ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నల్లబాబుల నడ్డి విరుస్తుందో లేదో తెలియదు కానీ.. సామాన్యప్రజానికి మాత్రం చలికాలంలో చెమటలు పట్టిస్తోంది. నోట్ల కష్టాల రుచిని చూపిస్తోంది. సామాన్యుల కష్టాలు ఈ విధంగా ఉంటే... శరీరాన్నే నమ్ముకుని, ఎటువంటి లైసెన్స్ లేకుండా వ్యభిచారం చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్న మహిళల ఇంట్లో విషాదాన్ని మిగుల్చుతోందట. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని సోనగాచీ జిల్లాలో అనేక ప్రాంతాలు వ్యభిచారానికి మారుపేరు. ఈ ప్రాంతాలలో అనేక మంది మహిళలు వ్యభిచారం చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తుంటారు. కానీ పెద్దనోట్ల రద్దు వారి పొట్టకొట్టింది. వ్యభిచారానికి మహిళల దగ్గరకు వచ్చే పురుషులు రూ.500, రూ.1000 నోట్లను తీసుకొస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొంది. పాత నోట్లను తీసుకోవడానికి అంగీకరించని మహిళలు నాలుగు రోజులుగా వ్యభిచారానికి దూరంగా ఉంటున్నారు. దీంతో ఉపాథి లేక నానాఇబ్బందులకు గురవుతున్నారు. కొత్త నోట్లు లేదా వందల నోట్లు తీసుకురావాలని విటులను డిమాండ్ చేస్తున్నారట. కస్టమర్లను దూరం చేసుకోవడం ఇష్టం లేని కొందరు మహిళలు లెక్కల పుస్తకాలను పెట్టుకున్నారట. తమ దగ్గరకు వచ్చే పురుషుల సమాచారాన్ని, ఇవ్వవలసిన డబ్బుల వివరాలను రాసుకుంటున్నారట. డబ్బుల తర్వాత తిరిగి చెల్లించాలని చెబుతున్నారట
తన దగ్గరకు పాత రూ.500, రూ.1000 నోట్లతో వచ్చే రెగ్యులర్ కస్టమర్ల పేర్లను నమోదు చేయడానికి ఓ నోట్ పుస్తకాన్ని పెట్టానని, వారి పెర్లు వివరాలను రాసుకుని తర్వాత ఇవ్వాలని వారితో చెబుతున్నానని ఓ మహిళ మీడియాలో అన్నారు. సోనగాచీ జిల్లాలో మాత్రమే ఈ పరిస్థితి ఉందనుకుంటే పొరపాటే.. వ్యభిచారమే ప్రధాన వృత్తిగా జీవనం కొనసాగిస్తున్న వారి పరిస్థితి దాదాపు ఇంతేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

No comments:
Post a Comment