11/17/16

ప్రభుత్వ ఉద్యోగిని రోడ్డుపై తన్నిన పోలీసులపై చర్యలు..

ఓ బ్యాంకు దగ్గరలో డ్యూటీ చేస్తున్న పోలీసులకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మాధవ రెడ్డికి బండి పార్కింగ్ విషయంలో జరిగిన ఘర్షణ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. పోలీసులు సదరు ఉద్యోగిని రోడ్డుపైనే తన్నుకుంటూ జీపెక్కించుకుని తీసుకెళ్లారు. సదరు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే తాజాగా ఆ పోలీసులపై చర్యలు తీసుకుంటున్నారు.సీఐ గోరంట్ల మాధవ్‌ను వీఆర్‌కు బదిలీ చేశారు. ఎస్సైలు క్రాంతి కుమార్, జనార్ధన్‌పై చర్యలకు ఎస్పీ రాజశేఖర్ బాబు సిఫారసు చేశారు.


No comments: