11/22/16

జక్కన్న ఫ్యామిలీ నుంచి హీరో ఎంట్రీ....

రాజమౌళి కుటంబ సభ్యులు ఇప్పటికే సినిమా పరిశ్రమలోని అన్ని రంగాల్లోనూ ప్రతిభావంతులు. దర్శకధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ రచయిత, అన్న కీరవాణి సంగీత దర్శకుడు, పెదనాన్న శివశక్తిదత్తా గీత రచయిత, వదిన లైన్‌ ప్రొడ్యూసర్‌, భార్య కాస్ట్యూమ్‌ డిజైనర్‌.. ఇలా ఆయన కుటంబ సభ్యులు సీనీ రంగానికి సంబంధించి చాలా రంగాల్లో ఉన్నారు. తెరవెనుకే అందరూ పనిచేస్తున్నారు గానీ, తెరముందు అంటే నటులు ఎవరూ లేరు. ఆ లోటును తీర్చనున్నాడట రాజమౌళి కొడుకు ఎస్‌ ఎస్‌ కార్తికేయ. ‘బాహుబలి’ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన కార్తికేయ కూడా దర్శకుడు అవుతాడనకున్నారు చాలామంది. అయితే రాజమౌళి మాత్రం తన కొడకును హీరోగా చూడాలనుకుంటున్నాడట. అందుకే కార్తికేయకు నటనలో శిక్షణ ఇప్పిస్తున్నాడట. త్వరలోనే కార్తికేయ లాంఛింగ్‌ ఉంటుందట. ఎంతోమందికి మరపురాని విజయాలను అందించిన రాజమౌళి తన కొడుకుతో ఎలాంటి సూపర్‌హిట్‌లు తీస్తాడో చూడాలి.



No comments: