11/30/16

మోక్షజ్ఞ సినీ రంగప్రవేశానికి ఏర్పాట్లు


బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీ రంగప్రవేశానికి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. వచ్చే ఏడాది చివర్లో గాని, 2018 ప్రారంభంలోగాని ఆ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లే సూచనలు ఉన్నాయట. తెలుగు సినీ పరిశ్రమ టాప్‌ డైరెక్టర్లు రాజమౌళి లేదా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సినిమాలతో అరేంగట్రం చేయించాలని బాలయ్య అనుకున్నాడు.


మోక్షజ్ఞ మొదటి సినిమాను వేరొకరితో చేయించమని, తర్వాతి సినిమా తప్పకుండా చేస్తామని ఇద్దరూ బాలయ్యకు మాటిచ్చారట. ఈ నేపథ్యంలో తనకు సన్నిహితుడైన వీర మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను సినిమాతో మోక్షజ్ఞను అరంగేట్రం చేయిద్దామని బాలయ్య అనుకున్నాడట. అయితే తాజాగా బాలయ్య మనసు మార్చుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం తను నటిస్తున్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా డైరెక్టర్‌ క్రిష్‌ చేతిలో మోక్షజ్ఞను పెట్టాలని డిసైడ్‌ అయ్యాడట. క్రిష్‌ పనితనం, నటుల నుంచి యాక్టింగ్‌ రాబట్టుకునే విధానం బాలయ్యకు బాగా నచ్చాయట. అందుకే మోక్షజ్ఞ హీరోగా సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఆ సినిమాను క్రిష్‌కు అప్పగిస్తున్నాడట బాలయ్య.

No comments: