11/19/16

విక్టరీ కి కింగ్ కి వార్

నాగార్జున‌, విక్ట‌రీ వెంక‌టేష్ ఇద్ద‌రూ ఇద్ద‌రే. ఫ్యామిలీ ఇమేజ్‌తో వీరు గ‌త మూడున్న‌ర ద‌శాబ్దాలుగా టాలీవుడ్ ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేశారు. ఇక వీరిద్ద‌రు సీనియారిటీ దృష్ట్యా త‌మ వ‌య‌స్సుకు త‌గ్గ పాత్ర‌లు ఎంపిక చేసుకుంటూ ఆన్ స్క్రీన్‌పై దూసుకుపోతున్నారు.


వెంకీ ఇప్ప‌టికే ప‌వ‌న్‌, మ‌హేష్ లాంటి స్టార్ హీరోల‌తో మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేసి హిట్లు కొట్టాడు. ఇక నాగ్ ఊపిరి, మ‌నం, సోగ్గాడు లాంటి వైవిధ్య‌మైన క‌థుల ఎంపిక చేసుకుంటూ తిరుగులేని హిట్లు సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ ఇద్ద‌రు బావ‌బావ‌మ‌రుదుల మ‌ధ్య ఇప్పుడు టాలీవుడ్‌లో ఆస‌క్తిక‌ర‌మైన వార్‌కు తెర‌లేవ‌నుంది.

ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రు హీరోలు త‌మ ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారు. వెంకీ గురులో న‌టిస్తుంటే, నాగ్ కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో ఓం న‌మోః వెంక‌టేశాయా సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ముందుగా సంక్రాంతి రేసులో ఉంటాయ‌ని వార్త‌లు వ‌చ్చాయి.

సంక్రాంతికి మ‌రో ఇద్ద‌రు అగ్ర హీరోలు బాల‌య్య గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి, చిరు ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దీంతో వీరిద్ద‌రు త‌మ సినిమాల‌ను ఫిబ్ర‌వ‌రి ఫ‌స్ట్ వీక్‌కు వాయిదా వేసుకున్నారు. దీంతో ఈ బావ‌బావ‌మ‌రుదుల మ‌ధ్య ఇప్పుడు టాలీవుడ్‌లో ఆస‌క్తిక‌ర‌మైన ఫైటింగ్‌కు తెర‌లేవ‌నుంద‌న్న టాక్ ఇండ‌స్ట్రీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ బావ‌బావ‌మ‌రుదుల పోరులో ఎవ‌రు విజ‌యం సాధిస్తారో చూడాలి.

No comments: