11/13/16

యోగ ముద్రలు



గుండెను గుండ్రంగా చేసే – మృత్యుంజయ ముద్రలు :- పైన తెలిపినట్లు తెలిసోతెలియకో మనం చేస్తున్న పొరపాట్లవల్ల క్షణక్షణం బలహీనపడుతున్న మనగుండెను మృత్యుం జయముద్ర ఏ క్షణానికాక్షణం గుండ్రాయిలాగా గట్టిగా తీర్చిదిద్దగలుగుతుంది. చిత్రంలో చూపినవిధంగా కుటుంబసభ్యులంతా తగిన ఆసనంలో తూర్పుకెనిలిపి రెండుచేతులను వంకరగా లేకుండాచాచి మోకాళ్ళపై పెట్టండి. రెండుచేతులలోని చూపుడువేళ్ళను క్రిందికివంచి అరచేతికి ఆనించి వాటిపైన బొటనవేలునుంచి ఆ బొటనవేలికొనకు మధ్య వేలికొన, ఉంగరంవేలికొన క్రిందికి వంచి ఆనించి చిటికెనవేళ్ళను నిటారుగా నిలిపివుంచాలి. ఈ పద్దతినే మృత్యుం జయముద్ర లేక హృదయముద్ర అంటారు.
Image result for యోగ ముద్రలు

దూరంగా కూర్చొని తలను వెన్నుపూసను నిటారుగా ఈ ముద్రను ధరించిన సమయంలో నిండుగా నిదానంగా ఊపిరితిత్తులనిండా గాలిని పీల్చుకొని నోటిద్వారా “యం” అనే అక్షరాన్ని ఉచ్చరిస్తూ గాలిని వదలాలి. ఈ విధంగా మూడుపూటలా పూటకు పదిహేను నిమిషాల చొప్పన సాధనచేయాలి. ఇలా క్రమం తప్పకుండా వరుసగా నలబైరోజులపాటు సాధనచేయడంవల్ల రక్తపోటు, కొలెస్టాల్, మానసిక ఉద్వేగాలు హరించి రక్తప్రసరణ చక్కదిద్దబడి హృదయం సంపూర్ణ ఆరోగ్యవంతమౌతుంది. గ్రమ్లనిక్షగుండెకు హానికలిగించే ధూమపానం, మద్యపానం, మాంసాహార సేవనం, అతిచలువ, అతివేడిచేసే పదార్థాలు, అరగని పదార్థాలు, చల్లబడిన పదార్థాలు భుజించడం, గుండెను బలహీనపరిచే ఆవేదన, ఆందోళన, చింతవంటి మనోవికారాలు వీటిని పూర్తిగా నిషేధించితీరాలని మరువకండి. ముందు పేజీలలో సూచించిన అపానముద్రను కూడా దీంతోపాటు ధరించండి

నోట్ల రద్దుపై ప్రజలకు పెద్ద ఊరటనిచ్చిన మోదీ సర్కారు

పెద్ద నోట్ల రద్దుతో ఇక్కట్లు ఎదుర్కొంటోన్న ప్రజలకు మోదీ సర్కారు తీపి కబురు తీసుకొచ్చింది. ఏటీఎంల నుంచి ప్రజలు ఇకపై 2,500 తీసుకోవచ్చు. అలాగే బ్యాంకుల్లో నోట్లు మార్చుకునేందుకున్న పరిమితిని 4వేల రూపాయల నుంచి 4,500కు పెంచారు. అదే సమయంలో బ్యాంకు నుంచి పది వేలు మాత్రమే డ్రా చేసుకోవాలన్న నిబంధనను తొలగించారు. వారానికి 20 వేల రూపాయలు మాత్ర
మే విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని 24 వేలకు పెంచారు. ఈ మేరకు ఆర్ధిక శాఖ నుంచి అన్ని బ్యాంకులకు సూచనలు వెళ్లాయి.

మోడీ తగ్గారా నుంచి ప్రజలు నెక్స్ట్ కోరుకొనేది ఇదే


సరైన స‌మ‌యంలో ఆర్‌బీఐ గుడ్ న్యూస్‌

ఎటు చూసినా అల్ల‌క‌ల్లోలం.. ఆర్ధిక ఎమ‌ర్జెన్సీకి ఇంచుమించు ద‌గ్గ‌ర‌గా వ‌చ్చాం.. చేతిలో డ‌బ్బుల్లేవ్‌.. ఏటీఎమ్ ద‌గ్గ‌ర భారీ క్యూలు.. బ్యాంక్‌లలో చాలినంత డ‌బ్బులేదు. ఇంకేముంది.. ప్ర‌జ‌లు మ‌నీ క‌ష్టాలు ఏంటో తెలిసివ‌చ్చాయి. ఇలాంటి త‌రుణంలో ఆర్‌బీఐ ఓ శుభ‌వార్త‌ను మోసుకొచ్చింది.స‌రిపడినంత నోట్లు లేవ‌ని మార్కెట్‌లో జోరుగా ప్ర‌చారం సాగుతోంది. కొత్త నోట్ల ముద్ర‌ణ‌కు, అవి బ్యాంక్‌లు, ఏటీఎమ్‌ల‌కు చేరుకోవ‌డానికి సహ‌జ స్థితికి చేరుకోవ‌డానికి మ‌రో మూడు వారాలు ప‌డుతుందనే రూమ‌ర్‌లు వినిపిస్తున్నాయి. ఇదంతా అబ‌ద్ధ‌మ‌ని, ఆర్‌బీఐ ద‌గ్గ‌ర స‌రిప‌డినన్ని నోట్లు ఉన్నాయ‌ని తెలిపింది.

ఏటీఎమ్‌లు, బ్యాంక్‌ల‌కు చేరుకున్న వారు ప్ర‌జ‌ల ప‌రిస్థితిని అర్ధం చేసుకొని త‌గినంత మ‌నీని మాత్ర‌మే తీసుకోవాల‌ని సూచించింది. ట్విట్ట‌ర్ ద్వారా ఈ ప్ర‌క‌ట‌న‌ను జారీ చేసింది. 500 నోట్లు ప్ర‌స్తుతానికి మార్కెట్‌లోకి రాక‌పోయినా.. 100 నోట్లకు మాత్రం ఎలాంటి స‌మ‌స్య లేద‌ని, కావాల్సిన స్థాయిలో బ్యాంక్‌ల‌కు పంపామ‌ని తెలిపింది. 

ఇలా చేస్తే చాలు మీలో చాలా మార్పు కనిపిస్తుంది.


సునామీ హెచ్చరికలు జారీ.. న్యూజీలాండ్‌లో భారీ విధ్వంసం

న్యూజీలాండ్‌లో అంతర్జాతీయ కాలమానం ప్రకారం రాత్రి 11 గంటల రెండు నిమిషాలకు ప్రాంతంలో 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. చెవియాట్ ప్రాంతంలో ఇళ్లన్నీ నేలమట్టమయ్యాయి. సౌత్ ఐలండ్‌ను పూర్తిగా ఖాళీ చేయిస్తున్నారు. భారీ విధ్వంసం జరిగిందని సమాచారం అందుతోంది. భూకంపం కారణంగా అంబర్లీ ప్రాంతంలో 2 వేల మంది, కయపోయ్ ప్రాంతంలో పది వేల మంది ఉనికి ప్రమాదంలో పడింది.

ఇలాంటి వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారంట

ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత పగలూ రాత్రీ పని ఒత్తిడిలో మునిగిపోయి అలసిపోతూ ఉంటారు తల్లులు. సెక్స్‌మీద మమకారం ఉన్నా పరిసరాలు, పరిస్థితులు వారిని పర్మిట్‌ చేయవు. ఒకవేళ చేసినా ఏదో అరకొరగా కొద్దిసేపే తప్ప మనఃస్ఫూర్తిగా సెక్స్‌ని ఎంజాయ్‌ చేయడానికి, సంపూర్ణమైన సంతృప్తి పొందడానికి వీలు దొరకదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న భార్యలను సెక్స్‌కు సమాయత్తం చేసేందుకు భర్తలు ఎంతో సహనం, ఓపికతో వ్యవహరించాలి. ఇలాంటివాళ్ళని లాంగ్‌టర్మ్‌ కపుల్స్‌ అంటారు. వీరు గనుక ప్లాన్‌ చేసుకుంటే సెక్స్‌ని అత్యద్భుతంగా ఎంజాయ్‌ చేయగలుగుతారు. ఇలా కోరికలతో వేగిపోయేవారు మంచి ఏకాంతం లభించినప్పుడు సెక్స్‌ను అద్భుతంగా ఎంజాయ్‌ చెయ్యగలుగుతారని ‘థర్టీ డేస్‌ సెక్స్‌ సొల్యూషన్‌’ రచించిన భార్యాభర్తలు Victoria Zdrok Wilson, JD, PhD, జాన్‌ విల్సన్‌లు చెబుతున్నారు. సెక్స్‌ జీవితాన్ని కోల్పోకుండా ఉండాలంటే, ఆదరాబాదరాగా సెక్స్‌ పూర్తిచేయకుండా భార్యాభర్తలు ఒకరి తనువులను మరొకరు సంపూర్ణంగా ఆస్వాదిస్తూ ఏకాంతంగా గడపాలంటే బెడ్రూమ్‌కు లాక్‌ తప్పనిసరిగా ఉండాలని వైవాహిక జీవితంలో పద్నాలుగేళ్ళ అనుభవమున్న ఏడుగురు పిల్లల తండ్రి Sacha Mohammed అంటున్నారు. ‘మా పిల్లల్ని రాత్రిళ్ళు టైమ్‌ ప్రకారం నిద్రపుచ్చుతాం. మా బెడ్రూమ్‌కి తాళం ఉండేట్టు చూసుకుంటాం. ఇల్లు మారిన ప్రతిసారీ బెడ్రూముకు లాక్‌ ఉందోలేదో చూసుకునే మారతాం. మా పిల్లలకి తలుపుతట్టి లోపలికి రావడం నేర్పించాం’ అంటున్నారాయన. పిల్లల బొమ్మలు, పుస్తకాలు, టీవీ వంటి వస్తువులేవీ బెడ్రూమ్‌లోకి ఎలో చెయ్యను. వారికి కేటాయించిన గదిలో చిందరవందరగా పడేసినా నాకెలాంటి ఇబ్బందీ ఉండదు అంటాడాయన నవ్వుతూ. వృద్ధులైన తల్లిదండ్రులు లేదా గ్రాండ్‌ పేరెంట్స్‌ సహాయంలేని ఇళ్ళల్లో భార్యాభర్తలు కొన్ని తప్పనిసరి నిబంధనలు ఏర్పాటు చేసుకోవాల్సిందే అంటున్నారు సెక్స్‌ జీవితంలో తలపండిన అనుభవజ్ఞులు. అందుకే, మీరుకూడా ఎలాంటి ఇబ్బందీ పడకండి. బెడ్రూమ్‌ని స్వర్గంలా తీర్చిదిద్దుకోండి, రాత్రిళ్ళు తనివితీరా సెక్స్‌ని ఎంజాయ్‌ చేసేందుకు చిన్న చిన్న టిప్స్‌ పాటించడం తప్పుకాదు.