గుండెను గుండ్రంగా చేసే – మృత్యుంజయ ముద్రలు :- పైన తెలిపినట్లు తెలిసోతెలియకో మనం చేస్తున్న పొరపాట్లవల్ల క్షణక్షణం బలహీనపడుతున్న మనగుండెను మృత్యుం జయముద్ర ఏ క్షణానికాక్షణం గుండ్రాయిలాగా గట్టిగా తీర్చిదిద్దగలుగుతుంది. చిత్రంలో చూపినవిధంగా కుటుంబసభ్యులంతా తగిన ఆసనంలో తూర్పుకెనిలిపి రెండుచేతులను వంకరగా లేకుండాచాచి మోకాళ్ళపై పెట్టండి. రెండుచేతులలోని చూపుడువేళ్ళను క్రిందికివంచి అరచేతికి ఆనించి వాటిపైన బొటనవేలునుంచి ఆ బొటనవేలికొనకు మధ్య వేలికొన, ఉంగరంవేలికొన క్రిందికి వంచి ఆనించి చిటికెనవేళ్ళను నిటారుగా నిలిపివుంచాలి. ఈ పద్దతినే మృత్యుం జయముద్ర లేక హృదయముద్ర అంటారు.
దూరంగా కూర్చొని తలను వెన్నుపూసను నిటారుగా ఈ ముద్రను ధరించిన సమయంలో నిండుగా నిదానంగా ఊపిరితిత్తులనిండా గాలిని పీల్చుకొని నోటిద్వారా “యం” అనే అక్షరాన్ని ఉచ్చరిస్తూ గాలిని వదలాలి. ఈ విధంగా మూడుపూటలా పూటకు పదిహేను నిమిషాల చొప్పన సాధనచేయాలి. ఇలా క్రమం తప్పకుండా వరుసగా నలబైరోజులపాటు సాధనచేయడంవల్ల రక్తపోటు, కొలెస్టాల్, మానసిక ఉద్వేగాలు హరించి రక్తప్రసరణ చక్కదిద్దబడి హృదయం సంపూర్ణ ఆరోగ్యవంతమౌతుంది. గ్రమ్లనిక్షగుండెకు హానికలిగించే ధూమపానం, మద్యపానం, మాంసాహార సేవనం, అతిచలువ, అతివేడిచేసే పదార్థాలు, అరగని పదార్థాలు, చల్లబడిన పదార్థాలు భుజించడం, గుండెను బలహీనపరిచే ఆవేదన, ఆందోళన, చింతవంటి మనోవికారాలు వీటిని పూర్తిగా నిషేధించితీరాలని మరువకండి. ముందు పేజీలలో సూచించిన అపానముద్రను కూడా దీంతోపాటు ధరించండి
No comments:
Post a Comment