అలహాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 250 స్వీపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరింది. ఈ పోస్టుకు 1.10 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. స్వీపరు పోస్టుకు హిందీ రాయడం, చదవడం వచ్చిన అభ్యర్థులు అర్హులని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. కాని నిరుద్యోగం వల్ల ఎంబీఏ, బీటెక్ లతో పాటు ఉన్నత విద్య అభ్యసించిన అభ్యర్థులు సైతం స్వీపరు పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నారని అలహాబాద్ మున్సిపల్ అదనపు కమిషనర్ శ్రీవాస్తవ వెల్లడించారు. అభ్యర్థులకు డ్రెయినేజీలు శుభ్రం చేయడం, రోడ్లు ఊడవడంలో ప్రాక్టికల్ పరీక్ష నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. ఇదీ మన దేశంలో నిరుద్యోగ భారతానికి నిదర్శనంగా నిలిచిన ఈ ఉదంతం అందరినీ ఆలోచింపజేస్తుంది.
No comments:
Post a Comment