11/18/16

సంచలన ప్రకటన చేసిన కేంద్ర హోం శాఖ

కేంద్ర హోం శాఖ సంచలన ప్రకటన చేసింది. దేశంలో ఇప్పుడు కూడా 40 వేల కోట్ల రూపాయల నల్లధనం చెలామణిలో ఉందని కేంద్ర హోంశాఖ తెలిపింది. అయితే నోట్ల రద్దు వల్ల పాక్, బంగ్లాదేశ్ సరిహద్దుల గుండా దేశంలోకి వచ్చే 400 కోట్ల రూపాయల నకిలీ నోట్లకు అడ్డుకట్ట పడిందని వెల్లడించింది. 40 వేల కోట్ల రూపాయల్లో 800 కోట్ల రూపాయలు ఉగ్రవాదులకు అందుతున్నాయి. వేర్పాటువాదులకు, హింసాత్మక చర్యలకు 30 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారని హోంశాఖ గుర్తించింది. నక్సలైట్లు తమ కార్యకలాపాలకు 350 కోట్ల రూపాయలు వినియోగిస్తున్నారని హోంశాఖ వర్గాలు తెలిపాయి. ఖలిస్తాన్‌కు కూడా కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారని హోం శాఖ ప్రగటించింది.

No comments: