11/15/16

పవన్ ,రజని మీ సినిమాలు బ్లాక్ మనీ కాదా అని విమర్శించినా దర్సకుడు

చెన్నై: ఐదువందలు, వెయ్యి రూపాయల నోట్ల రద్దు విషయమై సినీ పరిశ్రమలో మొదటి రోజు చాలా మంది ప్రధాని మోదీ ని ప్రశంసల్లో ముంచెత్తారు. అయితే బయిట బ్యాంకులు వద్ద, ఎటిఎంల వద్ద సామాన్య జనం పడే వెతలు చూసి ఇప్పుడు విమర్శలు సైతం సినిమా పరిశ్రమ నుంచి వస్తున్నాయి. తాజాగా తమిళ దర్శకుడు, నిర్మాత అమీర్ సుల్తాన్..మీడియాతో మాట్లాడుతూ రజనీ, మోదీలపై విమర్శలు చేసారు.



ప్రధాని మోదీ కరెన్సీ బ్యాన్ చేయగానే సూపట్ స్టార్ రజనీకాంత్ స్పందిస్తూ కొత్త భారతమ్ జన్మించింది అంటూ మోదీని ప్రశంసించారు. కానీ మోదీ పని మీరు ఎలా సమర్థిస్తారు అంటూ డైరెక్టర్ అమీర్ సుల్తాన్ సూపర్ స్టార్ ను నిలదీయటం ఇప్పుడు అంతటా చర్చనీయాంసంగా మారింది.

అమీర్ మీడియాతో మాట్లాడుతూ.. రజనీని 'మోదీ చేసిన పనిని ఎలా సమర్థిస్తారు. అయినా ఆయన రజనీకాంత్, పవన్ కళ్యాణ్ ల క్రేజ్ వల్లనే ప్రధాని అయ్యారు. బ్లాక్ మనీకి వ్యతిరేకంగా ఆయన చేసిన పనికి మీరు సంతోషిస్తున్నారు. కానీ మీ సినిమా 'కబాలి' టికెట్లు ఎన్ని రెట్లు అధిక ధరకు అమ్మారో మీకు తెలీదా అని ప్రశ్నించారు.



నిబంధనలకు వ్యతిరేకంగా ఎక్కువ రేటుకు టికెట్లు అమ్మడం ద్వారా వచ్చిన డబ్బు బ్లాక్ మనీ కాదా. ఆ లెక్కలన్నింటినీ పేపర్ మీద మీరు చూపగలరా' అంటూ తీవ్ర స్థాయిలో మాట్లాడారు. ఈ వివాదం రజనీ,మోదీ అభిమానుల్లోనూ చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ విషయమై వాదోపవాదాలు మొదలయ్యాయి. దాంతో ఈ వివాదం ఎంత వరకు వెళుతుందో అనే అనుమానాలు తమిళ పరిశ్రమలో వ్యక్తమవుతున్నాయి.

No comments: