Showing posts with label Health. Show all posts
Showing posts with label Health. Show all posts

12/21/16

నాజూకుగా ఉండేందుకు చిట్కాలు


ఒకప్పుడు సన్నగా కనపడితే ఏం సరిగా తినటంలేదా అని ప్రశ్నిచేవారు.కాని ఇప్పుడు అందుకు భిన్నంగా ఏంటీ తిండి తగ్గించవచ్చుగా కరెంటు తీగలా ఉంటావ్ అంటున్నారు.ఇప్పుడు కాలం మారింది.సన్నగా నాజూకుగా జీరొ సైజ్ ను చేసేవారికి బాగా గిరాకీ పెరిగింది.సన్నగా నడుము తేలి ఉంటే అమ్మో బాపుగారి బొమ్మో!అని చూపు తిప్పుకోలేరు.అయితే ఇప్ప్డున్నా ఆహార అలవాట్లు మాత్రం లావు పెంచేవే కానీ తగ్గించేవి మాత్రం కావు.మారిన పరిస్థితులు, ఆహారపు అలవాట్లలో వచ్చిన పెను మార్పులు నాజూకు శరీరాన్ని దూరం చేస్తున్నాయి. సన్నబడాలంటే తినడం తగ్గించాలి కానీ, కడుపునిండా తినమంటున్నారేమిటి అని ఆశ్చర్యపోతున్నారా! నచ్చింది తిన్నా నాజూగ్గా ఎలా ఉండవచ్చో చూద్దామా.

సన్నగా కనబడడానికి, సన్నపడడానికి చాలా మంది యువత పడరాని పాట్లు పడుతున్నారు. జిమ్‌ల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. బ్యూటీషియన్లకు వేలకు వేలు సమర్పించుకుంటున్నారు. వీరి ప్రయత్నాలన్నీ శూన్యంగా మారుతున్నాయి. రోజుల తరబడి కడుపు మాడ్చుకోవడం వలన జీవప్రక్రియ దెబ్బతింటుంది. దీని ప్రభావం కండరాల మీద పడుతుంది. చిన్న వయసులోనే కీళ్ళనొప్పులు, ఎక్కువ దూరం నడవలేకపోవడం వంటివి బాధిస్తాయి.

శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా తమ పని తాము చేసుకుపోవాలంటే ఆహారం తీసుకోవడం తప్పనిసరి. రోజంతా చురుకుగా పనిచేయాలంటే కేలరీలు తప్పనిసరి. పౌష్టికాహారం తీసుకోవడం ద్వారానే కేలరీలు పొందడం సాధ్యమవుతుంది. కొన్ని రోజుల పాటు ఉపవాసాలు చేసి, ఆ తరువాత కేలరీల వినియోగం గణనీయంగా తగ్గిపోతుంది. కేలరీలు వినియోగం తగ్గినప్పుడు కొవ్వు వచ్చి చేరుతుంది.

1.కొద్దిపాటి వ్యాయామాలతో అందంగా ఆరోగ్యంగా వుండడం సాధ్యమవుతుంది.ఎక్కువ తింటున్నాం కాబట్టి ఎక్కువసేపు వ్యాయామం చేయాలనుకోవటం పొరబాటని నిపుణులు అంటున్నారు.కింద సూచించిన విధంగా మీ ఆహారపు అలవాట్లని మార్చుకొన్నట్లయితే అందాన్ని పదికాలల పాటు కాపాడుకోవచ్చు.

2 ఖాళీగా వుంచితే గ్యాస్ చేరే అవకాశం వుంది. కాబట్టి మూడు నాలుగు గంటలకు మించి కడుపును ఖాళీగా వుంచుకోకండి..ప్రతి మూడు లేదా నాలుగు గంటలకొకసారి ఆహారం తీసుకుంటూ వుండాలి.

3.మొదట తీసుకొనే ఆహారాన్నే మూడు లేదా నాలుగు భాగాలుగా విభజించుకోవాలి.ఆహారంలో ఎక్కువ భాగం గింజలు వుండే విధంగా ప్లాన్ చేసుకోవాలి.

4.గంటల తరబడి పనిచేసినా నీరసం రాకుండా ప్రొటీన్లు కాపాడతాయి.ప్రొటీన్లు తీసుకోవడం తప్పనిసరి, ప్రొటీన్లు మిమ్మల్ని ఉత్సాహంగా, ఉల్లాసంగా వుంచుతాయి. తృణధాన్యాలు తీసుకొనేటప్పుడు ఫైబర్ అధికంగా వున్నవాటినే తీసుకోవాలి.

5.దీనితోబాటు చక్కెర తక్కువ వున్నవాటినే ఎంపిక చేసుకోవాలి.

6.తాజా పండ్లు కూరగాయలలో విటమిన్లు, ఫైబర్ అధికంగా లభిస్తాయి.రోజుకు కనీసం ఐదు రకాల పండ్లన్నా తీసుకోవాలి.

7.రోజుకి 12 గ్లాసుల నీరు తాగడం తప్పనిసరి. 60 నుంచి 70 శాతం ఆహారం తీసుకొని మిగతా 30 నుంచి 40 శాతం నీటిని తాగాలి.

8. బేకరీ ఉత్పత్తులకు పూర్తిగా దూరం కాకుండా తీసుకొనే పరిమాణాన్ని తగ్గించుకుంటే సరిపోతుంది. బేకరీ ఉత్పత్తులతో పాటు పళ్ళు కూరగాయలు తీసుకుంటే శరీరానికి కావలసిన విటమిన్లు, పోషకాలు అందుతాయి.

ఏది చేస్తే శరీరానికి మంచిది:

తెల్లవారుజామున నడిస్తే శరీరానికి చాలా మంచిది.కష్టపెట్టే వ్యాయామాల కన్నా రోజూ కొంత సేపు నడిస్తే మంచిది. కనీసం అరగంటకి తక్కువ కాకుండా నడవడం అలవాటు చేసుకోవాలి. రోజు మొత్తంలో ఏ సమయంలోనైనా నడవచ్చు.

మీ ఆహారపు అలవాట్లను మార్చకుండా కొన్ని వారాల పాటు కొనసాగించంది. మూడు నాలుగు వారాలకొకసారి మాత్రమే డైట్ ప్లాన్‌ను మార్చాలి. తరచూ మార్చడం వలన జీవప్రక్రియ దెబ్బతినే ప్రమాదముంది.

12/18/16

గర్భిణులు ఉల్లిపాయ తినటం వలన లాభాలు

మీరు గర్భవతి అయిఉండి పచ్చి ఉల్లిపాయ తింటున్నారా? సల్ఫర్ ఎక్కువగా కలిగి ఉండే ఉల్లిపాయ ఆరోగ్యానికి మంచిదేమో అని ఒకసరి ఆలోచించండి. అల్లియం కుటుంబానికి చెందిన ఉల్లిపాయ వంటలలో వాడే సాధారణ రకానికి చెందిన కూరగాయ. గాడమైన వాసన కలిగి ఉండే ఉల్లిపాయ అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది.

గర్భ సమయంలో తినే ఆహార పదార్థాలు పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రకాల ఆహార పదార్థాలను మాత్రమే తినాలని కొంత మంది సూచిస్తే, కొంత మంది వాటిని మాత్రమే తినాలని మరికొంత మంది సూచిస్తుంటారు. ఫలితంగాగర్భిణులలో ఆహార పదార్థాల పట్ల ఒక గందరగోళం తలెత్తుతుంది. సాధారణంగా కనిపించే ఉల్లిపాయను తినొచ్చా లేదా అని గర్భిణులలో కలిగే ఒక సందేహం.


Image result for గర్భిణులు


ఉల్లిపాయ వలన కలిగే ప్రయోజనాలు


గర్భిణులు ఉల్లిపాయ తింటే వారి ఆరోగ్యానికి మంచిదే అని చెప్పవచ్చు. ఉల్లిపాయలలో విటమిన్ 'C', బయోటిన్, మాంగనీస్, కాపర్, ఫాస్పరస్, పొటాషియం, విటమిన్ బి6, ఫోలేట్ వంటి ముఖ్య పోషకాలను కలిగి ఉంటుంది. ఇది గర్భిణులకు చాలా ఆరోగ్యకరమని చెప్పవచ్చు. సల్ఫర్ ఎక్కువగా కలిగి ఉండే ఉల్లిపాయ తినటం వలన పుట్టబోయే బిడ్డకు ఎలాంటి ప్రమాదం కలగదా అనే ప్రశ్న తలెత్తవచ్చు. ఉల్లిపాయ పుట్టబోయే బిడ్డకు ఎలాంటి హాని కలిగించదని నిపుణులు తెలుపుతున్నారు. ఉలిపాయ వలన గర్భిణులకు కలిగే ప్రయోజనాలేంటో మీరే చూడండి.

రక్తపోటు

గర్భిణీలలో చాలా తరచుగా ఇబ్బంది పెట్టే సమస్య- రక్తపోటు. దీనిని నియంత్రించటంలో పచ్చి ఉల్లిపాయలు సహాయపడతాయి. వీటితో పాటుగా, నిద్రలేమి, ప్రీమెచ్యూర్ డెలివరీ, హైపర్ టెన్షన్ వంటి వాటిని కూడా తగ్గిస్తుంది.

పంటినొప్పిని తగ్గిస్తుంది

గర్భిణీల్లో వచ్చే హార్మోన్ల మార్పుల వల్ల దంత సమస్యలు వస్తాయి. పాచి పెరగటం, ఇన్ల్ఫేమేషన్ మరియు బ్లీడింగ్ సమస్యలు వస్తుంటాయి. దంత సమస్యలు, నివారించుకోవడానికి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉన్న ఉల్లిపాయలు డైట్ లో చేర్చుకోవడం వల్ల పంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ఫైబర్

గర్భిణులలో మలబద్దకం చాలా సాధారణ సమస్య. ఉల్లిపాయలో ఉండే ఫైబర్ పేగు కదలికలను సరిగా జరిగేలా చేసి,మలబద్దకం వంటి నుండి ఉపశమనం కలిగిస్తుంది.

ఇమ్యునిటీ

ఉల్లిపాయల్లో విటమిన్ 'C' ఎక్కువగా ఉంటుంది. అలాగే వివిధ పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటటం వల్ల గర్భిణీలలో వ్యాధినిరోధక శక్తి పెంచి.. కడుపులోని బిడ్డ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

డయాబెటిస్

ఉల్లిపాయల్లో క్రోమియం ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి గర్భిణీలకు సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. కాబట్టి ఎలాంటి సందేహం లేకుండా.. గర్భిణీలు.. ఉల్లిపాయలు తీసుకోవచ్చు.

డీహైడ్రేషన్

శరీరంలో మెటల్ ఎక్కువగా ఉండటం తల్లీ, బిడ్డ ఇద్దరికీ హానికరం. ఉల్లిపాయల్లో ఉండే ఎమినో యాసిడ్స్, సిస్టైన్, మెథినైన్ లు శరీరాన్ని నిర్విశీకరణం చేయడానికి సహాయపడతాయి.

12/13/16

జామ ఆకులు జుట్టు రాలడాన్ని నివారించె ఔషధం

జామ కాయలు ఆరోగ్యానికి మంచి ఔషధం. జామ పండులో ఆరోగ్యానికి మంచి చేసే ఎన్నో గుణాలు ఉన్నాయి. అలాంటి గుణాలు జామ ఆకుల్లో కూడా ఉన్నాయని చాలా మందికి తెలియని విషయం. జామ ఆకులు జుట్టు రాలడాన్ని నివారించి జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. జామ ఆకుల్లో ఉండే అధిక పోషకాలు దీనికి కారణం. జామ ఆకులలో విటమిన్ – బి ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టుపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. అలాగే జామ ఆకులో ఉండే విటమిన్ బి5, బి3, బి6 చర్మం కాంతివంతంగా మారేందుకు సహాయపడుతాయి. విటమిన్ బి2 చర్మంలో మృత కణాలను నివారించటమే గాక చురుకైన కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది.


ఔషధం తయారు చేయు విధానం..
అవసరానికి సరిపడ జామ ఆకులను శుభ్రంగా కడిగి 15-20 నిమిషాల పాటు నీటిలో వేడి చేయాలి. వేడి నీరు చల్లారే వరకు ఉంచి, ఆ మరిగించిన నీటిని తలపై నెమ్మదిగా పోస్తూ మునివేళ్లతో వెంట్రుకల కుదుళ్ళలో పట్టేలా మసాజ్ చేస్తున్నట్టు చేయాలి. తలకు ఆ మరిగించిన నీరు పట్టించిన తరవాత ఒక గంటపాటు అలానే ఉండి తరువాత తలస్నానం చేయాలి. ఇలా కంటిన్యూగా ఒక నెల రోజులు చేస్తే వెంట్రుకల కుదుళ్ళు గట్టిపడి, వెంట్రుకలు ఊడిపోకుండా ఉంటాయి.

12/2/16

హృదయం ఆరోగ్యంగా ఉండాలంటే ....?

మనం పాటించే జీవనశైలిపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అవునా! మన శరీరంలో ముఖ్య భాగంగా చెప్పుకునే హృదయం ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి అలవాట్లు పాటించాలో ఇక్కడ తెలుపబడింది.



1వ్యాయామాలు

హృదయం కావాలనుకుంటే, ఆరోగ్యంగా ఉండాలంటే, సరైన స్థాయిలో వ్యాయామాలను చేస్తూ, రోజులో 500 నుండి 950 కేలోరీలను కరిగించాలి. హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే కార్డియో వ్యాయామాలు చేయాలి, వీటిలో శరీరం కదలటం వలన ఉచ్వాస, నిచ్వాసాలు వేగవంతం అవుతాయి. అంతేకాకుండా, ఈ కార్డియో వ్యాయామాలు రక్తపోటును కూడా తగ్గిస్తాయి.

2ఆరోగ్యకర ఆహార ప్రణాళిక

కొవ్వు పదార్థాలు తక్కువ గల ఆహార పదార్థాలు మన హృదయానికి మంచి స్నేహితులు. ఈ ఆహారంలో రిఫైన్డ్ చక్కెరలు మరియు ట్రాన్స్ ఫ్యాట్ లు మోతాదులో ఉంటాయి మరియు ఫైబర్, ఒమేగా-౩ ఫాటీ ఆసిడ్ లు అధికంగా ఉండి, హృదయం యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఒమేగా-౩ ఫాటీ ఆసిడ్ లు అధికంగా గల ఆహార పదార్థాలను తినటం వలన హృదయ సంబంధిత వ్యాధులకు గురయ్యే అవకాశాలు చాలా మట్టుకు తగ్గుతాయి. వివిధ రకాల పండ్లు, కూరగాయలు బరువును నియంత్రణలో ఉంచటంతో పాటూ, రక్తపోటును తగ్గిస్తాయి.
3 నిద్ర

ఒక గంట పాటూ ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకునే వారి గుండెపోటుకు కారణమయ్యే ఆర్టేరీ క్లాగింగ్ (ధమనులలో అడ్డంకుల)కు గురయ్యే అవకాశాలు తగ్గుతాయని U.S న్యూస్ & వరల్డ్ రిపోర్ట్ వారు తెలిపారు. హృదయం ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర తప్పని సరి. ప్రతి రోజు ఎలాంటి ఆటంకాలు లేని నిద్రపోవటానికి ప్రయత్నించండి.

4 ధూమపానానికి దూరం

సిగరెట్ లేదా ధూమపానం అనేది హృదయ సంబంధిత వ్యాధులతో పాటూ, ఇతర అనేక రకాల వ్యాధులకు కారణమని చెప్పవచ్చు. మీరు తాగే సిగరెట్ సంఖ్యకు అనుగుణంగానే హృదయ సంబంధిత వ్యాధులు కలిగే అవకాశం కూడా గణనీయంగా పెరుగుతుంది. కావున ఈ అలవాటుకు దూరంగా ఉండటం మంచిది.

5 ఆల్కహాల్ కు కూడా దూరం

మితిమీరిన మోతాదులో ఆల్కహాల్ తాగటం వలన అధిక రక్తపోటు మరియు హృదయ సంబంధిత వ్యాధులు క;ఉగుతాయని "అమెరికన్ హార్ట్ అసోసియేషన్" వారు తెలిపారు. అంతేకాకుండా, తగు మోతాదులో ఆల్కహాల్ తాగటం వలన శరీరంలో మంచి కొవ్వు పదార్థాల స్థాయిలు పెరుగుతాయని, ఫలితంగా హృదయ ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు.

6 ఒత్తిడికి దూరం

డిప్రెషన్ లని వారితో పోలిస్తే , డిప్రెషన్ కు కు గురయ్యే వారు నాలుగో వంతు గుండెపోటుకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని వారు తెలిపారు. ఒత్తిడికి గురయినపుడు వ్యాయామాలు చేయకుండా, అధికంగా తింటూ, ఎక్కువగా సిగరెట్ తాగుతుంటారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వారు తెలిపిన దాని ప్రకారం, ఇలా ఒత్తిడి, డిప్రెషన్ కు గురయ్యే వారిలో రక్తపోటు రెట్టింపు అవుతుంది. ఇలాంటి సమయంలో ఒత్తిడిని తగ్గించి, ప్రశాంతతను చేకూర్చే వాటిని అనుసరించటం మంచిది.

11/19/16

మజ్జిగ వల్ల మనకి కలిగే ప్రయోజనాలు


  • మజ్జిగ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో కెలోరీల సంఖ్య తక్కువగా ఉండి వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుంది.
  • మజ్జిగను మన కురులకు పట్టించి ఒక 20 నిమిషాల తర్వాత తలా స్నానం చేస్తే కురులు నిగనిగలాడుతాయి.
  • మజ్జిగను చర్మానికి రాసుకొని ఒక అరగంట తర్వాత స్నానం చేస్తే చర్మ వ్యాధులు కూడా తగ్గుతాయి.
  • అలాగే మజ్జిగను చర్మానికి రాసుకోవడం వలన చర్మం కూడా చాలా మృదువుగా మెరిసిపోతుంది.
  • ఈ మధ్య చాలా మంది బ్యూటిషియన్లు కురులకు, చర్మానికి… అందం విషయంలో వారి కష్టమర్లకు మజ్జిగను వాడుతున్నట్టు చాలా మంది తెలియజేశారు.
  • శీతాకాలంలో, వర్షాకాలం లో పెరుగు కానీ మజ్జిగ కానీ మనం ఆహారంలో తీసుకుంటే జలుబు చేస్తోంది అనుకుంటారు కాని మజ్జిగ వలన జలుబు తొందరగా తగ్గుతుంది.
  • మజ్జిగలో ఉండే పోషకాలు జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తాయి.
  • ప్రతిరోజూ మజ్జిగని మొహానికి రాసుకోవడం వల్ల మొహంపై ఉండే నల్లటి మచ్చలు వారం రోజుల్లో తొలగిపోతాయి.

11/18/16

టిఫన్ కన్నా చద్ది అన్నం మిన్న

మన పెద్దవారు అన్ని సంవస్తరాలు ఏ రోగం లేకుండా దృడంగా ఉండటానికి కారణం వారు రోజువారీ ఆహారపు అలవాట్లే …ఉదయాన్నే వారు ఇప్పటిలా దోస , ఇడ్లీ కాకుండా …చద్ది అన్నం …అదే రాత్రి మిగిలిన అన్నము లో పెరుగో లేదా గంజి లో ఉప్పు వేసుకొని తినేస్తుంటారు … అది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట .

రాత్రి మిగిలిన అన్నం లో ఉదయానికల్లా  చాలా రకాల మార్పులు జరుగుతాయి, 50 గ్రాముల అన్నంను తీసుకుని రాత్రి పులియపెట్టినట్లయితే 1.6 మిల్లీ గ్రాములు ఉన్న ఐరన్‌ 35 మిల్లీ గ్రాములుగా పెరుగుతుంది. అలాగే పోటాషియం మరియు కాల్షియంలు కూడా భారీ మొత్తంలో పెరుగుతాయి, ఇవన్నీ మన శరీరాన్ని మరింత ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతాయి.
శరీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుంది.
శరీరంలో వేడి ఎక్కువగా ఉన్న వారు చద్దన్నంలో పెరుగు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకుని తింటే ఆ వేడి తగ్గుతుంది.
ఎక్కువ సమయం ఉల్లాసంగా గడపాలంటే చద్దన్నం పొద్దునట్లే తినాల్సిందే.
పలు చర్మ వ్యాదుల నుండి చద్దన్నం కాపాడుతుంది.
పేగుల్లో ఉండే అనారోగ్య సమస్యలను సైతం ఈ చద్దన్నం తగ్గిస్తుంది.
మ‌ల‌బ‌ద్ద‌కం, నీర‌సం త‌గ్గిపోతాయి. బీపీ అదుపులో ఉంటుందిhttp://fkrt.it/CIH3!!NNNNhttp://fkrt.it/CIH3!!NNNN

పెసరపప్పుతో చిన్న చిట్కాను పాటిస్తే చాలు ఎలాంటి జ్వరమునైన తగ్గించవచ్చు

నిజానికి జ్వరం అంటే ఏమిటి? జ్వరం ఎందుకు వస్తుంది? ఆరోగ్యంగా ఉండే వ్యక్తి శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెంటిగ్రేడ్‌ (98.6 డిగ్రీల ఫారెన్‌హీట్‌) ఉంటుంది. ఎవరికైనా జ్వరం (ఫీవర్‌) వచ్చిందంటే ఆ వ్యక్తి శరీర ఉష్ణోగ్రత పెరిగిందన్నమాటే. జ్వరం తీవ్రత 107.6 ఫారన్‌హీట్‌ను మించినపుడు బ్రెయిన్‌ డ్యామేజ్‌కు ఆస్కారం ఉంటుంది. అయితే జ్వరాన్ని తగ్గించాలంటే…ముందుగా టెంపరేచర్ ను కంట్రోల్ చేయాలి. అమాంతం పెరిగిపోయిన టెంపరేచర్ ను నార్మల్ లెవల్ కు తీసుకువస్తే…జ్వరాన్ని తగ్గించినట్టే..! అందుకోసం ఓ చిన్న చిట్కాను పాటిస్తే చాలు..!

ఓ కప్పు పెసరపప్పును తీసుకొని, దానిని ఓ సారి కడిగి, ఓ గిన్నె నిండా నీళ్లు పోసి అందులో పెసరపప్పును ఓ 20 నిమిషాలు నానబెట్టాలి. 20 నిమిషాల తర్వాత ఆ పెసరపప్పు కడిగిన నీళ్లను ఓ గ్లాస్ లో పోసి జ్వరంతో బాధపడుతున్న వ్యక్తికి తాగించాలి. జ్వరంతో బాధపడుతున్న వ్యక్తి…ఈ నీటిని తాగిన 10 నిమిషాల్లో అతని బాడీ టెంపరేచర్ క్రమంగా తగ్గుకుంటూ వస్తుంది. ఓ 20 నిమిషాల తర్వాత అతడు సాధారణ స్థితికి చేరుకుంటాడు. అప్పటి వరకు చేదుగా ఉన్న అతని నోరు…ఇప్పుడు కాసింత దారిలోకి వస్తుంది. ఆ సమయంలో తేలికగా జీర్ణమయ్యే పదార్థాలను తినిపించాలి. దీనితో పాటు డాక్టర్ ఇచ్చిన మందులను వాడుతుండాలి.
పెసరపప్పు లో వేడిని తగ్గించే అద్భుతమైన గుణాలున్నాయి, ఓ 20 నిమిషాల నానబెట్టడం వల్ల ఆ గుణాన్ని ఆ నీటికి సంక్రమింపజేస్తుంది పెసరపప్పు. అంతే కాదు పెసలలో విటమిన్ బి, విటమిన్ సి, మాంగనీస్ తోపాటు ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. సూర్యుని నుంచి వచ్చే అతినీలిలోహిత కిరణాలు, పర్యావరణ కాలుష్యం వల్ల వచ్చే చర్మ సమస్యల నుండి కూడా కాపాడే శక్తి పెసళ్లకు ఉంది. పెసళ్లను మన ఆహారంలో భాగం చేసుకోవడం చాలా ఉత్తమం. వేడి ఎక్కువగా ఉండే వాళ్లకు ఈ పెసరపప్పు ఓ వరం. పండగలప్పుడు పెసరపప్పు పానకం చేస్తారు. శరీరంలో వేడిని తగ్గించి వ్యాధి నిరోధక శక్తిని పెంచటంలో ఈ పానకం సమర్దవంతంగా పనిచేస్తుంది

11/15/16

చర్మ వ్యాధుల నివారణకు. అద్భుత ఔషధం

ముండ్లు, పుండ్లు – హరించే మలామ్;-ఆవనూనె 50గ్రా తీసుకొని పాత్రలో పోసి పొయ్యిమీద పెట్టి అందులో తేనెమైనం 20గ్రాII వేసి చిన్నమంటపైన కరిగించాలి. తరువాత దించి వడ పోసి మళ్ళీపాత్రలోపోసి అందులో తెల్లగుగ్గిలం పొడి 10గ్రాl, రూమిమస్తకి(ఇది ఆయుర్వేద మూలికల అంగడిలో దొరుకుతుంది) చూర్ణం15గ్రా కలపాలి. ఇది ఆరేటప్పటికి మలాంలాగా తయారౌతుంది.ఈ మలామ్ను పైన పట్టిస్తూవుంటే ఎంత మొండి పండు అయినా మాడిపోతయ్. అలాగే శరీరంలో ఎక్కడైనా గుచ్చుకున్నముండ్ల లోపలే విరిగిపోయి రాకుండా వుంటే దానిపైనఈమలంను పట్టిస్తే అవి బయటకు వస్తయ్అన్నిరకాల -చర్మవ్యాధులకు

చిత్రమూలం వేరు, చండ్రచెట్టుబెరడు, కొడిశ పాలచెట్టబెరడు, రేలచెట్టు బెరడు, వేగిసచెట్టు బెరడు, సమంగా సేకరించుకోవాలి. ఒకలీటరు నీటిలో పైనచెప్పిన చెట్లబెరడు ఒక్కొక్కటి పది గ్రాముల చొప్పనవేసి పొయ్యిమీద పెట్టి నాలుగవ వంతు కషాయం మిగిలేవరకు మరగబెట్టాలి. దించి వడపోసి ఆకషాయంలో సరిపోయినన్నికర క్కాయలువేసి ఉడకబెట్టాలి. కషాయం ఇగిరిన తరువాత కరక్కాయలుతీసి తేనెలోవేసి నిలువచేయాలి. రోజూ పూటకు ఒకటి లేకరెండు కరక్కాయల చొప్పన తింటూ లోపలిగింజలను బయటకువూసివేస్తుంటే క్రమంగా అన్నిరకాల చర్మరోగాలు అదృశ్యమైపోతయ్.
ಅನ್ನಿరకాల – సర్పిరోగాలకు;-గోరింటాకు, ధనియాలు, ఎర్రచందనం, వీటిని సమానభాగాలుగా తీసుకొని విడివిడిగా దంచి జల్లెడపట్టి ఆతరువాత ఒకదానిలో ఒకటి వరుసగా కలిపి ఒకగాజుపాత్రలో నిలువవుంచుకోవాలి.రోజూ పూటకు3గ్రాII మోతాదుగా నీటితో రెండుపూటలా ఆహారానికి అరగంటముందు సేవిసూ, ఉప్పువేయని గోధుమరొట్టెను నేతితో తింటూవుంటే క్రమంగా అన్నిరకాల సర్పివ్యాధులు తప్పకుండా హరించిపోతయ్.
పుoడ్లుపడి – చర్మంమందమైతే;-కొంతమందికి వివిధ కారణాలవల్ల చర్మంపైన పుండ్లువచ్చి అవి తగ్గినతరువాత పై చర్మం లావుగా మందంగా తయారౌతుంది. అలాంటివారు ప్రతి రోజూ నిదురించేముందు తగినంత గోరింటాకు తీసుకొని మెత్తగానూరి ఆముద్దను పైనవేసి కట్టు కడుతూవుంటే క్రమంగా మందంగావున్న చర్మం తిరిగి మామూలుపరిస్థితికి వస్తుంది.

11/13/16

యోగ ముద్రలు



గుండెను గుండ్రంగా చేసే – మృత్యుంజయ ముద్రలు :- పైన తెలిపినట్లు తెలిసోతెలియకో మనం చేస్తున్న పొరపాట్లవల్ల క్షణక్షణం బలహీనపడుతున్న మనగుండెను మృత్యుం జయముద్ర ఏ క్షణానికాక్షణం గుండ్రాయిలాగా గట్టిగా తీర్చిదిద్దగలుగుతుంది. చిత్రంలో చూపినవిధంగా కుటుంబసభ్యులంతా తగిన ఆసనంలో తూర్పుకెనిలిపి రెండుచేతులను వంకరగా లేకుండాచాచి మోకాళ్ళపై పెట్టండి. రెండుచేతులలోని చూపుడువేళ్ళను క్రిందికివంచి అరచేతికి ఆనించి వాటిపైన బొటనవేలునుంచి ఆ బొటనవేలికొనకు మధ్య వేలికొన, ఉంగరంవేలికొన క్రిందికి వంచి ఆనించి చిటికెనవేళ్ళను నిటారుగా నిలిపివుంచాలి. ఈ పద్దతినే మృత్యుం జయముద్ర లేక హృదయముద్ర అంటారు.
Image result for యోగ ముద్రలు

దూరంగా కూర్చొని తలను వెన్నుపూసను నిటారుగా ఈ ముద్రను ధరించిన సమయంలో నిండుగా నిదానంగా ఊపిరితిత్తులనిండా గాలిని పీల్చుకొని నోటిద్వారా “యం” అనే అక్షరాన్ని ఉచ్చరిస్తూ గాలిని వదలాలి. ఈ విధంగా మూడుపూటలా పూటకు పదిహేను నిమిషాల చొప్పన సాధనచేయాలి. ఇలా క్రమం తప్పకుండా వరుసగా నలబైరోజులపాటు సాధనచేయడంవల్ల రక్తపోటు, కొలెస్టాల్, మానసిక ఉద్వేగాలు హరించి రక్తప్రసరణ చక్కదిద్దబడి హృదయం సంపూర్ణ ఆరోగ్యవంతమౌతుంది. గ్రమ్లనిక్షగుండెకు హానికలిగించే ధూమపానం, మద్యపానం, మాంసాహార సేవనం, అతిచలువ, అతివేడిచేసే పదార్థాలు, అరగని పదార్థాలు, చల్లబడిన పదార్థాలు భుజించడం, గుండెను బలహీనపరిచే ఆవేదన, ఆందోళన, చింతవంటి మనోవికారాలు వీటిని పూర్తిగా నిషేధించితీరాలని మరువకండి. ముందు పేజీలలో సూచించిన అపానముద్రను కూడా దీంతోపాటు ధరించండి

ఇలా చేస్తే చాలు మీలో చాలా మార్పు కనిపిస్తుంది.


11/12/16

బరువు తగ్గటం చాలా సులువు

అతికొవ్వతగ్గుటకు – తిప్పతీగ తిప్పతీగపొడి, త్రిఫలాలపొడి సమంగా కలిపి నిలువవుంచుకోవాలి. రోజూ ఒక గాసు నీటిలో ఒకచెంచా పాడివేసి ఒకకప్ప కషాయం మిగిలేవరకు మరిగించి వడపోసి గోరువెచ్చగా ఒకచెంచా తేనె కలిపిఉదయంపూట తాగాలి. ఒక గంటవరకు మరేమి తిన కూడదు, తాగకూడదు. దీనివల్ల క్రమంగా శరీరంశ్రీకోని అతికొవ్వు కరిగిపోతుంది,
అన్నిరకాల ఉబురోగాలకు – నేలవేము నేలవేము 10గ్రాII, శాంఠి 10గ్రాII నలగొట్టి పావు లీటరు మంచినీటిలోవేసి సగానికి మరిగించి వడపోసు కోవాలి. అందులో ఒకచెంచా కండచక్కెర కలపి రెండు పూటలా సేవిసూవుంటే క్రమంగా వాతదోషంవల్లగానీ, పైత్యదోషంవల్లగానీ కఫదోషంవల్లగానీ శరీరంలో చెడునీరు చేరిన ఉబ్బరోగం తప్పక హరించిపోతుంది.

వెల్లుల్లిపాయలు 320గ్రా, తెచ్చి పై పాటు తీసివేసి లోపలి రెబ్బల్ని తీసి తోకలు కత్తిరించి పై తోలు కూడా తీసివేసి లోపలి పప్పును మెత్తగా ముద్దలాగా నూరండి. ఆ ముద్దను కళాయిపాత్రలో వేసి పొయ్యి మీద పెట్టి అందులో నాలుగులీటర్ల పాలు, నాలుగులీటర్ల మంచినీళ్ళు కలిపి చిన్నమంట మీద మరిగించండి. నీరంతా ఇగిరి పోయిన తరువాత పాత్రను దించి కషాయాన్ని వడకట్టి తడిలేని పొడి గాజుపాత్రలో నిలవజేయండి.
ఈ కషాయాన్ని పూటకు 20గ్రా, మోతాదుగా కప్ప వేడిపాలలో కలిపి ఒకచెంచా పటికబెల్లం కూడా ಟೆ:ssoಖ రెండుపూటలా తాగుతుంటే గృధ్రసీవాతం నలభైరోజుల్లో పూర్తిగా తిరిగిరాకుండా కరిగిపోతుంది. ఈ ప్రయోగంవల్ల కడుపబ్బరం హరించి ఆహారం బాగా వంటబడుతుంది. అంతేగాక అధిక రక్తపోటు, కొలెస్తాల్, అతిబరువు, దగ్గు, ఆయాసం, ఉబ్బసం, గుండెజబ్బులవంటి సమస్యలు కూడా హరించి మంచి ఆరోగ్యం కలుగుతుంది.

మానసిక బలం కోసం ఏమి చేయాలి

అమృత భాండం 
కొబ్బరి నీళ్లలో ప్రొటీన్లు 0.1 కార్బోహైడ్రేట్లు 4 కొవ్వ పదార్థాలు 0.1 కాల్షియం 00% ఖని జాలు 0.4 శాతం వంతున ఉంటాయి. మొత్తంగా 100 మిల్లీలీటర్ల కొబ్బరి నీళ్ల ద్వారా 174 క్యాలరీల శక్తి లభిస్తుంది. అధిక శాతంలో ఉండే పొటాషియం లోబీపీని నివారిస్తుంది. జీర్ణ క్రియకు బాగా మేలు చేస్తుంది. పచ్చి ఎండు కొబ్బరిలోనూ క్యాలరీలు బాగానే లభిస్తాయి.

మనోసౌందర్యానికి- మహాసులువైనయోగం
పెద్దసోంపుగింజలు 100గ్రాతెచ్చి దోరగా వేయించి, దంచి జల్లించి దానితో సమానంగా పటికబెల్లం పొడి కలిపి నిలువచేసుకోవాలి. రోజూ రెండుపూటలా పిల్లలకు ఆరచెoచా పెద్దలకు ఒకచెంచామోతాదుగా చప్పరించి తిని ఒకకప్పపాలు తాగుతుంటే మానసికచికాకు, చిరాకు,
ఆందోళన, భయం, దు:ఖం,మతిమరుపు హరించిపోయి హరించిపోయి  మనసు ప్రసన్నంగా ఉంటుంది.
కాయకల్పానికి – తిప్పతీగలడువస్తఫూళితం పట్టిన తిప్పతీగచూర్ణం 100గ్రా, పాత బెల్లం 16 గ్రా, తేనె 16 గ్రా, నెయ్యి 16గ్రా, కలిపి మొత్తగాదంచి 10గ్రా, మోతాదుగా లడ్డుకట్టి నిలవజేసుకోవాలి.
ఈ తిప్పతీగలడ్లను పూటకు ఒకటి లేక రెండు చొప్పన రెండుపూటలా వారి జీర్ణశక్తినిబట్టి సేవించాలి. ఇవి సేవించేటప్పడు మద్యమాంసాలు, గుడ్లు, మసాలాలు, అరగని పదార్థాలు, తెల్లబియ్యం, కొత్తబియ్యం, ఫ్రిజుల్లోని పదా ర్థాలు పూర్తిగా నిషేధించి తమ శరీరానికి అనువుగా ఆనంద కరంగా ఉండే ఆహారపదార్థాలను భుజించాలి.
ఈ నియమాలను పాటిస్తుంటే క్రమంగా మానవు లకు సోకిన సమస్తవ్యాధులు, అకాలవార్థక్యం, తెల్లవెంట్రుకలు, విషజ్వరాలు, మనసు స్థిమితంగా లేకపోవడం,అన్నిరకాల నేత్రరోగాలు హరించిపోయి సంపూర్ణమైన ప్రాణశక్తి, యౌవనశక్తి, సౌందర్యప్రాప్తి కలుగుతయ్.
మనసును వ్యాకుల పరిచే డిప్రెషన్:-డిప్రెషన్. ఈ సమస్య ఎలా వచ్చిపడుతుందో కానీ చాలా మందిని చాలా సందర్భాల్లో వేధిస్తుంటుంది. మానసికంగా మొదలై శారీరక సమస్యలకు దారి తీసే ఈ రుగ్మతను ఎవరికి వారే స్వయంగా నియంత్రించుకోవచ్చు. * జీవనశైలిని పూర్తిగా మార్చుకోవాలి. పని మీద ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. ఖాళీ సమయంలో ఇష్టమైన వ్యాపకం పెట్టుకోవాలి. చీకాకు పెదుతున్న అంశం మనసులోకి రానంతగా వ్యాపకాలను కల్పించుకోవడం అన్నమాట. * ఒకసారి చిన్నప్పటి స్నేహితులందరినీ గుర్తు చేసుకుని కలవడానికి ప్రయత్నించాలి. దూరాన ఉన్న వారితో పోన్ చేసి కబుర్లు చెప్పాలి. * కంటినిండా నిద్రపోవాలి. నిద్రపట్టకపోతే నిద్రమాత్రలను ఆశ్రయించవద్దు రాత్రి భోజనంలో నిద్రను పెంచే ఆహారాన్ని (నిద్రపోయే ముందు గోరు వెచ్చని పాలు గం వంటి) సంకోచాలి. * రోజూ క్రమం తప్పకుండా కనీసం అరగంట సేపు నడక, యోగసాధన, జిమ్ వంటివీ ఏదో ఒక వ్యాయామం చేయాలి, వ్యాయామంతో దేహంలో ఫీల్గుడ్ హార్మోన్లు విడుదలవుతాయి. అవి మానసిక రుగ్మతలను దూరం చేస్తాయి. * జంకపడ్ను పూర్తిగా మానేసి తాజాపండ్లు, కూరగాయలను తీసుకోవాలి. సమతుల ఆహారం తీసుకోవడం మీద దృష్టి పెట్టాలి ఆలోచనలను సానుకూల దృక్పథంలో సాగానివ్వాలి