12/13/16

జామ ఆకులు జుట్టు రాలడాన్ని నివారించె ఔషధం

జామ కాయలు ఆరోగ్యానికి మంచి ఔషధం. జామ పండులో ఆరోగ్యానికి మంచి చేసే ఎన్నో గుణాలు ఉన్నాయి. అలాంటి గుణాలు జామ ఆకుల్లో కూడా ఉన్నాయని చాలా మందికి తెలియని విషయం. జామ ఆకులు జుట్టు రాలడాన్ని నివారించి జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. జామ ఆకుల్లో ఉండే అధిక పోషకాలు దీనికి కారణం. జామ ఆకులలో విటమిన్ – బి ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టుపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. అలాగే జామ ఆకులో ఉండే విటమిన్ బి5, బి3, బి6 చర్మం కాంతివంతంగా మారేందుకు సహాయపడుతాయి. విటమిన్ బి2 చర్మంలో మృత కణాలను నివారించటమే గాక చురుకైన కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది.


ఔషధం తయారు చేయు విధానం..
అవసరానికి సరిపడ జామ ఆకులను శుభ్రంగా కడిగి 15-20 నిమిషాల పాటు నీటిలో వేడి చేయాలి. వేడి నీరు చల్లారే వరకు ఉంచి, ఆ మరిగించిన నీటిని తలపై నెమ్మదిగా పోస్తూ మునివేళ్లతో వెంట్రుకల కుదుళ్ళలో పట్టేలా మసాజ్ చేస్తున్నట్టు చేయాలి. తలకు ఆ మరిగించిన నీరు పట్టించిన తరవాత ఒక గంటపాటు అలానే ఉండి తరువాత తలస్నానం చేయాలి. ఇలా కంటిన్యూగా ఒక నెల రోజులు చేస్తే వెంట్రుకల కుదుళ్ళు గట్టిపడి, వెంట్రుకలు ఊడిపోకుండా ఉంటాయి.

No comments: