11/11/16

చాలామందికి తెలియని ఒక షాకింగ్ న్యూస్ చెప్తా....

చాలామందికి తెలియని  ఒక షాకింగ్ న్యూస్  చెప్తా....
ఉర్జిత్ పటేల్....  ప్రస్తుత భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్.
సుప్రసిద్ధ ఆర్ధిక మేధావి అయిన ఉర్జిత్ పటేల్  భారత ఆర్ధిక వ్యవస్ధను అభివృధ్ధి చేయడంలో ప్రధాన పాత్ర వహించి  పీవీ నరసింహారావు, నరేంద్ర మోదీ, చిదంబరం, మన్మోహన్ సింగ్,  అరుణ్‌ జైట్లీ లాంటి వారి మన్ననలు పొంది  2013 జనవరి 11 నుంచి ఆర్.బీ.ఐ కి  డిప్యుటీ గవర్నర్ గా ఎన్నికయ్యాడు. మూడేళ్ళు ఆ పదవి నిర్వహించాకా ఇన్‌ఫ్లేషన్‌ వారియర్‌ గా గుర్తింపు పొందడంతో పాటు  ప్రతిష్టాత్మకమైన    ఆర్.బీ.ఐ కు గవర్నర్ పదవికి 20 ఆగస్టు 2016 న ఎన్నికయ్యాడు.


ఇతని గురించి  చెప్పాల్సిన మరొక ముఖ్య విషయం ఏంటంటే... ఇతను ప్రభుత్వం తరపున పనిచేస్తూనే   ప్రైవేటు రంగంలోనూ తనదైన ముద్ర వేసుకున్నాడు. రిలయన్స్ సంస్ధ అధినేత ముఖేష్ అంబానీకి ఉర్జిత్ పటేల్  అత్యంత ఆప్తుడు, రిలయన్స్ పరిశ్రమల వ్యాపార అభివృద్ధి విభాగానికి అధ్యక్షుడిగా  ఉర్జిత్ పనిచేసాడు,  అక్కడ పనిచేస్తున్నపుడే మోడీతో పరిచయం పెరిగి  బాగా క్లోజ్ అయ్యాడు, ఆ తరువాత మోడీ చొరవతోనే  గుజరాత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ బోర్డులోనూ రెండేళ్లు పనిచేశాడు కూడా.   ఇంతకీ ముఖేష్ అంబానీకి ఫైనాన్షియల్ అడ్వైజెస్ ఇచ్చేది  ఎవరో తెలుసా ఉర్జిత్ పటేల్ నే..!

సో... ఆర్బీఐ తీసుకునే ప్రతీ నిర్ణయమూ, ప్రతీ కదలిక , ముఖేష్ అంబానీ కనుసన్నల్లో ఉంటుందని, అతనికి ఆ వివరాలన్నీ ముందే తెలుస్తాయనీ మీకు వేరే చెప్పక్కర్లేదనుకుంటాను. 500, 1000 నోట్లు ఆపేస్తారని అతనికి ముందే తెలియడంలో ఆశ్చర్యం ఏమీ లేదని  ఇప్పుడర్ధం అయ్యిందా...  ముఖేష్ అంబానీ జియో ని ఎందుకు స్టార్ట్ చేసాడో...? ఖరీదైన సిమ్ ని ఉచితంగా ఎందుకు ఇచ్చాడో...?   తన దగ్గర బిలియన్స్ కొద్దీ ఉన్న  బ్లాక్ మనీని వైట్ గా ఎలా మార్చుతున్నాడో...? డిసెంబర్ 30 వరకూ మాత్రమే ఉచితంగా జియో ని ఎందుకు ఇస్తున్నాడో...? అది జియో వెనుక ఉన్న  అసలు  కధ.

ఇప్పుడు ముకేష్ పెట్టిన పెట్టుబడి అంతా వచ్చే జనవరి నుంచి వైట్ గా మారి అతనికి చేరుతుంది.  వ్యాపారంలో డబ్బులు పెట్టింది పోగొట్టుకోవడానికి కాదనీ,   మరిన్ని ఆశ్చర్యాల కోసం మీరు వేచిచూడాల్సిందే అంటూ  గత నెలలో ముకేష్ ఇచ్చిన స్టేట్మెంట్ వెనుక ఇంత కధ ఉంది.   ఆ తెలివితేటలు ఉన్నాయి కాబట్టే అంత  బిజినెస్ ను సమర్ధవంతంగా నడపగలుగుతున్నాడు మరి....!

No comments: