11/13/16

సరైన స‌మ‌యంలో ఆర్‌బీఐ గుడ్ న్యూస్‌

ఎటు చూసినా అల్ల‌క‌ల్లోలం.. ఆర్ధిక ఎమ‌ర్జెన్సీకి ఇంచుమించు ద‌గ్గ‌ర‌గా వ‌చ్చాం.. చేతిలో డ‌బ్బుల్లేవ్‌.. ఏటీఎమ్ ద‌గ్గ‌ర భారీ క్యూలు.. బ్యాంక్‌లలో చాలినంత డ‌బ్బులేదు. ఇంకేముంది.. ప్ర‌జ‌లు మ‌నీ క‌ష్టాలు ఏంటో తెలిసివ‌చ్చాయి. ఇలాంటి త‌రుణంలో ఆర్‌బీఐ ఓ శుభ‌వార్త‌ను మోసుకొచ్చింది.స‌రిపడినంత నోట్లు లేవ‌ని మార్కెట్‌లో జోరుగా ప్ర‌చారం సాగుతోంది. కొత్త నోట్ల ముద్ర‌ణ‌కు, అవి బ్యాంక్‌లు, ఏటీఎమ్‌ల‌కు చేరుకోవ‌డానికి సహ‌జ స్థితికి చేరుకోవ‌డానికి మ‌రో మూడు వారాలు ప‌డుతుందనే రూమ‌ర్‌లు వినిపిస్తున్నాయి. ఇదంతా అబ‌ద్ధ‌మ‌ని, ఆర్‌బీఐ ద‌గ్గ‌ర స‌రిప‌డినన్ని నోట్లు ఉన్నాయ‌ని తెలిపింది.

ఏటీఎమ్‌లు, బ్యాంక్‌ల‌కు చేరుకున్న వారు ప్ర‌జ‌ల ప‌రిస్థితిని అర్ధం చేసుకొని త‌గినంత మ‌నీని మాత్ర‌మే తీసుకోవాల‌ని సూచించింది. ట్విట్ట‌ర్ ద్వారా ఈ ప్ర‌క‌ట‌న‌ను జారీ చేసింది. 500 నోట్లు ప్ర‌స్తుతానికి మార్కెట్‌లోకి రాక‌పోయినా.. 100 నోట్లకు మాత్రం ఎలాంటి స‌మ‌స్య లేద‌ని, కావాల్సిన స్థాయిలో బ్యాంక్‌ల‌కు పంపామ‌ని తెలిపింది. 

No comments: