11/18/16

ఏ టైం లో అయిన నోట్ల మార్పిడి క్లోజ్

అతి త్వరలో నోట్ల మార్పిడి నిలిపివేసే అవకాశం ఉంది. ఈ నెల 24లేదా అంతకంటే ముందే నోట్ల మార్పిడిని నిలిపివేస్తారని తెలుస్తోంది. అయితే అకౌంట్లు కలిగి ఉన్నవారు మాత్రం తమ అకౌంట్లలో పాత నోట్లను జమ చేసుకోవచ్చు. ఆ తర్వాత చెక్ లేదా ఏటీఎం కార్డు ద్వారా డబ్బు డ్రా చేసుకోవచ్చు. లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఈ నెల 24లోపే దీనిపై కేంద్ర ఆర్ధిక శాఖ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నగదు రహిత లావాదేవీలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో ఇప్పటికే కొన్ని బ్యాంకులు పాత నోట్లను వారివారి ఖాతాల్లోనే వేసుకోవాలని కస్టమర్లకు సూచిస్తున్నాయి. నోట్ల మార్పిడిని దాదాపుగా అడ్డుకుంటున్నాయి.

No comments: