బ్యాంకుల్లో పెద్ద నోట్ల మార్పిడిని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. అయితే కేవలం తమ ఖాతాల్లో వేసుకోవడానికి అనుమతిచ్చింది. ఈ నెల 8న ప్రధాని మోదీ పెద్ద నోట్ల రద్దుపై ప్రకటన చేస్తూ నోట్ల మార్పిడికి కొన్ని షరతులతో గడువిచ్చారు. అయితే నోట్ల మార్పిడికి సంబంధించి అనేక అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పలువురు బ్యాంకర్లు, ముఠాలు మాఫియాగా ఏర్పడి కమిషన్ ప్రాతిపదికన అక్రమంగా నోట్ల మార్పిడి చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎవరివద్ద అయినా పాత 500, వెయ్యి నోట్లు ఇంకా మిగిలిపోయి ఉంటే వారు తమ అకౌంట్లలో జమ చేసుకోవచ్చు. తర్వాత విత్ డ్రా చేసుకోవచ్చు.
No comments:
Post a Comment