11/19/16

మజ్జిగ వల్ల మనకి కలిగే ప్రయోజనాలు


  • మజ్జిగ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో కెలోరీల సంఖ్య తక్కువగా ఉండి వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుంది.
  • మజ్జిగను మన కురులకు పట్టించి ఒక 20 నిమిషాల తర్వాత తలా స్నానం చేస్తే కురులు నిగనిగలాడుతాయి.
  • మజ్జిగను చర్మానికి రాసుకొని ఒక అరగంట తర్వాత స్నానం చేస్తే చర్మ వ్యాధులు కూడా తగ్గుతాయి.
  • అలాగే మజ్జిగను చర్మానికి రాసుకోవడం వలన చర్మం కూడా చాలా మృదువుగా మెరిసిపోతుంది.
  • ఈ మధ్య చాలా మంది బ్యూటిషియన్లు కురులకు, చర్మానికి… అందం విషయంలో వారి కష్టమర్లకు మజ్జిగను వాడుతున్నట్టు చాలా మంది తెలియజేశారు.
  • శీతాకాలంలో, వర్షాకాలం లో పెరుగు కానీ మజ్జిగ కానీ మనం ఆహారంలో తీసుకుంటే జలుబు చేస్తోంది అనుకుంటారు కాని మజ్జిగ వలన జలుబు తొందరగా తగ్గుతుంది.
  • మజ్జిగలో ఉండే పోషకాలు జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తాయి.
  • ప్రతిరోజూ మజ్జిగని మొహానికి రాసుకోవడం వల్ల మొహంపై ఉండే నల్లటి మచ్చలు వారం రోజుల్లో తొలగిపోతాయి.

No comments: