11/19/16

నోట్ల రద్దుపై మీడియా చేస్తున్న రాద్ధాంతం

నోట్ల రద్దుపై మీడియా చేస్తున్న రాద్ధాంతం చూస్తుంటే  యెంతో బాధ కలుగుతుంది.


నోట్ల మార్పిడి కష్టాలు లేవని కాదు,
యెవరికైనా కష్టం వస్తే స్వాంతన పలుకవలసిన మీడియా నోట్ల మార్పిడి యెలా చేసుకోవాలో చెప్పాల్సిన భాద్యత ఉన్న మీడియా, రెండున్నర లక్షల వరకూ యెవరైనా బాంక్ లో జమ చేసుకోవచ్చు అలాగే పొలం అమ్మిన డబ్బులు బాంక్ లో వేసుకోవచ్చు. మహా అయితే కొంత టాక్స్ కట్టాలి అంతే అనే విషయం చెప్పకుండా పదే పదే కష్టాలు మాత్రమే చూపినందుకు ఆ మీడియా చూపించిన కష్టాలు నిజమేమో అని నమ్మి 52 లక్షలు ఉన్నా ఒక మహిళ ఆత్మ హత్య చేసుకొంది.

73 సంవత్సరాల  వ్రుద్ధుడు క్యూలో నిలబడలేక చనిపోయాడని చెప్పే మీడియా అక్కడ క్యూ లో ఉన్న వారు ఆ వ్రుద్దున్ని ముందుగా పంపే సంస్కారం మన ప్రజలకు లేకపోయింది అనే విషయం చెప్పి ఉంటే బాగుండేది.

జపాన్ లో సునామీ వస్తే వచ్చిన రోజు నుండీ ప్రతి వ్యాపారస్తులు డిస్కౌంట్లు ఇచ్చి ప్రజలకు సేవ చేసిన విషయం ప్రసారం చేసి ఉంటే కనీసం కొంత మంది అయినా ప్రభావితం అయ్యే వారు.

సునామీ నుండీ జపాన్ అన్నీ సర్దుకోవడానికి 10 రోజులు పట్టినా యెవరి వస్తువులు వారికే ఇచ్చారు అక్కడి ప్రజలు. అందుకే చిన్న దేశం అయినా ప్రపంచంలో అంతా గౌరవంగా బ్రతుకుతోంది అనే విషయం ప్రసారం చేసి ఉంటే బాగుండేది.

అమెరికాలో జంట టవర్లు కూలిపోయాయి.
ప్రతిపక్ష పార్టీ లు గాని ప్రజలు కాని ప్రభుత్వంపై విమర్శలు చేయలేదు.
మీడియా తప్పుడు వార్తలు రాయలేదు.
ప్రజలకు ధైర్యము కలిగించే వార్తలు మాత్రమే రాశారు. అందుకే అమెరికా ప్రపంచ పెద్దన్న అయింది.

మన దేశము లో మీడియా చేస్తున్న మేలు కన్నా కీడు యెక్కువగా ఉంది.

యెక్కువగా మీడియా ప్రసారాలు చూస్తే అసలు దేశములో జీవించే అవకాశం లేదేమో అనే అనుమానం మనకే కలుగుతుంది.

ఈ మీడియాకు  సరి అయిన దిశానిర్దేశం యెప్పుడు యే కోర్టు ఇస్తుందో అని భగవంతుని ప్రార్థిస్తున్నాను.

ఒక్క సారి మన వీర సైనికులు పడుతున్న కష్టాలు గుర్తు తెచ్చుకుంటే మూడు నాలుగు గంటల క్యూలో కరెన్సీ  మార్చుకునే కష్టం యెంత.

నల్ల ధనం తో టెర్రరిస్ట్లు పేట్రేగిపోతుంటే 70 సంవత్సరాలు ఈఁ దేశాన్ని అస్థిరపరిచే  నల్ల కుబేరుల భరతం పట్టే దమ్మున్న నాయకుడు మన ప్రధాన మంత్రి అని గర్వపడే ప్రతి పౌరులకు నమస్సులు.

మీడియా యెంతగా   ప్రయత్నించినా క కా పార్టీ లు యెన్ని తప్పుడు కూతలు కూసినా కొన్ని రోజులు చిన్న చిన్న కష్టాలు ఉన్నా ఇప్పటికైనా ఒక గొప్ప నాయకుడు మన దేశాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాడు మేమూ సహకరిస్థాము   అని మీడియా మైకుకు చెప్పిన హీరోల్లారా జోహార్ జోహార్.

అసలు ఇంట్లో 100, 50, 10 నోట్లే లేనట్లు ప్రతి పేదవాడు కేవలము 500 లేదా 1000 నోట్లు మాత్రమే ఉన్నట్లుగా చూపిన ఓ మీడియా ఒక్క సారి ఆత్మ విమర్శ చేసుకో.

సారీ మీకు రేటింగ్స్  పెంచుకోవడం తప్ప మరేమీ అవసరం లేదనుకోండి.
దేశం యేమైనా మా చానల్ రేటింగ్ మాకు చాలు అనే కుటిల మీడియా కారణముగా మీడియా పై నమ్మకం పోగొట్టే అవకాశం ఉంది.

యెప్పుడూ నిరాశా నిస్పృహ వార్తలే కాకుండా మంచి వార్తలు ప్రసారం చేసి పుణ్యం తెచ్చుకోండి.

ప్రజలారా క్రుత్తిమ స్వార్థ వార్తా కథనాలు  చూడకుండా 30 నిమిషాల లో 100 వార్తలు మాత్రమే చూడండి, లేకపొతే మీరు కూడా యేమౌతారో అని నా భయం.

No comments: