11/9/16

కొత్త నోటు విషయంలో అవన్నీ అబద్ధాలే!

Image result for new notes

దేశంలో ప్రస్తుతం చలామణీ అవుతున్న 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ వార్త వెలువడినప్పటి నుంచి కొత్త నోట్లకు సంబంధించి ఓ రూమర్ నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. నల్లధన నియంత్రణకు కొత్త నోట్లలో చిన్న చిప్‌ను ప్రవేశపెడుతున్నట్లు కొన్ని వార్తలొచ్చాయి. ఈ చిప్ వల్ల ఫేక్ కరెన్సీ చలామణీని అరికట్టొచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే కొత్తగా వస్తున్న 2వేల రూపాయల నోటులో ఎలాంటి చిప్‌ లేదని ఆర్‌బీఐ ప్రకటించింది. ఇంకా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది. అవన్నీ పుకార్లేనని స్పష్టం చేసింది. కొత్తగా అందుబాటులోకి వచ్చే 2వేల రూపాయల నోటుకు సంబంధించి పలు వివరాలను వెల్లడించింది. ఆర్బీఐ విడుదల చేసిన కొత్త నోటుకు సంబంధించిన వివరాల్లో ఎక్కడా కూడా చిప్ గురించి ప్రస్తావించలేదు. ఈ చిప్‌పై వచ్చినవన్నీ రూమర్లేనని తేలిపోయింది.

No comments: