11/17/16

పాక్ కు చైనా మద్దతు...? పాక్ యుద్ధసన్నాహాల్లో చైనా హెలీకాఫ్టర్లు

పాకిస్థాన్ మరోసారి తన దొంగబుద్ధిని బయటపెట్టింది. భారత సరిహద్దు ప్రాంతంలో చైనా అండతో రెచ్చిపోతోంది. సరిహద్దు ప్రాంతంలో నిన్న పాకిస్థాన్ జరిపిన యుద్ధసన్నాహాలను పరిశీలించిన భారత ఆర్మీ అధికారులకు విస్మయాన్ని కలిగించే అంశం కంటపడింది. పాక్ ఆర్మీ నిర్వహించిన డ్రిల్‌లో చైనాకు చెందిన అత్యంత అధునాతనమైన హెలీకాఫ్టర్లు ఉన్నాయి.

                             

అత్యాధునికమైన టెక్నాలిజీతో రూపొందిన ‘డబ్ల్యూజెడ్-10' చైనా హెలీకాఫ్టర్ల కనిపించాయి. ఈ హెలీకాఫ్టర్లతో యుద్ధట్యాంకులను కూడా ధ్వంసం చేయవచ్చు. ఆయుధాలను కూడా భారీగా తరలించవచ్చు. ‘యుఎస్ ఏహెచ్-64 అపాచీ’ పేరుతో అమెరికా వద్ద చైనా హెలీకాఫ్టర్లకు సమానమైనవి హెలీకాఫ్టర్లు ఉన్నాయి. ఈ హెలీకాఫ్టర్లను గల్ఫ్ యుద్ధ సమయాలలో, ఆఫ్ఘనిస్థాన్‌లోని ఉగ్రవాదులను ఏరివేసిందుకు మాత్రమే ఉపయోగించారు. అమెరికా నుంచి 22 ‘యుఎస్ ఏహెచ్-64 అపాచీ’ హెలీకాఫ్టర్ల కొనుగోలుకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ఇంతవరకూ భారత్‌కు చేరలేదు. ఇలాంటి హెలీకాఫ్టర్లను పాకిస్థాన్ ఇదివరకెప్పుడూ ప్రదర్శించలేదు. ఉన్నట్టుండి నిన్న డ్రిల్‌లో కనిపించడంతో చైనా బాహాటంగా పాక్‌కు మద్ధతిచ్చిన్నట్టుగా కనిపిస్తోంది. యురీ ఉగ్రవాదదాడి అనంతరం భారత్, పాక్ మధ్య యుద్ధవాతారణం ఏర్పడిన సంగతి తెలిసిందే. తాజాగా పాక్ నిర్వహించిన ఈ యుద్ధసన్నాహాలతో యుద్ధవాతావరణం మరింత వేడెక్కింది.

No comments: