ప్రముఖ నటుడు ముఖేశ్ రావల్ మృతదేహం రైల్వే ట్రాక్‌పై అనుమానాస్పద స్థితిలో కనిపించింది. ముంబై బోరివలి రైల్వే ట్రాక్‌పై ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. బుల్లితెరపై సంచలనం రేపిన రామానంద్ సాగర్ రామాయణంలో ముఖేశ్ రావల్ విభీషనుడి పాత్ర పోషించారు. అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపారు. ఘాట్‌కోపర్ ప్రాంతం నుంచి డబ్బు డ్రా చేసుకుని ఇంటికి బయలుదేరారని, ఇంతలోనే ఈ దారుణం జరిగిపోయిందని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. ముఖేశ్ రావల్ గుజరాత్ సినిమా ఇండస్ట్రీలో చాలా పాపులర్ యాక్టర్. లహూ కే దో రంగ్, ఔజార్, మృత్యుదాతా, సత్తా వంటి హిందీ సినిమాల్లో కూడా నటించి పేరు తెచ్చుకున్నారు.
No comments:
Post a Comment