మొహాలీ టెస్టులో ఇంగ్లండ్ జట్టు తడబడుతుండగా, భారత్ విజయం దిశగా పయనిస్తోంది. 4 వికెట్ల నష్టానికి 78 పరుగులతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్.. ఆదిలోనే బ్యాటీ వికెట్‌ను కోల్పోయింది. ఏడు బంతులు ఆడిన బ్యాటీ పరుగులేమీ చేయకుండానే జడేజా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. బంతి తక్కువ ఎత్తులో వచ్చినప్పటికీ పార్థివ్ చక్కగా దాన్ని ఒడిసిపట్టుకున్నాడని కామెంటేటర్లు పార్థివ్‌ను ప్రశంసించగా, అది పార్థివ్ హైట్‌కు సరిపడే ఎత్తులోనే వచ్చిందని నెటిజన్లు సెటేర్లు వేస్తున్నారు. మూడో రోజు జయంత్ యాదవ్ బౌలింగ్‌లో బెయిర్‌స్టో షాట్ ఆడేందుకు ప్రయత్నించగా అది కీపర్ చేతుల్లోకి వెళ్లింది. నేలకు కేవలం ఏడు సెంటీమీటర్ల ఎత్తులో వచ్చిన ఆ బంతిని పార్థివ్ చక్కగా ఒడిసిపట్టుకున్నాడు. పొట్టిగా ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటో చూపాడు.
ఏడోస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బట్లర్ కూడా నిరాశ పరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 43 పరుగులు చేసి ఇంగ్లండ్‌ను ఆదుకున్న బట్లర్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 18 పరుగులకే అవుటయ్యాడు. గాయం కారణంగా ఓపెనర్‌గా బరిలో దిగలేకపోయిన యువ ఆటగాడు హసీబ్ హమీద్ ప్రస్తుతం బ్యాటింగ్‌కు వచ్చాడు. ఓ వైపు వరుసగా వికెట్లు కోల్పోతున్నా.. ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ జోయ్ రూట్ మాత్రం ఓపికగా ఆడుతూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఓపెనర్‌గా బరిలో దిగిన రూట్ 149 బంతులాడి అర్ధ సెంచరీ సాధించాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో చేసిన స్కోరును సమం చేయాలంటే ఇంగ్లండ్‌కు మరో 16 పరుగులు పరుగులు అవసరం. రూట్, హసీబ్‌లను త్వరగా అవుట్ చేస్తే నాలుగో రోజే మ్యాచ్‌ను భారత్ సొంతం చేసుకోవడం ఖాయం.

No comments:
Post a Comment