11/13/16

ఇలాంటి వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారంట

ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత పగలూ రాత్రీ పని ఒత్తిడిలో మునిగిపోయి అలసిపోతూ ఉంటారు తల్లులు. సెక్స్‌మీద మమకారం ఉన్నా పరిసరాలు, పరిస్థితులు వారిని పర్మిట్‌ చేయవు. ఒకవేళ చేసినా ఏదో అరకొరగా కొద్దిసేపే తప్ప మనఃస్ఫూర్తిగా సెక్స్‌ని ఎంజాయ్‌ చేయడానికి, సంపూర్ణమైన సంతృప్తి పొందడానికి వీలు దొరకదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న భార్యలను సెక్స్‌కు సమాయత్తం చేసేందుకు భర్తలు ఎంతో సహనం, ఓపికతో వ్యవహరించాలి. ఇలాంటివాళ్ళని లాంగ్‌టర్మ్‌ కపుల్స్‌ అంటారు. వీరు గనుక ప్లాన్‌ చేసుకుంటే సెక్స్‌ని అత్యద్భుతంగా ఎంజాయ్‌ చేయగలుగుతారు. ఇలా కోరికలతో వేగిపోయేవారు మంచి ఏకాంతం లభించినప్పుడు సెక్స్‌ను అద్భుతంగా ఎంజాయ్‌ చెయ్యగలుగుతారని ‘థర్టీ డేస్‌ సెక్స్‌ సొల్యూషన్‌’ రచించిన భార్యాభర్తలు Victoria Zdrok Wilson, JD, PhD, జాన్‌ విల్సన్‌లు చెబుతున్నారు. సెక్స్‌ జీవితాన్ని కోల్పోకుండా ఉండాలంటే, ఆదరాబాదరాగా సెక్స్‌ పూర్తిచేయకుండా భార్యాభర్తలు ఒకరి తనువులను మరొకరు సంపూర్ణంగా ఆస్వాదిస్తూ ఏకాంతంగా గడపాలంటే బెడ్రూమ్‌కు లాక్‌ తప్పనిసరిగా ఉండాలని వైవాహిక జీవితంలో పద్నాలుగేళ్ళ అనుభవమున్న ఏడుగురు పిల్లల తండ్రి Sacha Mohammed అంటున్నారు. ‘మా పిల్లల్ని రాత్రిళ్ళు టైమ్‌ ప్రకారం నిద్రపుచ్చుతాం. మా బెడ్రూమ్‌కి తాళం ఉండేట్టు చూసుకుంటాం. ఇల్లు మారిన ప్రతిసారీ బెడ్రూముకు లాక్‌ ఉందోలేదో చూసుకునే మారతాం. మా పిల్లలకి తలుపుతట్టి లోపలికి రావడం నేర్పించాం’ అంటున్నారాయన. పిల్లల బొమ్మలు, పుస్తకాలు, టీవీ వంటి వస్తువులేవీ బెడ్రూమ్‌లోకి ఎలో చెయ్యను. వారికి కేటాయించిన గదిలో చిందరవందరగా పడేసినా నాకెలాంటి ఇబ్బందీ ఉండదు అంటాడాయన నవ్వుతూ. వృద్ధులైన తల్లిదండ్రులు లేదా గ్రాండ్‌ పేరెంట్స్‌ సహాయంలేని ఇళ్ళల్లో భార్యాభర్తలు కొన్ని తప్పనిసరి నిబంధనలు ఏర్పాటు చేసుకోవాల్సిందే అంటున్నారు సెక్స్‌ జీవితంలో తలపండిన అనుభవజ్ఞులు. అందుకే, మీరుకూడా ఎలాంటి ఇబ్బందీ పడకండి. బెడ్రూమ్‌ని స్వర్గంలా తీర్చిదిద్దుకోండి, రాత్రిళ్ళు తనివితీరా సెక్స్‌ని ఎంజాయ్‌ చేసేందుకు చిన్న చిన్న టిప్స్‌ పాటించడం తప్పుకాదు.

No comments: