టుగా నల్లధనానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నంలో భాగంగానే ఈ నానో టెక్నాలజీ వినియోగం, జీపీఎస్ చిప్ అమరిక ఉంటుంది. ఈ నానో టెక్నాలజీ (ఎన్‌జీసీ)కి విద్యుత్‌, బ్యాటరీ అవసరం లేదు. ఇది కేవలం సిగ్నల్ రిఫ్లెక్టర్‌గానే ఉపయోగపడుతుంది. ఉపగ్రహం నుంచి వచ్చే సంకేతాలకు ప్రతిస్పందిస్తుంది. లొకేషన్, కరెన్సీ సీరియల్ నెంబర్ వంటి వాటిని తిరిగి శాటిలైట్‌కు పంపిస్తుంది. కరెన్సీ నోటును ధ్వసం చేయకుండా ఎన్‌జీసీని తారుమారు చేసే అవకాశం కానీ, నోటు నుంచి తొలగించే అవకాశం కానీ ఎంతమాత్రం ఉండదు.

 

నల్లధనం అడ్డుకట్టకు ఎలా ఉపయోగపడుతుంది?

ఎన్‌ఎస్‌జీ‌ పొదిగిన నోటును ఉపగ్రహం గుర్తించగలుగుతుంది. ఫలానా ప్రాంతంలో నిల్వ చేసిన కచ్చితమైన సొమ్ము ఎంతో గుర్తించగలుగుతుంది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు మినహాయించి...చాలాకాలంగా అనుమానాస్పద ప్రాంతాల్లో దాచి ఉంచిన సొమ్ము, ప్రాంతాన్ని సైతం గుర్తిస్తుంది. ఆదాయం పన్ను శాఖకు తదుపరి విచారణ కోసం ఈ సమాచారాన్ని అందించగలుగుతుంది. నల్లధనం అడ్డుకట్టకు కేంద్రం, ఆర్‌బీఐ అనుసరిస్తున్న విధానాల్లో ఇదొక కీలకమైన నిర్ణయంగా అనుకోవచ్చు.

అమెరికాలో ఓట్ల లెక్క.. భారత్‌లో నోట్ల లెక్క

Image result for అమెరికాలో ఓట్ల లెక్క.. భారత్‌లో నోట్ల లెక్క

ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు మొదలయ్యాయి. భారత్ సహా ప్రపంచ దేశాలు తమ దృష్టినంతా అటువైపు కేంద్రీకరించాయి. సాయంత్రం ఎనిమిది గంటల వరకు భారత్‌లో ఇదే హాట్ టాపిక్. ఎన్నికల్లో గెలుపెవరిది? ట్రంపా? హిల్లరీనా? అంటూ జోరుగా చర్చోపచర్చలు కొనసాగాయి. అయితే జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారన్న వార్త దేశాన్ని కాసేపు అటెన్షన్ చేసింది. ఏదో కీలక ప్రసంగం చేయబోతున్నారని భారతీయులు టీవీ సెట్ల ముందు అతుక్కుపోయారు. బహుశా పాకిస్థాన్‌పై ఏదో ప్రకటన చేయబోతున్నారని భావించారు. అయితే అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ ఆయన నల్లధనంపై యుద్ధం ప్రకటించారు. ఈ అర్ధరాత్రి నుంచి రూ.1000, రూ.500 నోట్లు రద్దు అవుతున్నట్టు సంచలన ప్రకటన చేశారు. దీంతో దేశంలో ఒక్కసారిగా కలకలం మొదలైంది. నల్లకుబేరుల గుండెల్లో గుబులు మొదలైంది. మోదీ ప్రకటనపై సోషల్ మీడియా వెర్రెత్తిపోయింది. ప్రధాని ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ నెటిజన్లు కామెంట్ల మీద కామెంట్లు చేశారు. ‘అమెరికాలో ఓట్ల లెక్క.. భారత్‌లో నోట్ల లెక్క’ అని కామెంట్లు చేస్తూ అవినీతిపై ప్రధాని పోరాటానికి మద్దతు పలికారు. ‘Americans counting votes.. Indians counting notes’ అనే మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. . సాయంత్రం ఎనిమిది గంటల నుంచి సోషల్ మీడియాలో ఈ చర్చ తప్ప మరో చర్చ లేదనడం అతిశయోక్తి కాదు.

మోదీ నిర్ణయంపై సెహ్వాగ్‌ పంచ్‌!

Image result for మోదీ నిర్ణయంపై సెహ్వాగ్‌ పంచ్‌!

పెద్ద నోట్లను రద్దు చేయాలని ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయం భారత్‌లో భూకంపానికి కారణమైంది. నల్లకుభేరులు తేలుకుట్టిన దొంగల్లా కామ్‌గా ఉంటే.. చాలామంది సెలబ్రిటీలు మోదీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. నట్టింట్లోనే కాదు, నెట్టింట్లోనూ కరెన్సీ గోలే టాప్‌ ట్రెండింగ్‌గా ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలను ఎవరూ పట్టించుకోవడం లేదు. అందరూ పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపైనే చర్చించుకుంటున్నారు. మోదీ నిర్ణయంపై గత రాత్రి సెలబ్రిటీలు చేసిన ట్వీట్లు.. 

సెహ్వాగ్‌:
అమెరికాలో ఓట్ల కౌంటింగ్‌ జరుగుతుంటే.. ఇండియాలో నోట్ల కౌంటింగ్‌ జరుగుతోంది. భారత్‌లో ఈ రాత్రి చాలా ఇళ్లలో లైట్లు ఆఫ్‌ కావు.. 

హర్భజన్‌:
మోదీజీ.. మీరు సూపర్‌ సిక్సర్‌ కొట్టారు. ఇది నిజంగా చాలా గొప్ప నిర్ణయం. మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది. 

రజనీకాంత్‌:
హ్యాట్సాఫ్‌ నరేంద్రమోదీజీ. ఈ నిర్ణయంతో కొత్త భారత్‌ పుడుతుంది. జై హింద్‌!