నువ్వే చూసుకోవాలి అంటూ ప్రార్థించేవాళ్లపై నాకు ఎలాంటి గౌరవం లేదంటోంది శ్రుతిహాసన్. ‘కష్టేఫలి’ సూత్రాన్ని నమ్ముతానంటున్న శ్రుతి ప్రస్తుతం ‘కాటమరాయుడు’ కోసం పవన్ కల్యాణ్‌తో జోడీ కట్టింది. శ్రుతి మాట్లాడుతూ ‘‘ఒక గూటి పక్షులంతా ఒకే చోట చేరతారట. అలా నా చుట్టూ కష్టాన్ని గౌరవించేవాళ్లే ఉంటారు. మా కంటికి చిన్నపనీ... పెద్ద పనీ అంటూ తేడాలుండవు. ప్రతిదీ విలువైనదే. కష్టపడని వాళ్లకు అసలు మాట్లాడే అర్హత లేదు. ఖాళీగా ఉండడం నాకంటికి పెద్ద నేరంలా కనిపిస్తుంది. అందుకే షూటింగ్ లేనప్పుడల్లా నాపై నాకే విసుగొస్తుంది. అలాంటి సమయాల్లో పాటలు పాడుకొంటూ, రాసుకొంటూ, కొత్త ట్యూన్లు కట్టుకొంటూ కాలక్షేపం చేస్తుంటా. అయితే అవన్నీ అందరికీ వినిపించే ఘడియ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నా’’ అంటోంది. అంటే శ్రుతి తొందర్లోనే సంగీత దర్శకురాలిగానూ తన టాలెంట్ చూపించడానికి సమాయాత్తమవుతోందన్నమాట.
No comments:
Post a Comment