బాహుబలి’ సినిమా కంటే ముందే జక్కన్న రాజమౌళి దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఆయన రూపొందించిన ‘మగధీర’, ‘ఈగ’ సినిమాలు ఆయనను నేషనల్ వైడ్‌గా పాపులర్ చేశాయి. ఇక, ‘బాహుబలి’ ఆయన ఇమేజ్‌ను అమాంతంగా పైకి లేపింది. అంత ఇమేజ్‌ను సొంతం చేసుకున్న రాజమౌళి ‘బాహుబలి-2’ తర్వాత చేయబోయే సినిమా ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఆయన ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇకపై తెలుగు హీరోలతో సోలోగా సినిమాలు చేయడానికి రాజమౌళి సిద్ధపడరని తెలుస్తోంది. జాతీయ స్థాయిలో మార్కెట్ ఏర్పరుచుకున్నాక తెలుగు హీరోలతో ప్రాంతీయ సినిమాలు చేయాలని ఏ దర్శకుడూ అనుకోడు. అందుకే అమీర్‌ఖాన్‌తో సినిమా చేయాలని రాజమౌళి భావిస్తున్నారట. అమీర్ వెంటనే రెడీ అనేస్తే రాజమౌళి తర్వాతి సినిమా ఆయనతోనేనట. కానీ, అమీర్ కొన్ని రోజులు ఆగమంటే మాత్రం ‘ఈగ-2’ను ప్రారంభించాలనే ఆలోచన ఉందట.
‘ఈగ-2’ను కూడా జాతీయ స్థాయిలో చాలా భారీగానే తీస్తారట. ఇకపోతే, మహేష్‌తో ఓ సినిమా చేయాలని రాజమౌళి ఎప్పుడో ఒప్పందం కుదుర్చుకున్నారు. అందుకే మహేష్‌తో మాత్రమే ఓ సినిమా ఏ సమయంలోనైనా చేస్తారట.

No comments:
Post a Comment