అమృత భాండం
కొబ్బరి నీళ్లలో ప్రొటీన్లు 0.1 కార్బోహైడ్రేట్లు 4 కొవ్వ పదార్థాలు 0.1 కాల్షియం 00% ఖని జాలు 0.4 శాతం వంతున ఉంటాయి. మొత్తంగా 100 మిల్లీలీటర్ల కొబ్బరి నీళ్ల ద్వారా 174 క్యాలరీల శక్తి లభిస్తుంది. అధిక శాతంలో ఉండే పొటాషియం లోబీపీని నివారిస్తుంది. జీర్ణ క్రియకు బాగా మేలు చేస్తుంది. పచ్చి ఎండు కొబ్బరిలోనూ క్యాలరీలు బాగానే లభిస్తాయి.
మనోసౌందర్యానికి- మహాసులువైనయోగం
పెద్దసోంపుగింజలు 100గ్రాతెచ్చి దోరగా వేయించి, దంచి జల్లించి దానితో సమానంగా పటికబెల్లం పొడి కలిపి నిలువచేసుకోవాలి. రోజూ రెండుపూటలా పిల్లలకు ఆరచెoచా పెద్దలకు ఒకచెంచామోతాదుగా చప్పరించి తిని ఒకకప్పపాలు తాగుతుంటే మానసికచికాకు, చిరాకు,
ఆందోళన, భయం, దు:ఖం,మతిమరుపు హరించిపోయి హరించిపోయి మనసు ప్రసన్నంగా ఉంటుంది.
కాయకల్పానికి – తిప్పతీగలడువస్తఫూళితం పట్టిన తిప్పతీగచూర్ణం 100గ్రా, పాత బెల్లం 16 గ్రా, తేనె 16 గ్రా, నెయ్యి 16గ్రా, కలిపి మొత్తగాదంచి 10గ్రా, మోతాదుగా లడ్డుకట్టి నిలవజేసుకోవాలి.
ఈ తిప్పతీగలడ్లను పూటకు ఒకటి లేక రెండు చొప్పన రెండుపూటలా వారి జీర్ణశక్తినిబట్టి సేవించాలి. ఇవి సేవించేటప్పడు మద్యమాంసాలు, గుడ్లు, మసాలాలు, అరగని పదార్థాలు, తెల్లబియ్యం, కొత్తబియ్యం, ఫ్రిజుల్లోని పదా ర్థాలు పూర్తిగా నిషేధించి తమ శరీరానికి అనువుగా ఆనంద కరంగా ఉండే ఆహారపదార్థాలను భుజించాలి.
ఈ నియమాలను పాటిస్తుంటే క్రమంగా మానవు లకు సోకిన సమస్తవ్యాధులు, అకాలవార్థక్యం, తెల్లవెంట్రుకలు, విషజ్వరాలు, మనసు స్థిమితంగా లేకపోవడం,అన్నిరకాల నేత్రరోగాలు హరించిపోయి సంపూర్ణమైన ప్రాణశక్తి, యౌవనశక్తి, సౌందర్యప్రాప్తి కలుగుతయ్.
మనసును వ్యాకుల పరిచే డిప్రెషన్:-డిప్రెషన్. ఈ సమస్య ఎలా వచ్చిపడుతుందో కానీ చాలా మందిని చాలా సందర్భాల్లో వేధిస్తుంటుంది. మానసికంగా మొదలై శారీరక సమస్యలకు దారి తీసే ఈ రుగ్మతను ఎవరికి వారే స్వయంగా నియంత్రించుకోవచ్చు. * జీవనశైలిని పూర్తిగా మార్చుకోవాలి. పని మీద ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. ఖాళీ సమయంలో ఇష్టమైన వ్యాపకం పెట్టుకోవాలి. చీకాకు పెదుతున్న అంశం మనసులోకి రానంతగా వ్యాపకాలను కల్పించుకోవడం అన్నమాట. * ఒకసారి చిన్నప్పటి స్నేహితులందరినీ గుర్తు చేసుకుని కలవడానికి ప్రయత్నించాలి. దూరాన ఉన్న వారితో పోన్ చేసి కబుర్లు చెప్పాలి. * కంటినిండా నిద్రపోవాలి. నిద్రపట్టకపోతే నిద్రమాత్రలను ఆశ్రయించవద్దు రాత్రి భోజనంలో నిద్రను పెంచే ఆహారాన్ని (నిద్రపోయే ముందు గోరు వెచ్చని పాలు గం వంటి) సంకోచాలి. * రోజూ క్రమం తప్పకుండా కనీసం అరగంట సేపు నడక, యోగసాధన, జిమ్ వంటివీ ఏదో ఒక వ్యాయామం చేయాలి, వ్యాయామంతో దేహంలో ఫీల్గుడ్ హార్మోన్లు విడుదలవుతాయి. అవి మానసిక రుగ్మతలను దూరం చేస్తాయి. * జంకపడ్ను పూర్తిగా మానేసి తాజాపండ్లు, కూరగాయలను తీసుకోవాలి. సమతుల ఆహారం తీసుకోవడం మీద దృష్టి పెట్టాలి ఆలోచనలను సానుకూల దృక్పథంలో సాగానివ్వాలి
No comments:
Post a Comment