11/10/16

నల్ల దొంగలకు మరో షాకిచ్చిన మోదీ... ఇక దారులన్నీ క్లోజ్ !



న్యూఢిల్లీ: నోట్ల రద్దుతో సంచలన నిర్ణయం తీసుకున్న మోదీ సర్కార్ పసిడిని కొనాలనుకునే వారికి ముఖ్య గమనికను పంపింది. ఇకపై మన దేశంలో బంగారం కొనాలంటే పాన్‌కార్డ్ తప్పనిసరిగా ఉండాలని కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసింది. నల్లధనాన్ని గోల్డ్ రూపంలో మార్చుకోవాలని యోచిస్తున్న నల్ల దొంగలను ఈ వార్త మరింత ఆందోళనకు గురిచేస్తోంది. స్వచ్ఛందంగా నల్లధనాన్ని ప్రభుత్వానికి అప్పగించక తప్పేలా లేదు. పాన్ నంబర్లు ఇవ్వని నల్ల దొంగల పనిపట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం చెబుతోంది. అంతేకాదు, నవంబర్ 10 నుంచి డిసెంబర్ 30వరకూ జరిగే అన్ని క్యాష్ డిపాజిట్స్‌పై కేంద్రం నిఘా పెట్టనుంది. 2.5 లక్షలకు మించి ట్రాన్సాక్షన్స్ జరిపే ప్రతీ ఒక్కరి అకౌంట్ వివరాలను పరిశీలించాలని కేంద్రం భావిస్తోంది.

No comments: