11/18/16

పెసరపప్పుతో చిన్న చిట్కాను పాటిస్తే చాలు ఎలాంటి జ్వరమునైన తగ్గించవచ్చు

నిజానికి జ్వరం అంటే ఏమిటి? జ్వరం ఎందుకు వస్తుంది? ఆరోగ్యంగా ఉండే వ్యక్తి శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెంటిగ్రేడ్‌ (98.6 డిగ్రీల ఫారెన్‌హీట్‌) ఉంటుంది. ఎవరికైనా జ్వరం (ఫీవర్‌) వచ్చిందంటే ఆ వ్యక్తి శరీర ఉష్ణోగ్రత పెరిగిందన్నమాటే. జ్వరం తీవ్రత 107.6 ఫారన్‌హీట్‌ను మించినపుడు బ్రెయిన్‌ డ్యామేజ్‌కు ఆస్కారం ఉంటుంది. అయితే జ్వరాన్ని తగ్గించాలంటే…ముందుగా టెంపరేచర్ ను కంట్రోల్ చేయాలి. అమాంతం పెరిగిపోయిన టెంపరేచర్ ను నార్మల్ లెవల్ కు తీసుకువస్తే…జ్వరాన్ని తగ్గించినట్టే..! అందుకోసం ఓ చిన్న చిట్కాను పాటిస్తే చాలు..!

ఓ కప్పు పెసరపప్పును తీసుకొని, దానిని ఓ సారి కడిగి, ఓ గిన్నె నిండా నీళ్లు పోసి అందులో పెసరపప్పును ఓ 20 నిమిషాలు నానబెట్టాలి. 20 నిమిషాల తర్వాత ఆ పెసరపప్పు కడిగిన నీళ్లను ఓ గ్లాస్ లో పోసి జ్వరంతో బాధపడుతున్న వ్యక్తికి తాగించాలి. జ్వరంతో బాధపడుతున్న వ్యక్తి…ఈ నీటిని తాగిన 10 నిమిషాల్లో అతని బాడీ టెంపరేచర్ క్రమంగా తగ్గుకుంటూ వస్తుంది. ఓ 20 నిమిషాల తర్వాత అతడు సాధారణ స్థితికి చేరుకుంటాడు. అప్పటి వరకు చేదుగా ఉన్న అతని నోరు…ఇప్పుడు కాసింత దారిలోకి వస్తుంది. ఆ సమయంలో తేలికగా జీర్ణమయ్యే పదార్థాలను తినిపించాలి. దీనితో పాటు డాక్టర్ ఇచ్చిన మందులను వాడుతుండాలి.
పెసరపప్పు లో వేడిని తగ్గించే అద్భుతమైన గుణాలున్నాయి, ఓ 20 నిమిషాల నానబెట్టడం వల్ల ఆ గుణాన్ని ఆ నీటికి సంక్రమింపజేస్తుంది పెసరపప్పు. అంతే కాదు పెసలలో విటమిన్ బి, విటమిన్ సి, మాంగనీస్ తోపాటు ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. సూర్యుని నుంచి వచ్చే అతినీలిలోహిత కిరణాలు, పర్యావరణ కాలుష్యం వల్ల వచ్చే చర్మ సమస్యల నుండి కూడా కాపాడే శక్తి పెసళ్లకు ఉంది. పెసళ్లను మన ఆహారంలో భాగం చేసుకోవడం చాలా ఉత్తమం. వేడి ఎక్కువగా ఉండే వాళ్లకు ఈ పెసరపప్పు ఓ వరం. పండగలప్పుడు పెసరపప్పు పానకం చేస్తారు. శరీరంలో వేడిని తగ్గించి వ్యాధి నిరోధక శక్తిని పెంచటంలో ఈ పానకం సమర్దవంతంగా పనిచేస్తుంది

No comments: