11/9/16

100, రూ.500 నోటు తర్వాత రూ.2000 నోటే...

కొత్తగా రూ.2000 నోటు, రూ.500 నోట్ల విడుదలకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రస్తుతం వినియోగంలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను తక్షణమే రద్దు చేస్తున్నట్టు ప్రధాని ప్రకటించడంతో పాటు సరికొత్తగా రూ.500, రూ.2 వేల నోట్ల విడుదల ప్రకటన చేశారు. దీంతో రూ.100 నోటు, రూ.500 నోటు తర్వాత చలామణిలో ఉండే అతి పెద్ద నోటుగా రూ.2 వేల నోటు ఉండబోతోంది. ఈ నోటుకు సంబంధించి మరిన్ని వివరాలు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించబోతోంది. నల్లధనానికి కళ్లెం వేసేందుకే ఈ నోటు ఉద్దేశించినట్టుగా సమాచారం. ఈ నోట్ల తయారీకి దేశవాళీ నానో టెక్నాలజీని ఉపయోగించుకుంటారనీ, ప్రతీ నోటుకూ ఒక నానో జీపీఎస్ చిప్ అమరి ఉంటుందని సమాచారం.

 

జీపిఎస్ చిప్ ఎలా పని చేస్తుంది?

ముందే అనుకున్నట్టుగా నల్లధనానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నంలో భాగంగానే ఈ నానో టెక్నాలజీ వినియోగం, జీపీఎస్ చిప్ అమరిక ఉంటుంది. ఈ నానో టెక్నాలజీ (ఎన్‌జీసీ)కి విద్యుత్‌, బ్యాటరీ అవసరం లేదు. ఇది కేవలం సిగ్నల్ రిఫ్లెక్టర్‌గానే ఉపయోగపడుతుంది. ఉపగ్రహం నుంచి వచ్చే సంకేతాలకు ప్రతిస్పందిస్తుంది. లొకేషన్, కరెన్సీ సీరియల్ నెంబర్ వంటి వాటిని తిరిగి శాటిలైట్‌కు పంపిస్తుంది. కరెన్సీ నోటును ధ్వసం చేయకుండా ఎన్‌జీసీని తారుమారు చేసే అవకాశం కానీ, నోటు నుంచి తొలగించే అవకాశం కానీ ఎంతమాత్రం ఉండదు.

 

నల్లధనం అడ్డుకట్టకు ఎలా ఉపయోగపడుతుంది?

ఎన్‌ఎస్‌జీ‌ పొదిగిన నోటును ఉపగ్రహం గుర్తించగలుగుతుంది. ఫలానా ప్రాంతంలో నిల్వ చేసిన కచ్చితమైన సొమ్ము ఎంతో గుర్తించగలుగుతుంది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు మినహాయించి...చాలాకాలంగా అనుమానాస్పద ప్రాంతాల్లో దాచి ఉంచిన సొమ్ము, ప్రాంతాన్ని సైతం గుర్తిస్తుంది. ఆదాయం పన్ను శాఖకు తదుపరి విచారణ కోసం ఈ సమాచారాన్ని అందించగలుగుతుంది. నల్లధనం అడ్డుకట్టకు కేంద్రం, ఆర్‌బీఐ అనుసరిస్తున్న విధానాల్లో ఇదొక కీలకమైన నిర్ణయంగా అనుకోవచ్చు.

No comments: