ముండ్లు, పుండ్లు – హరించే మలామ్;-ఆవనూనె 50గ్రా తీసుకొని పాత్రలో పోసి పొయ్యిమీద పెట్టి అందులో తేనెమైనం 20గ్రాII వేసి చిన్నమంటపైన కరిగించాలి. తరువాత దించి వడ పోసి మళ్ళీపాత్రలోపోసి అందులో తెల్లగుగ్గిలం పొడి 10గ్రాl, రూమిమస్తకి(ఇది ఆయుర్వేద మూలికల అంగడిలో దొరుకుతుంది) చూర్ణం15గ్రా కలపాలి. ఇది ఆరేటప్పటికి మలాంలాగా తయారౌతుంది.ఈ మలామ్ను పైన పట్టిస్తూవుంటే ఎంత మొండి పండు అయినా మాడిపోతయ్. అలాగే శరీరంలో ఎక్కడైనా గుచ్చుకున్నముండ్ల లోపలే విరిగిపోయి రాకుండా వుంటే దానిపైనఈమలంను పట్టిస్తే అవి బయటకు వస్తయ్అన్నిరకాల -చర్మవ్యాధులకు
చిత్రమూలం వేరు, చండ్రచెట్టుబెరడు, కొడిశ పాలచెట్టబెరడు, రేలచెట్టు బెరడు, వేగిసచెట్టు బెరడు, సమంగా సేకరించుకోవాలి. ఒకలీటరు నీటిలో పైనచెప్పిన చెట్లబెరడు ఒక్కొక్కటి పది గ్రాముల చొప్పనవేసి పొయ్యిమీద పెట్టి నాలుగవ వంతు కషాయం మిగిలేవరకు మరగబెట్టాలి. దించి వడపోసి ఆకషాయంలో సరిపోయినన్నికర క్కాయలువేసి ఉడకబెట్టాలి. కషాయం ఇగిరిన తరువాత కరక్కాయలుతీసి తేనెలోవేసి నిలువచేయాలి. రోజూ పూటకు ఒకటి లేకరెండు కరక్కాయల చొప్పన తింటూ లోపలిగింజలను బయటకువూసివేస్తుంటే క్రమంగా అన్నిరకాల చర్మరోగాలు అదృశ్యమైపోతయ్.
ಅನ್ನಿరకాల – సర్పిరోగాలకు;-గోరింటాకు, ధనియాలు, ఎర్రచందనం, వీటిని సమానభాగాలుగా తీసుకొని విడివిడిగా దంచి జల్లెడపట్టి ఆతరువాత ఒకదానిలో ఒకటి వరుసగా కలిపి ఒకగాజుపాత్రలో నిలువవుంచుకోవాలి.రోజూ పూటకు3గ్రాII మోతాదుగా నీటితో రెండుపూటలా ఆహారానికి అరగంటముందు సేవిసూ, ఉప్పువేయని గోధుమరొట్టెను నేతితో తింటూవుంటే క్రమంగా అన్నిరకాల సర్పివ్యాధులు తప్పకుండా హరించిపోతయ్.
పుoడ్లుపడి – చర్మంమందమైతే;-కొంతమందికి వివిధ కారణాలవల్ల చర్మంపైన పుండ్లువచ్చి అవి తగ్గినతరువాత పై చర్మం లావుగా మందంగా తయారౌతుంది. అలాంటివారు ప్రతి రోజూ నిదురించేముందు తగినంత గోరింటాకు తీసుకొని మెత్తగానూరి ఆముద్దను పైనవేసి కట్టు కడుతూవుంటే క్రమంగా మందంగావున్న చర్మం తిరిగి మామూలుపరిస్థితికి వస్తుంది.
No comments:
Post a Comment