న్యూఢిల్లీ: నల్లధనాన్ని నియంత్రించడానికి 500, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసిన నేపధ్యంలో కొత్త నోట్ల కట్టలతో న్యూఢిల్లీలోని రిజర్వ్ బ్యాంక్‌ఆఫ్ ఇండియా నుంచి ప్రత్యేక వాహనాలు బయలుదేరాయి. పలు నగరాలకు ఈ వాహనాలు హై సెక్యూరిటీ నడుమ బయలుదేరాయి. ఈ వాహనాల ద్వారానే నగరాల్లోని ఆయా బ్యాంకులకు, పోస్ట్ ఆఫీస్‌లకు నగదు పంపిస్తున్నారు. ఇప్పటికే అనేక బ్యాంకులకు నగదు చేరుకుంది. కొత్త నోట్ల కట్టలు, అకౌంట్లు చూసుకునేందుకు నేడు దేశవ్యాప్తంగా బ్యాంకులకు కేంద్రం సెలవు ప్రకటించింది. బ్యాంకులు రేపు పనిచేస్తాయి. ప్రజలు తమ వద్ద ఉన్న పాత నోట్లకు బదులుగా కొత్త నోట్లు తీసుకోవచ్చు.
No comments:
Post a Comment