11/17/16

అరుదైన రికార్డ్ సాధించిన కోహ్లీ...

తనకు అచ్చొచ్చిన విశాఖలో విరాట్ కోహ్లీ అదరగొట్టాడు. ఇక్కడి రాజశేఖర్ రెడ్డి ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో కెప్టెన్ కోహ్లీ సెంచరీతో అలరించాడు. ఈ సెంచరీ ద్వారా ఓ అరుదైన ఘనత సాధించాడు. పది అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్లలో సెంచరీ/హాఫ్ సెంచరీలను 1.07 నిష్పత్తి(14/12) లో సాధించిన బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ మూడో స్థానాన్ని ఆక్రమించాడు. డాన్ బ్రాడ్‌మన్ 2.230 నిష్పత్తితో (29/13), హెడ్లీ 2 నిష్పత్తితో (10/50) అతనికంటే ముందున్నారు. కోహ్లీ తర్వాత ఈ జాబితాలో భారత్ తరపున మాజీ కెప్టెన్ అజారుద్దీన్ మాత్రమే ఉన్నాడు. కానీ అతను ఆరో స్థానంలో ఉన్నాడు.

No comments: