యువ కథానాయకుడు వరుణ్‌తేజ్ మళ్లీ రంగంలోకి దిగాడు. యాభై రోజుల సుదీర్ఘ విరామం తర్వాత ‘మిస్టర్’ చిత్రీకరణ కోసం సోమవారమే సెట్‌లోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘మిస్టర్’, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘ఫిదా’ చేస్తున్నారు వరుణ్. ‘మిస్టర్’ కోసం ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా వరుణ్‌తేజ్ గాయపడ్డారు. కాలికి గాయం కావడంతో యాభై రోజులుగా బెడ్‌కే పరిమితమయ్యారు. వరుణ్ గాయం నుంచి కోలుకోవడంతో సోమవారం నుంచి హైదరాబాద్‌లో ‘మిస్టర్’ చిత్రీకరణ షురూ అయ్యింది. మళ్లీ సెట్‌లోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉందని వరుణ్‌తేజ్ ట్వీట్ చేశారు.
No comments:
Post a Comment